నిరుద్యోగ యువతకు రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అందిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ఒడిశా ప్రభుత్వ అధికారుల బృందం రాష్ట్రానికి మంగళవారం వచ్చింది. ఇటీవల విడుదల చేసిన ఇండియా స్కిల్స్ రిపోర్టు 2019 ప్రకారం దేశంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు పొందే నైపుణ్యాలు ఉన్న యువత ఉన్న రాష్ట్రంగా ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. దీనికి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అమలు చేస్తున్న కార్యక్రమాలే కారణమని ఆ నివేదిక వెల్లడించింది. దీంతో వివిధ రాష్ట్రాలు ఏపీలో అమలు చేస్తు న్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు వస్తున్నాయి. ఇటీవలే గుజరాత్ అధికారుల బృందం వచ్చి అధ్యయనం చేసి వెళ్లింది.

orissa 19122018

తాజాగా ఒడిశా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారుల బృందం రెండు రోజుల పర్యటనకు విజయవాడకు వచ్చింది. ఈ బృందానికి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ కృతిక శుక్లా పవర్ పా యింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం గుంటూరు జిల్లా నంబూరులోని గూగుల్‌కోడ్‌ ల్యాబ్‌, సీమెన్స్‌ ఎక్సలెన్స్‌ కేంద్రం, నాగార్జున వర్సిటీలో డస్సాల్ట్‌ మదర్‌ హబ్‌ త్రీడీ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి విద్యార్థులను శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఏపీలో ఏర్పాటు చేస్తున్న వివిధ కంపెనీలతో కలసి పని చేయడాన్ని వివరించారు. వివిధ రంగాలకు అవసరమైన విధంగా యువతకు శిక్షణ ఇస్తున్న తీరు, విశాఖలో స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన గురించి బృందానికి తెలిపారు.

orissa 19122018

ముఖ్యమంత్రి యువనేస్తం కింద భృతి పొందుతున్న వారికి 522 కేంద్రాల ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల, కళాశాలల విద్యార్థులకు అకడమిక్‌ పాఠ్యాంశాలతో పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వడాన్ని ఒడిశా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారుల బృందం కొనియాడింది. విద్యార్థులు కళాశాలల నుంచి వచ్చేసరికే పూర్తి నైపుణ్యతతో ఉండేందుకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంది. ఉద్యోగావకాశాలు పొందే నైపుణ్యాలు కలిగిన యువత అధికంగా ఉన్న రాష్ట్రంగా ఏపీ జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన నేపథ్యంలో ఇక్కడి విధానాలను తెలుసుకునేందుకు ఒడిశా అధికారుల బృందం వచ్చింది. ఒడిశాలో ప్రధానంగా ఐటీఐ, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంపైనే దృష్టిసారించినట్లు తెలిపారు.

‘‘విదేశాల్లో మూల్గుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాం..’’ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన ఈ హామీపై ప్రతిపక్షాలు ప్రధాని మోదీ, బీజేపీలను తరచూ నిలదీస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే ప్రధాని హామీకి పూర్తి భిన్నంగా స్పందించి పప్పులో కాలేశారు. మహారాష్ట్రలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు’’ ఒకేసారి రావనీ.. కొద్దికొద్దిగా వస్తాయని పేర్కొన్నారు. ‘‘15 లక్షల రూపాయలు ఒకేసారి రావు, నెమ్మదిగా వస్తాయి. ప్రభుత్వం దగ్గర అంత డబ్బులు లేవు. ఆర్బీఐని డబ్బులు అడిగినా వాళ్లు ఇవ్వడం లేదు. అందువల్ల డబ్బులు సమీకరించడం కుదరదు. హామీ అయితే ఇచ్చాంగానీ దానికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి...’’ అంటూ చెప్పుకొచ్చారు.

lakhs 19122018 2

2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ... విదేశీ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున నల్లధనం మూల్గుతోందనీ... దాన్ని వెనక్కి తీసుకొస్తే ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమచేయవచ్చని పేర్కొన్నారు. తాను అధికారంలోకి వస్తే... వంద రోజుల్లోగా నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. సామాన్యుడి ఆశలకు రెక్కలు తొడగడంతో పాటు మోదీని అమాంతం ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిన ఈ హామీ నీటిమీద రాతేనని తేలిపోవడంతో... ఇప్పుడు ప్రతిపక్షాలు ఇదే అస్త్రంగా మోదీ, బీజేపీలను నిప్పుల మీద నిలబెట్టేందుకు సిద్ధమయ్యాయి.

