వైసీపీ పార్టీలో జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి తిరుగు లేదు అనే భావన ఉంటుంది. ఇది కొంచెం నిజం కూడా. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నవి చూస్తూనే అర్ధమవుతుంది. మూడు రాజధానులు అంటూ, జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో, ఎవరూ సంతోషంగా లేరు. అమరావతి రైతులు అయితే, 12 రోజులుగా రోడ్డున పడి ఆందోళన చేస్తున్నారు. చివరకు ఎప్పుడూ లేనిది, ఉద్యమంలోకి, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, పిల్లలు కూడా రోడ్డున పడ్డారు. ఇవన్నీ చూస్తుంటేనే, ఉద్యమం ఏ స్థాయిలో ఉందొ అర్ధమవుతుంది. అయితే అనూహ్యంగా, అక్కడ వైసీపీ ప్రజా ప్రతినిధులు మాత్రం, అడ్డ్రెస్ లేరు. తాడికొండ ఎమ్మెల్యే కాని, మంగళగిరి ఎమ్మేల్యే కాని, కనీసం వారికి మద్దతు పలకలేదు, లేదా జగన్ తో మాట్లాడుతాం అని కూడా చెప్పలేదు. చివరకు కృష్ణా, గుంటూరు జిల్లా ఎమ్మేల్యేలు సమావేశం అయ్యి, జగన్ నిర్ణయానికి జై కొట్టారు. వైసీపీలో పరిస్థితి ఇది. అయితే, అనూహ్యంగా ఒక్కరు మాత్రం, జగన్ నిర్ణయాన్ని అసలు లెక్క చెయ్యనట్టు కనిపిస్తారు.

raghu 28122019 2

ఆయనే ఎంపీ రఘురామ కృష్ణం రాజు. పార్లమెంట్ లో తెలుగుకు జై కొట్టి జగన్ ను ఇబ్బంది పెట్టటం, విజయసాయి లేకుండా ఎవరినీ ఢిల్లీలో కలవద్దు అని చెప్పినా, పదే పదే అందరినీ కలవటం, పైగా పార్టీకి సంబంధం లేకుండా, ఢిల్లీలో అందరికీ విందు ఇవ్వటం, ఇవన్నీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. అదేమని అడిగితె, తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు అంటూ చెప్తూ ఉంటారు. ఇప్పుడు రఘు రామ కృష్ణం రాజు, మరో సారి సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తూ, దీని పై సిబిఐ కాని, ఇంకా ఏమైనా న్యాయ విచారణ చేస్తామని, నిన్న క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని, ప్రకటించిన సంగతి తెలిసిందే.

raghu 28122019 3

ఇన్సైడర్ ట్రేడింగ్ పై, సిబిఐ విచారణ అంటూ జగన్ చెప్పటం పై, రఘు రామ కృష్ణం రాజు, ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే దానికి చట్ట పరంగా బలం లేదని తేల్చి చెప్పారు. అమరావతి రాజధానిగా వస్తుందని, శంకుస్థాపన చేసిన తరువాత, ఎవరికైనా తెలుస్తుంది, డబ్బు ఉన్న వాడు భూమి కొనుక్కుంటాడు, దాంట్లో తప్పు ఏమి ఉంది. ఇదేమీ న్యాయ పరంగా తప్పు కాదు, కాని నైతికంగా తప్పు అని చెప్పచ్చు. అయినా, ఇదేమి న్యాయం ముందు నిలవదు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేదానికి చట్టం అనేది లేదు. ఒకవేళ జగన్ ఏమైనా దీని పై చట్టం తెస్తే తప్పితే, దీని పై జరిగేది ఏమి ఉండదు అంటూ, తేల్చి చెప్పారు. అయితే అమరావతి పై ఒక బూచిగా వైసీపీ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ చెప్తుంటే, సొంత పార్టీ నేత మాత్రం, అసలు అది పస లేని వాదన, దానితో ఏది కాదు అని తేల్చి చెప్పారు.

