తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే తామే గెలిచినంతగా సంబరపడిపోవడం.. టీడీపీ ఓడిపోవడం తమ విజయమేనన్న రీతిలో వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు చేసుకోవడం ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకతకు దారితీసిందని ఆ పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. ఈ వ్యవహారం రాజకీయంగా తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌ మెడకు చుట్టుకుంటోందన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. రాజకీయ ప్రత్యర్థి, సీఎం చంద్రబాబుపై ఉన్న ద్వేషంతో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావును ప్రశంసించడం.. కేసీఆర్‌, ఆయన కుమారుడు కేటీఆర్‌ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం.. క్షీరాభిషేకాలు చేయడం.. రాష్ట్రంలో పర్యటించాలంటూ వారిని తమ పార్టీ నేతలు, శ్రేణులు ఆహ్వానించడం వారికి మింగుడుపడడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీల్లేదని కేసీఆర్‌ బహిరంగంగానే చెబుతున్నారు. మన రాష్ట్రానికి జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

jagan 201222018

సుప్రీంకోర్టులో ఇంప్లీడయ్యారు. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతతో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేసీఆర్‌నూ, కేటీఆర్‌నూ ప్రత్యేకంగా కీర్తిస్తూ.. ఏకంగా టీఆర్‌ఎస్‌ జెండాలను భుజాన వేసుకుని వైసీపీ వర్గాలు రోడ్లపైకి రావడం చూసి జనం ఆగ్రహిస్తున్నారని వైసీపీ ముఖ్యనేతలు చెబుతున్నారు. దీనిపై రాష్ట్ర మంత్రులు, టీడీపీ నేతలు ప్రతిరోజూ జగన్‌పై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు కూడా రాష్ట్రంలో ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా.. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా.. పోలవరం వద్దా.. ఇవి రావడం వైసీపీకి ఇష్టం లేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

jagan 201222018

టీడీపీ ఎదురుదాడి ఇలాగే కొనసాగితే.. అది ప్రజల్లోకి చేరితే మున్ముందు రాజకీయంగా ఇబ్బందులు తప్పవని వైసీపీ ముఖ్య నేతలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు తమకు రాష్ట్రమే ప్రధానమనే ధోరణిలో ప్రజల్లో ‘సెంటిమెంటు’ రగిలించి ఎన్నికల్లో విజయం సాధించారు. అందుకు భిన్నంగా వైసీపీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ.. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డుపడే టీఆర్‌ఎ్‌సకు మద్దతు పలకడం రాజకీయంగా ఏమాత్రమూ వాంఛనీయం కాదని అంతర్గతంగా ఆ నేతలు అంగీకరిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొత్తలో కేసీఆర్‌, చంద్రబాబు మధ్య పోలికలు, తేడాలపై చర్చలు జరగడం పరిపాటేనని.. కానీ దీర్ఘకాలంలో రాష్ట్ర ప్రయోజనాలే చర్చకు వస్తాయని వైసీపీ ముఖ్యనేతలు కొందరు అంగీకరిస్తున్నారు. జగన్‌ను, చంద్రబాబును పోల్చి చూసుకుని.. సీనియర్‌ నేతగా, పాలనాదక్షుడిగా చంద్రబాబు వైపే మొగ్గుతారని అంటున్నారు.

 

 

ఒంగోలులో టిడిపి నేతలను తమ వైపు లాగే కార్యక్రమాన్ని వైసీపీ ప్రారంభించింది. తెలంగాణ ఎన్నికల ముగిసిన అనంతరం దూకుడు పెంచింది. రాజ్యసభ సభ్యుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ద్వారా ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలను రాబట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆయన ప్రమేయంతో ఇప్పటికే ఒకరిద్దరు నాయకులు వైసీపీలో చేరగా, మరో ఇద్దరు, ముగ్గురు నేతలతో ప్రస్తుతం ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయసాయిరెడ్డి కదలికలపై టీడీపీ అధిష్ఠానం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలువురు నాయకుల పార్టీ ఫిరాయింపులకు అవకాశం ఏర్పడింది. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంతో స్థానికంగా ఆ పార్టీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. తదనుగుణంగా పార్టీలోకి దీటైన అభ్యర్థులను చేర్చుకునే చర్యలు చేపట్టింది.