 

lakhs 19122018 3

తాజాగా జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంపై మాట్లాడుతూ.. ‘‘మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలిచింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో వారిని ఓడిస్తాం. ఈ సారి కూడా మోదీనే ప్రధాన మంత్రి అవుతారు.’’ అని అన్నారు. దేశం దాటి వెళ్లిన నల్ల ధనాన్ని భాజపా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో స్వదేశానికి రప్పించి ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మోదీ 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చారు. ఈ హామీని ఇప్పటివరకూ నెరవేర్చకపోవడంతో దీన్ని భాజపా తుంగలో తొక్కిందంటూ కాంగ్రెస్‌ తరచూ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

ఆర్థిక సాయం అందించి పసి హృదయానికి పునర్జన్మనిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అతిపిన్న వయసులోనే గుండె మార్పిడి చేయించుకుని పునర్జన్మ పొందిన పిన్న వయస్కుడైన అబ్రహం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలసి కృతజ్జ్ఞతలు తెలిపాడు. వెలగపూడిలోని సచివాలయంలో వైజాగ్ జిల్లాలోని ఆనందపురం మండలం బోని గ్రామవాసి అబ్రహం తన తండ్రి గోపాల్ తో వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్నాడు. కొన్నాళ్ళక్రితం గుండె సంబంధ సమస్యతో సతమతమవుతూన్న అబ్రహంకు గుండె ఆపరేషన్ విషయమై సహాయం చేయాలని గోపాల్ సీఎం చంద్రబాబుకు మొర పెట్టుకున్నాడు.

cbnhelp 19122018 2

తక్షణం ముఖ్యమంత్రి స్పందించి అబ్రహం గుండె ఆపరేషన్ కోసం సీఎంఆర్ ఎఫ్ నుంచి పది లక్షల రూపాయలు మంజూరు చేశారు. బెంగుళూరులోని ఆసుపత్రిలో అబ్రహంకు విజయవంతంగా గుండె ఆపరేషన్ జరగడంతో సాధారణ జీవితం గడపగలుగుతున్నాడు. పూర్తిగా కోలుకున్న తర్వాత అబ్రహంను ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకు వచ్చారు. "మీరు సకాలంలో ఆదుకుని మా కుమారుడికి పునర్జన్మనిచ్చారని" అబ్రహం తండ్రి గోపాల్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపాడు.

ఐటీ రంగంలో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ సత్ఫలితాలను ఇస్తోంది. ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టగా, తాజాగా మరో ఆరు కంపెనీలు రాజధాని అమరావతిలో బుధవారం ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండటంతో రాష్ట్రం కూడా ఐటీ హబ్‌గా మారుతోందనవచ్చు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీఏన్నార్టీ కార్యాలయం ఇన్ఫోసైట్ భవనంలో ఏర్పాటైన ఐదు కంపెనీలను మంత్రి ప్రారంభించారు. జిటి కనెక్టు ఇండియా, పారికరం ఐటి సొల్యూషన్స్, టెక్ స్కేప్, ట్రెండ్ సాఫ్ట్, డియాగ్నో స్మార్ట్ సొల్యూషన్స్ కంపెనీలు తమ కార్యాకలాపాలను ప్రారంభించాయి. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఐటీ రంగం జీరోగా ఉండేది.

itcopanies 19122018 2

రాష్ట్రంలో ఐటీ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆనేక రాయితీలతో అనేక కంపెనీలు ముందుకు వచ్చాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఇక్కడ ఐటీ పాలసీలను రూపొందించారు. మంత్రి చొరవతో తీసుకువచ్చిన డీటీపీ పాలసీ చిన్న, మధ్య తరగతి కంపెనీలకు వరంగా మారింది. 50 శాతం అద్దె రాయితీతో అద్దెకు భవనాలు ప్లగ్ అండ్ ప్లే విధానంలో లభిస్తుండటంతో భారీ ఎత్తున ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇందుకు ఏపీఎన్నార్టీ, ఏపీఈఐటీఏ సహకాకరం కూడా ఉపయోగపడుతోంది. విజయవాడలో బిజినెస్ స్పేసెస్ కార్యాలయంలో ఏపీ ఆన్‌లైన్ కంపెనీని లోకేష్ ప్రారంభించారు. ఈ ఆరు కంపెనీలతో 600 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇప్పటి వరకూ ఏపీఎన్నార్టీ ద్వారా 87 చిన్న కంపెనీలు ఏర్పాటు కాగా, 4610 మందికి ఉపాధి లభించింది.

itcopanies 19122018 3

ఇలాఉంటే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రఖ్యాతి గాంచిన టీసీఎల్ కార్యాకలాపాలు త్వరలో తిరుపతిలో ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుటు చేతుల ఈ నెల 20న భూమి పూజ నిర్వహించనున్నారు. మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ సమీపంలో 158 ఎకరాల్లో ఈ కంపెనీ ఏర్పాటు కానుంది. దీంతో తిరుపతి ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మారనుంది. ఏపీలో 2200 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. డిసెంబర్ 2019 నాటికి ఉత్పత్తి ప్రారంభించేందుకు లక్ష్యంగా నిర్మాణ పనులను చేపట్టనున్నారు. ఈ కంపెనీ ఏపీకి రావడంలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషించారు. భారత్‌లో ప్రతి సంవత్సరం 500 బిలియన్ డాలర్ల విలువైన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారం జరుగుతుండగా, అందులో 250 బిలియన్ డాలర్ల కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ పరికరాలను ఏపీలో తయారు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్టు టీసీఎల్ కంపెనీ ప్రతినిధులకు వివరించడంలో ఆయన కృతకృత్యులయ్యారు.

Advertisements

Latest Articles

Most Read