వైసీపీ మంత్రులు, మీడియా ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్తారో అందరికీ తెలిసిందే. వారు చెప్పినంత నాక్ గా చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు. రాజకీయ నాయకులను ఇబ్బంది పెట్టే, మీడియానే, వీరు ఎదురు ఇబ్బంది పెడతారు. అంతలా, వీరు సమాధానం చెప్తారు. తమ అనుకూల మీడియా ప్రశ్నలు వేస్తె, చక్కగా చెప్తారు. తమ అనుకూల మీడియా కాకుండా, వేరే మీడియా అయితే, ఆ ప్రశ్నలు తమకు ఇబ్బంది అయితే మాత్రం, ఒంటి కాలు మీద ఆ మీడియా పై లెగుస్తారు. నువ్వు పలనా ఛానల్ కదా, ఆ పార్టీకి మీరు అనుకూలం కదా అంటూ, ఎదురు దాడి చేసి, అమాధానం చెప్పకుండా తప్పించుకుంటారు. ఎంతటి క్లిష్టమైన ప్రశ్న అయినా, తమకు అనుకూలంగా మార్చేసుకుని, చెప్పుకుంటూ, ఆ ప్రశ్న చుట్టూ రాజకీయం చేసి సమాధానం చెప్తారు. మీడియా ముందుకు తరుచూ వచ్చే, మంత్రులు అయితే, వారికి ఈ విద్యా ఇంకా బాగా తెలుసు. అయితే, ఇంతటి ఎదురు దాడి చేసే మంత్రులు కూడా, ఇప్పుడు మీడియా ఆడితే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేక పోతున్నారు.

perni 28122019 2

అన్ని ప్రశ్నలకు అనర్గళంగా చెప్పే మంత్రులు, ఈ ప్రశ్నను మాత్రం దాట వేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే విషయం పై మీడియా ఒక ప్రశ్న అడుగుతుంది. ఇంతకీ మన రాజధాని ఏది ? అంటే మాత్రం, మంత్రులు సమాధానం చెప్పటం లేదు. ఇటు అమరావతి అని చెప్పటానికి నోరు రాక, అటు కర్నూల్ అని , వైజాగ్ అని చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. క్యాబినెట్ సమావేశానికి కంటే ముందు రోజు, బొత్సా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, మీడియా ఇదే ప్రశ్న అడిగింది. సర్, ఇంతకీ మన రాజధాని ఏది అంటే, మూడిట్లో ఏ పేరు చెప్పాలి అని అడగగా ? విలేఖరులు అడిగిన, ఈ ప్రశ్నకు, బొత్సా సమాధానం చెప్పలేక, ఇబ్బంది పడ్డారు.

perni 28122019 3

చెప్తాం, రాజధాని పేరు ఏంటి అనేది, రేపు క్యాబినెట్ సమావేశం అయిన తరువాత మీకే చెప్తాం అంటూ తప్పించుకున్నారు. ఇక నిన్న క్యాబినెట్ సమావేశం అయిన తరువాత, ఆ వివరాలు చెప్పటానికి పేర్ని నాని మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంలో కూడా ఒక విలేఖరి, సార్ మన రాజధాని ఏది అంటే, ఏమి చెప్పాలి అని అడగగా, ‘‘ఎప్పుడు రాసుకుంటారు? తమరి పేరు? ఏ మీడియా మీది.. మీరు ఏ రోజు రాసుకోవడానికి అడుగుతున్నారు?’’ అంటూ మీడియాకే ఎదురు ప్రశ్న వేసారు. అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల పై ప్రకటన చెయ్యలేదని, ఆయన కేవలం తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పారని, దాన్ని పట్టుకుని, మీరు రచ్చ చేస్తున్నారని, ఎదురు మీడియాకే చెప్పారు. మొత్తానికి, ఇద్దరు మంత్రులూ, రాజధాని ఏది అంటే మాత్రం, చెప్పలేక పోతున్నారు.a

ఈ రోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో, అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ పై, చంద్రబాబు పై సిబిఐ ఎంక్వయిరీ వేస్తున్నారు అంటూ ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. దీని పై చంద్రబాబు ఈ రోజు ప్రెస్ మీట్ లో స్పందించారు. ఒక్క ముక్కలో ఆ విషయాన్నీ తీసి పారేసారు. "సీబీఐ విచారణపై జగన్కుో అంత గౌరవం ఉంటే శుక్రవారం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు? తన కేసులపై సత్వర విచారణ కోరుతూ సీబీఐకి జగన్ లేఖ రాయొచ్చు కదా? వివేకా కేసులో సీబీఐ విచారణ ఎందుకు కోరలేదు? మేం రైతుల కోసం పోరాడుతుంటే మాపై సీబీఐ విచారణ అంటున్నారు. ఎలాంటి విచారణ అయినా చేసుకోండి, మేం భయపడం మేం ఏ తప్పు చేయలేదు.. భయపడే వాడు ఎవరు లేరు. దిక్కున్న దగ్గర చెప్పుకో అన్నాం. నేను లేస్తే మనిషిని కానంటారు, కానీ లెగవలేరు. తవ్వుతున్నాం, తవ్వుతున్నాం అని ఏడు నెలలుగా అంటున్నారు. ఎక్కడో జగ్గయ్యపేటలో 500 ఎకరాలు ఉంటే దాన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ అంటున్నారు."

