ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు.. దేశంలోనే అత్యంత ఉన్నతంగా రూపు.. అందరి దృష్టి మన వైపు.. అదే భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఆశయం. సకల హంగులతో ప్రతిష్టాత్మకంగా నిర్మించదలచిన అంతర్జాతీయ విమానాశ్రయం మన రాష్ట్రంలో.. అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పించిన ఈ ప్రాజెక్టుకు తొలి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ పూర్తికావచ్చింది. ఇప్పుడు కార్యరూపం దాల్చనుంది... గురువారం దిబ్బపాలెంలో విమానాశ్రయం నిర్మాణానికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పునాదిరాయి పడింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు అనుకూలంగా భోగాపురం విమానాశ్రయాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన విజయనగరం జిల్లా భోగాపురం జిల్లా దిబ్బపాలెం వద్ద అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఏపీని పర్యాటరంగంగా అభివృద్ధిచేస్తామని అన్నారు.

భోగాపురం ప్రాంతంలో అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఏర్పాటు వెనుక తెదేపా ప్రభుత్వం చొరవ ఎంతో ఉంది. అప్పటి కేంద్ర విమానయాన శాఖామాత్యులుగా, విజయనగరం ఎంపీ అశోక్‌ గజపతిరాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అలా భూసేకరణ ప్రక్రియ ఊపందుకుంది. తొలుత 5300 ఎకరాల భూములు అవసరమని గుర్తించినా... పంటభూములు, నివాసాలు ఎక్కువగా పోతున్న నేపథ్యంలో 2.645 ఎకరాలకు పరిమితం చేశారు. ఇప్పటికే 2462 ఎకరాల భూములను సేకరించి, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు పూర్తిచేశారు. ఇంకా మిగిలిన దాదాపు 183 ఎకరాల భూసేకరణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో విమానాశ్రయంతో పాటు ఎయిరో సిటీ, విమానాల విడిభాగాల తయారీ పరిశ్రమలు, అతిథి రంగం అభివృద్ధి ప్రభుత్వం సమగ్ర పథక నివేదిక (డీపీఆర్‌)ను సిద్దం చేస్తోంది. ఆర్థికంగా, పారిశ్రామికంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రగతికి జీవగర్రగా నిలిచేలా... హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికంటే మిన్నగా దీన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సర్కారు ఉంది.

విమానాశ్రయానికి అడుగులు పడ్డంతో భోగాపురం పాంతంంలో అమాంతంగా భూమ్‌ ఏర్పడింది. గతంలో గజం రూ2వేల నుంచి రూ.3వేల వరకు పలికేది. ఎయిర్‌పోర్టు వస్తుందన్న ప్రకటన తర్వాత ఇక్కడి భూముల విలువ బాగా పెరిగింది. విశాఖ నగరానికి సమీపాన 45కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో పాటు గంట వ్యవధిలోనే చేరుకునేందుకు జాతీయ రహదారి అనుకూలంగా ఉంది. ఇక విమానాశ్రయానికి భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఎకరానికి రూ.28 నుంచి రూ.33లక్షల వరకు పరిహారం ప్రభుత్వం చెల్లించింది. అంతంత మాత్రం పంటలు పండే భూములకు భారీగా పరిహారం అందడడంతో పెద్దగా వ్యతిరేకత రాలేదు. ప్రభుత్వం అన్ని రకాల ప్యాకేజీలు ఇచ్చేందుకు ముందుకు రావడం నిర్వాసితులకు ఎంతో ఊరటనిస్తోంది.