vs 20122018 2

అందులో భాగంగా టీడీపీతో పాటు, ఇతర ఏపార్టీలో కానీ, స్వతంత్రంగా కానీ ఉన్న బలమైన నేతల కోసం అన్వేషిస్తోంది. తొలుత ఆ బాధ్యతను జిల్లాతో సంబంధం ఉండి, వైసీపీలో కీలక నేతలుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, వై.వి. సుబ్బారెడ్డిలతోపాటు, పార్టీ పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డిలకు అప్పగించింది. అదే తరహాలో రాష్ట్ర స్థాయిలో ఇలాంటి వ్యవహారాలను రాజ్యసభ సభ్యుడు, జగన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న విజయసాయిరెడ్డి చూస్తున్నారు. ప్రముఖ ఆడిటర్‌ కూడా అయిన ఆయనకు రాష్ట్రంలోని ఇతర జిల్లాలతోపాటు, మన జిల్లాలోని కొందరి నాయకులతో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. దీనికితోడు జిల్లాతో సంబంధం ఉన్న పార్టీ నాయకులకు వ్యక్తిగత రాగధ్వేషాలు ఉండొచ్చన భావనతో ఇక్కడ ఆపరేషన్‌ ఆకర్ష్‌ కార్యక్రమ బాధ్యతను అధిష్ఠానం విజయసాయిరెడ్డికి అప్పగించినట్లు తెలిసింది.

 

vs 20122018 3

ఇప్పటి వరకూ జిల్లాలో ఒకరిద్దరు ప్రాధాన్యత కలిగిన నాయకుల వైసీలో చేరికలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైసీపీలోకి చేరికకు ముగింపు ఇచ్చింది ఆయనే. విజయసాయిరెడ్డి రంగంలోకి దిగిన తర్వాతనే మహీధర్‌రెడ్డి వైసీపీలోకి చేరికకు మార్గం సుగమమైందన్న భావన జగన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నిశితంగా పరిశీలిస్తున్న టీడీపీ.. వైసీపీ చేస్తున్న ఈ వ్యవహారాన్ని టీడీపీ అధిష్ఠానం సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఈ విషయంపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా దృష్టి సారించి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియజేయాలని కొందరికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఈ ఆపరేషన్‌ వ్యవహారాలకు అనుగుణంగా టీడీపీ కూడా ఓ వ్యూహాన్ని రూపొందించుకొంటున్నట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం ఎంపీ సుజనా చౌదరి పై గత నెలలో ఈడీ రైడ్లు చేసి, హడావిడి చేసిన విషయం తెలిసిందే. 6 వేల కోట్లు అని, ఫారెన్ కార్లు అంటూ, మీడియాకు లీకులు ఇచ్చి, హడావిడి చేసారు. దీని పై, అన్ని పత్రాలతో మీడియా ముందుకు వచ్చి, సుజనా వివరణ ఇచ్చారు. అయితే, ఈ ఈడీ దాడులు తరువాత, డిసెంబర్ 3 నుంచి 5 వరకు, ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ లో సుజనాని విచారణ జరిపారు. అయితే ఈ మూడు రోజులు సుజనాని 8 గంటల పాటు విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు కనీసం ఆహారం కూడా అందించలేదని ఆయన తరఫు న్యాయవాదులు దిల్లీ హైకోర్టుకు బుధవారం నివేదించారు.

sujana 20122018 2

ఎంపీని తన భోజనం తెచ్చుకోవడానికి కూడా అనుమతించలేదని, ఆయనకున్న మానవ హక్కులను ఉల్లంఘించారని జస్టిస్‌ నజ్మీ వజీరీ ఎదుట వాదనలు వినిపించారు. సుజనా చౌదరిపై నిర్బంధంగా ఎలాంటి చర్యలు చేపట్టరాదంటూ గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా అధికారులు అతిక్రమించారని, ఆయన పట్ల అమర్యాదకరంగా వ్యవహరించారని కోర్టుకు నివేదించారు. ఈడీ విచారణ సాయంత్రం 6 గంటలకు ముగిసినప్పటికీ 8 వరకూ ఆయనను వెళ్లనీయలేదని తెలిపారు. తొలిరోజు ఇద్దరు ఈడీ అధికారులతో కలిపి మధ్యాహ్న భోజనానికి వెళ్లగా, మిగిలిన రెండు రోజులు భోజనానికి అనుమతించలేదని చెప్పారు.

sujana 20122018 3

అలా జరిగి ఉంటే అది మానవహక్కులు, హుందాతనం, రాజ్యాంగ హక్కులను అతిక్రమించడమే అవుతుందని; ఈ విషయాన్ని పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు. కాగా ఈ ఆరోపణలను ఈడీ తరఫున హాజరైన కేంద్ర ప్రభుత్వ న్యాయవాది తోసిపుచ్చారు. ఆయన అరటి పళ్లు తిన్నారని తెలిపారు. ఈ విషయమై ప్రమాణపత్రం దాఖలు చేస్తామని ఎంపీ తరఫు న్యాయవాదులు తెలపగా దీనికి సమాధానమివ్వాల్సిందిగా న్యాయస్థానం ఈడీని ఆదేశించింది. ఈడీ విచారణ కోసం తనకు ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని కోరుతూ సుజనా దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆయన పట్ల ఈడీ ఎలాంటి నిర్బంధ చర్యలు చేపట్టరాదంటూ గతంలో న్యాయస్థానం ఆదేశించింది. దీంతో డిసెంబరు 3, 4, 5 తేదీల్లో ఈడీ విచారణకు సుజనా హాజరయ్యారు.