cbn press 27122019 2

"ఆ భూమి వద్దు, మేము తీసుకోవడం లేదు, పరిశ్రమ పెట్టడంలేదని భరత్ చెబితే ప్రతిరోజూ దానిపై ఆరోపణలు చేస్తారు. చట్టపరంగా నీ వల్ల ఏమైతే అది చేసుకోండని అన్నాం. నువ్వు వేరేవాళ్ల దయాదాక్షిణ్యాల మీద ఉన్నావు, నేను లేను.. రాజధానికి టీడీపీ వాళ్లే భూములు ఇచ్చారని ప్రచారం చేశారు. అక్కడ వైసీపీ ఎలా గెలిచింది? మాట్లాడుతున్న దాంట్లో అర్థం ఉండాలి. ఆందోళన చేస్తున్న రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ప్రజల్ని అవమానిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. రాయలసీమలో రాజధాని ఎందుకు పెట్టరని అడుగుతున్నారు.. వాళ్లకు ఏం సమాధానం చెప్తారు? ఒక పేదవాడు తన పనికోసం ఊరూరా తిరగాల్నా..? ఈ చివర గ్రామం జిల్లా కేంద్రానికి, అక్కడ నుంచి మరో చివర రాజధానికి, మధ్యలో హెచ్ వోడిల వద్దకు తిరగాల్నా..? మీ వక్రమైన తెలివితేటలను రాష్ట్రంపై, ప్రజలపై చూపించకండి. మీ వక్రబుద్దితోనే రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోయారు."

cbn press 27122019 3

"నోటీసులు ఇవ్వకుండా ఎంపీని హౌస్ అరెస్ట్ చేస్తారా? ధర్నా చౌక్కిద వెళ్లే హక్కు మాకు లేదా? ఆ రోజు నాపై రాళ్లు వేసినప్పుడు నిరసనలు తెలిపే హక్కు ఉందని, రాజ్యాంగం స్వేచ్ఛఅందరికీ ఇచ్చిందని చెప్పింది ఈ డీజీపీ యే కదా..? మరి కేశినేని నాని ఎందుకని హవుస్ అరెస్ట్ చేశారు..? ఆందోళన చేస్తున్న తన ప్రాంత ప్రజలకు సంఘీభావంగా ఎంపిని వెళ్లకుండా అడ్డుకునే అధికారం ఎవరిచ్చారు..? విశాఖలో 24కిమీ మానవ హారాలు బలవంతంగా జనాన్ని దించి చేస్తుంటే అడ్డుపడరా..? ఇక్కడ మానవహారాలకు అడ్డం పడతారా..? డీజీపీ ఇష్టానుసారం వ్యవహరిస్తే ప్రజలు గమనిస్తున్నారు. సీనియర్ నాయకుడిగా పోలీస్ వ్యవస్థకు వార్నింగ్ ఇస్తున్నా. చట్టం అందరికీ సమానం.. కొందరికి చుట్టం కాదు. వైసీపీ నేతలు, జగన్కుల చట్టం వర్తించదా? మందడంలో అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలి. రైతుల జీవితాలతో ఆడుకోవద్దు. రైతులకు, మహిళలకు సానుభూతిగా అన్నిజిల్లాల రైతులు,మహిళలు ఉండాలి.వారిపట్ల సంఘీభావం చూపాలి. ముఖ్యమంత్రి చెప్పాడని రైతులను, రైతు కూలీలను వేధిస్తే సహించేది లేదు. జగన్ రాజ్యాంగం, జగన్ చట్టాలు దేశంలో ఉండవు. భారత రాజ్యాంగం, భారత చట్టాలే ఉంటాయని’’ చంద్రబాబు పేర్కొన్నారు.