ప్రజారాజధాని అమరావతికి జలహారం అలంకరించనుంది. రూ.2,169 కోట్లతో కృష్ణానదిపై నిర్మించనున్న వైకుంఠపురం బ్యారేజికి బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. అమరావతి మండలం వైకుంఠపురం గ్రామం నది ఒడ్డున బ్యారేజి నిర్మాణానికి నిర్ణయించిన స్థలం వద్దకు ముఖ్యమంత్రి ఉదయం 11.20 గంటలకు చేరుకున్నారు. ముఖ్యమంత్రికి పండితులు వేదమంత్రాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత సీఎం శాంతిహోమం నిర్వహించారు. భూమిపూజ అనంతరం సంప్రదాయ పద్ధతిలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.

barage 14022019

ప్రకాశం బ్యారేజ్‌కి 23 కిలోమీటర్ల ఎగువన, పులిచింతల ప్రాజెక్టుకు 60 కిలోమీటర్ల దిగువన వైకుంఠపురం 3.068 కిలోమీటర్ల పొడవున దీనిని నిర్మించనున్నారు. ప్రజా రాజధానిలో ఉండేవారికి తాగునీటిని పుష్కలంగా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా బ్యారేజీకి 1.5 కి.మీ. సిమెంట్‌ వర్క్‌ కాగా 1.5 కి.మీ ఎర్త్‌ సపోర్ట్‌ వాల్‌ నిర్మాణం జరుగుతుంది. నాలుగు రోజుల కిందట జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇందుకోసం రూ.3,278.60కోట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణపు బాధ్యతలను నవయుగ కనస్ట్రక్షన్‌ కంపెనీ మోయనుంది.

barage 14022019

వైకుంఠపురం వద్ద నిర్మించబోయే బ్యారేజీ రాష్ట్రంలో ఐదోది. ప్రస్తుతం కృష్ణానదిపై శ్రీశైలం, ప్రకాశం బ్యారేజ్‌తోపాటు పులిచింత ప్రాజెక్టు ఉన్నాయి. గోదావరి నదిపై ధవళేశ్వరం బ్యారేజ్‌ ఉంది. తాజాగా నిర్మించబోయే వైకుంఠపురం ఐదో ప్రాజెక్టు అవుతుంది. రాజధానికి నీటి వనరులను తరలించాలంటే ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కృష్ణా కెనాల్‌, గుంటూరు చానల్‌ మీదుగా మళ్లించాలి. దిగువ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతానికి తీసుకెళ్లడం కంటే ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి తరలించడం సులభం. దీన్ని దృష్టిలో ఉంచుకుని జలవనరుల శాఖ అధికారులు వైకుంఠపురం దగ్గర బ్యారేజీని ప్రతిపాదించారు. ఈ బ్యారేజీ నిర్మాణం వలన 10 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. దీంతో రాజధానికి. తాగునీటితోపాటు భూగర్భజలాలు పెరుగుతాయి. అంతేగాక నదిలో నీటిమట్టం పెరగడం వలన అమరావతి ఎగువ ప్రాంతం వరకు నదిలో నీరు నిండుకుండలా దర్శనమిస్తుంది. దీంతో పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అమరావతిలో మరింత అభివృద్ధి చెందనుంది. వైకుంఠపురం కొండకు మరోపేరు క్రౌంచగిరి. దీనిపై అలివేలి మంగమ్మ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయం ఉండడంతో క్రౌంచగిరి వైకుంఠపురంగా పేరుగాంచింది.

తెలంగాణా ఎన్నికల ముందు, తెలుగుదేశం పార్టీ నేతలు, సానుభూతి పరులు టార్గెట్ చేసిన ఐటి దాడులు గుర్తున్నాయా ? ఎలాంటి హడావిడి చేసారో అందరూ చూసాం. ఇన్ని వేల కోట్లు, అన్ని వేల కోట్లు అంటూ హంగామా చేసి, చివరకు రూపాయి కూడా బయట పెట్టలేక పోయారు. ఇవన్నీ అప్పట్లో తెలంగాణా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టటానికి. విచిత్రం ఏమిటి అంటే, తెలంగాణా ఎన్నికలు అయిపోగానే, ఎక్కడికక్కడ ఐటి దాడులు ఆగిపోయాయి. గత మూడు నెలల నుంచి ఎక్కడా ఐటి దాడులు లేవు. అయితే, ఇప్పుడు మళ్ళీ ఐటి దాడులు మొదలయ్యాయి. ఎన్నికలు మరో రెండు మూడు నెలల్లో ఉన్నాయి అనగా, మళ్ళీ ఈ గోల మొదలైంది. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు టార్గెట్ గా మళ్ళీ ఐటి దాడులు మొదలయ్యాయి.