నవ్యాంధ్రకు జల జీవ నాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో దశ మొదలైంది. అతి కీలకమైన ‘కాఫర్‌ డ్యామ్‌’ నిర్మాణం మహా యజ్ఞంలా సాగుతోంది. అనుకున్న సమయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే... గ్రావిటీ ద్వారా కుడి, ఎడమ కాలువల ద్వారా గోదావరి జలాలు పారాలంటే... స్పిల్‌వే పనులకు సమాంతరంగా ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం కూడా జరగాలి. ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు వీలుగా నదీ ప్రవాహాన్ని మళ్లించేందుకు కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించాల్సి ఉంటుంది. స్పిల్‌వే నిర్మాణానికి వీలుగా... నదీ ప్రవాహాన్ని మళ్లించేందుకు తాత్కాలికంగా ఓ భారీ మట్టికట్టను వేస్తారు. దీనినే కాఫర్‌ డ్యామ్‌ అంటారు. ఏ ప్రాజెక్టు నిర్మాణంలోనైనా కాఫర్‌డ్యామ్‌ నిర్మాణం తప్పనిసరి.

polavaram 20122018

అయితే... పోలవరంలో నిర్మిస్తున్న కాఫర్‌డ్యామ్‌ మిగిలిన వాటిలా కాదు! ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ద్వారానే నీటిని స్పిల్‌వే వైపు మళ్లించి... వచ్చే ఏడాది జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా గోదావరి జలాలను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
అంటే... దీనిని తాత్కాలిక నిర్మాణంలా కాకుండా, బలంగా నిర్మించాలి. అందుకే... కెల్లర్‌-ఎల్‌అండ్‌టీ సంస్థలు 2480 మీటర్ల పొడవునా జెట్‌గ్రౌటింగ్‌ ద్వారా నదీ గర్భంలో మీటరు లోపలి నుంచి ఒక కాంక్రీట్‌ గోడను నిర్మించాయి. ఇది... కాఫర్‌డ్యామ్‌కు పునాదిలాంటిదన్న మాట! దీనిపై 238 మీటర్ల వెడల్పుతో... 2480 మీటర్ల పొడవు, 42.50 మీటర్ల ఎత్తుతో కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించాలి. ఈ పనులను నవయుగ సంస్థ పరుగులు తీయిస్తోంది. ఇప్పటికే దీని నిర్మాణానికి అనుమతులు రావడంతో పోలవరం ఇంజనీర్లు పూర్తిస్థాయిలో దీనిపై దృష్టి పెట్టారు.

polavaram 20122018

ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణంలో ఉపయోగించే మట్టి, కంకర నమూనాలను ఎప్పటికప్పుడు పరీక్షించేలా పోలవరం సైట్‌లోనే ప్రత్యేక ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ, ఇంజనీరులు, వ్యాప్కోస్‌ బృందం, క్వాలిటీ కంట్రోల్‌ నిపుణులు... ఇలా అందరికీ ఈ ప్రయోగశాలలు అందుబాటులో ఉంటాయి. నిర్మాణ క్రమంలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా రాకుండా ఈ ఏర్పాటు చేశారు. 2019 జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా గోదావరి జలాలను అందిస్తామన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం! దీనికి ఆరు మాసాలే మిగిలి ఉంది. ఈ వ్యవధిలో కాఫర్‌ డ్యాంను పూర్తి చేసే విధంగా నవయుగ సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంలో 40 ఎక్స్‌కవేటర్లు, 230 డంపర్‌లు, 12 రోలర్‌లు, 12 డ్రోజర్‌లను ఉపయోగిస్తున్నారు. కాంట్రాక్టు సంస్థ తరఫున 80 మంది ఇంజనీర్లు పని చేస్తుండగా... రాష్ట్ర జలవనరుల శాఖకు చెందిన 20 మంది ఇంజనీర్లు, నాలుగు డివిజన్‌ల ఈఈలు పనులను పర్యవేక్షిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read