జగన్ మొండి వాడు, ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే, వెనక్కు తగ్గేది లేదు, ఎవరు చెప్పినా వినరు, ఆయన నైజం తెలిసిన వాళ్ళు ఎవరూ ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించే సాహసం చెయ్యరు, వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళు అయినా, జగన్ మాట వినాల్సిందే.. ఇది వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు, జగన్ గురించి చేసే ప్రచారం. అయితే అనేక సందర్భాల్లో జగన్ మాట మార్చారు అనుకోండి అది వేరే విషయం. అయితే, నిన్న కీలకమైన రాజధాని విషయంలో, ఏమి జరిగిందో ఎవరికీ అర్ధం కావటం లేదు. మూడు రాజధానుల నిర్ణయం పై, నిన్న క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటారు అంటూ, ప్రచారం హోరెత్తించారు. అంతే కాదు, దానికి తగ్గట్టు వైసీపీ చేసిన హడావిడి కూడా అంతా ఇంతా కాదు. ఒక పక్క ప్రభుత్వం, అమరావతిలో 144 సెక్షన్ పెట్టటం, మనిషికి ఒక పోలీసు, టియర్ గ్యాస్ వ్యాన్ లు, వాటర్ క్యానన్లు, ఫైర్ ఇంజిన్లు, ఇలా ఒక యుద్ధ వాతావరణం సృష్టించారు. ఇక మరో పక్క వైసీపీ పార్టీ, విశాఖపట్నంలో చేస్తున్న హడావిడి కూడా అంతా ఇంతా కాదు.

amaravati 28122019 2

కనీవినీ ఎరుగని రీతిలో, 24 కిమీ మానవహారం ఏర్పాటు చేసి, జగన్ కు భారీ స్వాగతం పలకాలని, నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ అమరావతిలో, అక్కడ వైజాగ్ లో వాతావరణం చూసిన అందరూ, ఇక క్యాబినెట్ లో, మూడు రాజధానులకు ఆమోదం తెలుపుతారని, డిసైడ్ అయిపోయారు. అందరూ మానసికంగా రెడీ అయ్యారు. అమరావతి ప్రాంత ప్రజలు, భారీ ఆందోళనకు సిద్ధం అయ్యారు. అయితే, క్యాబినెట్ సమావేశ వివరాలు చూసి, ఇప్పుడే రాజధాని పై నిర్ణయం తీసుకోమని, మరో కమిటీ రావాలని, ఆ కమిటీ పై ఇంకో కమిటీ వేస్తామని చెప్పటంతో, అందరూ షాక్ అయ్యారు. ఇంత హడావిడి చేసి, జగన్ స్వభావం తెలిసి, ఇలా వెనకడుగు ఎందుకు వేసారో ఎవరికీ అర్ధం కాలేదు. ఎక్కువ టైం ఇచ్చే కొద్దీ, అమరావతి ఉద్యమం ఊపు అందు కుంటుందని, తెలిసినా, ఇలా ఎందుకు చేసారు అంటూ గుసగుసలు మొదలయ్యాయి.

amaravati 28122019 3

ఎవరో బలమైన వ్యక్తీ ఒత్తిడి లేకపోతే, జగన్ ఇలా వెనకడుగు వెయ్యరనే ప్రచారం జరుగుతుంది. ఢిల్లీ లెవెల్ లో ఏదో జరిగిందని, దానికి బలం చేకూరుస్తూ జరిగిన సంఘటనలు ఉదహరిస్తున్నారు. రెండు రోజుల క్రితం వెంకయ్య నాయుడు, నేను ఎవరికి చెప్తానో వారికి చెప్తాను అని చెప్పటం, నిన్న సుజనా చౌదరి రాష్ట్రపతిని కలవటం, అమిత్ షాకి ఈ విషయం పై ఫిర్యాదులు వెళ్ళటం, ఇవన్నీ ఉదహరిస్తున్నారు. అయితే వీటి అన్నిటితో పాటుగా, నిన్న కేంద్ర మాజీ మంత్రి జగన్ తో గంట పాటు సమావేశం అవ్వటం కూడా, ఈ విషయం పైనే అని తెలుస్తుంది. కేంద్రం దూతగా ఆయన వచ్చారనే ప్రచారం జరుగుతంది. ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి కాదు. అలాంటిది గంట పాటు సమావేశం అవ్వటం చూస్తే ఏదో ఉందనే చెప్తున్నారు. మొత్తంగా ఢిల్లీ లెవెల్ లో అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావటంతో, జగన్ ప్రస్తుతానికి వెనకడు వేసారని, త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లి, ఢిల్లీ పెద్దల్ని ఒప్పించి, దీని పై ముందుకు వెళ్తారని సమాచారం.

Advertisements

Latest Articles

Most Read