divisi 14022019

ప్రముఖ ఫార్మారంగ దిగ్గజం దివీస్ లేబోరేటరీస్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని ఆ సంస్థ పది కార్యాలయాలపై ఏక కాలంలో ఈ సోదాలు సాగుతున్నాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు కార్యాలయాల్లో రికార్డులు తనిఖీ చేస్తున్నారు. గచ్చిబౌలిలోని సంస్థ కార్పొరేట్‌ కార్యాలయంతో పాటు సనత్‌నగర్‌లోని దివీస్‌ పరిశోధన విభాగం కార్యాలయం, నగర శివారులోని చౌటుప్పల్‌, విశాఖపట్నంలోని సంస్థ కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.

divisi 14022019

ఉద్యోగులను ఉదయం నుంచి కార్యాలయాల నుంచి బయటకు వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా బయటి నుంచే కార్యాలయానికి తెప్పించుకోవాలని ఐటీ అధికారులు ఉద్యోగులకు సూచించారు. ఐటీ దాడుల నేపథ్యంలో దివీస్‌ యాజమాన్యం స్పందించింది. తమది స్టాక్‌ మార్కెట్‌ లిస్టెడ్‌ కంపెనీ అని, నిబద్ధతతో పూర్తి పారదర్శకంగా పన్నులు చెల్లించి ఏటా ఐటీ అధికారులకు వివరాలు సమర్పిస్తున్నామని పేర్కొంది. ఆదాయపు పన్నుల చెల్లింపులకు సంబంధించి అధికారులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలకు పూర్తి వివరాలు సమర్పిస్తామని సంస్థ అధికారులు చెప్పారు.

రాష్ట్రంలో జంపింగ్ రాజకీయాలు ఊపందుకున్నాయి. సీటు దక్కదనో.. ఇంకా మంచి పదవి దక్కుతుందనో నేతలు పార్టీలు మారుతున్నారు. నిన్నటికి నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. 24గంటలు కూడా గడవక ముందే విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు తాజా పరిణామాలపై స్పందించారు. మొన్నే చీరాల ఎమ్మెల్యే ఒకాయన వచ్చి మళ్లీ పోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

avanthi 14022019

ఇంకొకాయన ఇక్కడ ఎంపీగా ఉండి ఈరోజు లోటస్ పాండ్‌కు పోయే పరిస్థితికొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ‘నేను ఈ నాయకులకు భయపడాలా అని మిమ్మల్ని అడుగుతున్నా’ అని ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రశ్నించారు. ‘నేను నీ కోసం పనిచేయాలా.. వీళ్ల కోసం పనిచేయాలా అని అడుగుతున్నా’ అని చంద్రబాబు అవంతి శ్రీనివాస్‌ను ఉద్దేశించి మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని వీడే వారి గురించి పెద్దగా పట్టించుకోకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. కొందరు పోతే పార్టీకి నష్టాల కన్నా లాభాలే మిన్న అనే అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తంచేశారు.

 

avanthi 14022019

అవకాశవాదులకు తెదేపాలో స్థానం లేదని తేల్చిచెప్పారు. కార్యకర్తలే పార్టీని కాపాడుకుంటారని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సీజన్‌ కావడంతో కొందరు స్వప్రయోజనాలకోసం రానున్న రోజుల్లో పార్టీలు మారడం సహజమేననే అభిప్రాయం తెదేపా నేతల్లో వ్యక్తమవుతోంది. అవంతి శ్రీనివాస్‌ విషయానికి కూడా అంతగా ప్రాధాన్యం ఇవ్వకూడదనే అభిప్రాయానికి తెదేపా అధిష్ఠానం వచ్చినట్లు సమాచారం. సంక్షేమ కార్యక్రమాల అమలుతో ప్రజల్లో పార్టీ బలంగా ఉందని, సార్వత్రిక ఎన్నికల్లో ఇవే తమను తిరిగి మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయనే పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి.

Advertisements

Latest Articles

Most Read