వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై టీడీపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్‌ నేత సతీశ్‌రెడ్డిని పులివెందుల అసెంబ్లీ స్థానంలో జగన్‌పై పోటీకి నిలుపనుంది. కొద్దిరోజుల క్రితం కడప జిల్లా ముఖ్యులతో సమావేశమైన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన అభ్యర్థిత్వాన్ని తెలియజేశారు. గత ఎన్నికల్లో కూడా ఆయనపై సతీశే పోటీచేశారు. జగన్‌ తండ్రి, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై కూడా సతీశ్‌ పోటీ చేయడం విశేషం. వైఎస్‌ కుటుంబానికి కంచుకోట వంటి పులివెందులలో గత 20 ఏళ్లుగా ఆయనే టీడీపీ అభ్యర్థిగా తలపడుతున్నారు.

pulivendula 008012019

వైఎస్ కుటుంబానికి కంచుకోట వంటి క‌డ‌ప‌లో పాగా వేయాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎప్ప‌టి నుంచో ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ప్ర‌ధానంగా జ‌గ‌న్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లోనే ఓట‌మి పాలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే క‌డ‌ప‌లో ముఖ్యంగా పులివెందుల‌లో అభివృద్ధి కార్యక్రమాలు, కృష్ణా జలాలు, వైసీపీ నుంచి చేరికల ఆసరాగా సంఖ్య పెంచుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే టీడీపీకి దక్కింది. మిగిలిన అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లు వైసీపీ గెలుచుకుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం చూపిస్తున్నా టీడీపీ నేతల మధ్య ఐక్యత లేకపోవడం.. విభేదాలతో తరచూ వీధికెక్కడం ఆ పార్టీకి సమస్యగా మారింది. అయినా ఇటీవల స్థానిక సంస్థల ఎమ్మెల్సీని గెలుచుకోవడం ద్వారా ఆ పార్టీ వైసీపీకి గట్టి సవాల్‌ విసిరింది. అయితే, ఈ టెంపోను వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగించి.. జ‌గ‌న్‌నే ఓడించాల‌ని బాబు వ్యూహం ప‌న్నారు.

pulivendula 008012019

అయితే, గెలుపు గుర్రంగా భావిస్తున్న సతీశ్‌రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపుతోంది. ఇక‌, ఇక్క‌డ బ‌రిలో ఎవ‌రున్నా.. టీడీపీ నాయ‌కులు మూకుమ్మ‌డిగా ఇక్క‌డ వాలిపోయి.. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా క్యాంపెయిన్ చేయ‌నున్నారు. ముఖ్యంగా క‌డ‌ప జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్లు.. సీఎం.ర‌మేష్‌, బీటెక్ ర‌విలు అటు పొలిటిక‌ల్‌గాను ఇటు ఆర్థికంగాను కూడా జ‌గ‌న్‌ను దెబ్బ‌కొట్టాల‌ని ప‌క్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే కొన్ని మండ‌లాల‌ను వారు పంచుకుని మ‌రీ టీడీపీని బ‌లోపేతం చేస్తున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ జెండా ఎగిరేలా నేత‌లు పోరుకు సిద్ధ‌మ‌వుతున్నారు. తెలుగుదేశం ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ అక్కడ ఓడించడం సాధ్యం అవుతుందా ? అభివృద్ధి వైపు ప్రజలు మొగ్గుతారా ? లేక వైఎస్ సెంటిమెంట్ వైపే ఉంటారా అనేది చూడాలి..

వైఎస్‌ కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వైఎస్‌ మరణం తర్వాత పలు అంశాల్లో వైఎస్ కుటుంబంలోనే పదేపదే వివాదాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఏకంగా వైఎస్ సోదరుడు వైఎస్‌ వివేకానందరెడ్డి… తన సోదరుడి ఇంటి ముందే ఆందోళనకు దిగే పరిస్థితి ఏర్పడింది. పులివెందులలో వైఎస్‌ ప్రతాప్‌ రెడ్డి ఇంటి ముందు వైఎస్ వివేకానందరెడ్డి ఆందోళనకు దిగారు. వైసీపీ నేత వైఎస్‌ వివేకానందరెడ్డి తన సోదరుడు వైఎస్‌ ప్రతా్‌పరెడ్డి ఇంటి ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. ఆస్తుల పంపకం విషయంలో ప్రతాప్ రెడ్డికి, వైఎస్ వివేకానందరెడ్డికి మధ్య విభేదాలు వచ్చినట్టు చెబుతున్నారు. ఆర్ధిక వ్యవహారాల గొడవ కారణంగా ప్రతాప్ రెడ్డి, వివేకానందరెడ్డి మధ్య గొడవ జరుగుతోందని చెబుతున్నారు.

viveka 08012019 2

కడప జిల్లా పులివెందులలో సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకెళితే.. వివేకానందరెడ్డి అనుచరుడు రవీంద్రనాథరెడ్డి, వివేకానందరెడ్డి చిన్నాన్న కొడుకు వైఎస్‌ ప్రతా్‌పరెడ్డి బావమరిది రాజశేఖర్‌రెడ్డి చిత్తూరు జిల్లా కుప్పం వద్ద గ్రానైట్‌ క్వారీని భాగస్వామ్యంతో లీజుకు తీసుకున్నారు. ఈ క్వారీ దాదాపు రూ.600 కోట్ల విలువ చేస్తుందని అంచనా. 2008లో మొదలైన ఈ క్వారీ 2012 వరకు రాజశేఖర్‌రెడ్డి ఆధీనంలోనే సాగింది. అప్పటికే రవీంద్రనాథరెడ్డి రూ.50 లక్షల మేర రాజశేఖర్‌రెడ్డికి ఇచ్చారు. అయితే ఇంతవరకు తనకు ఎటువంటి అకౌంటు చూపలేదని రవీంద్రనాథరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ వివాదం ముదరడంతో ఆయన వివేకాను ఆశ్రయించారు. దీంతో వివేకా తన సోదరుడి ఇంటి ముందే నిరసనకు దిగారు.

viveka 08012019 3

2008లో మొదలైన ఈ క్వారీ 2012 వరకు రాజశేఖర్‌రెడ్డి ఆధీనంలోనే సాగింది. అప్పటికే రవీంద్రనాథరెడ్డి రూ.50 లక్షల మేర రాజశేఖర్‌రెడ్డికి ఇచ్చినట్టు సమాచారం. అయితే ఇంతవరకు తనకు ఎటువంటి అకౌంటు చూపలేదని రవీంద్రనాథరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ వివాదం ముదరడంతో ఆయన వివేకాను ఆశ్రయించారు. దీంతో వివేకా తన సోదరుడి ఇంటి ముందే నిరసనకు దిగారు. వైసీపీ నాయకుడిగా ఉన్న వివేకానందరెడ్డి స్వయంగా తన సోదరుడి వరుసయిన ప్రతాప్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగడంపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆరా తీసినట్టు తెలుస్తోంది. వివాదాన్ని రచ్చకెక్కకుండా పరిష్కరించుకోవాలని ఆయన తన బాబాయ్‌లకు సూచించినట్టు సమాచారం.

ఇష్టం వచ్చినట్టు, స్వతంత్రంగా పని చేస్తున్న వ్యవస్థల్లో, తలదూర్చి, వ్యవస్థలను నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ఈ రోజు సుప్రీంలో షాక్ తగిలింది. బీఐ కేసులో కేంద్రం నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. అలోక్ వర్మను సెలవుపై పంపుతూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. అలోక్ వర్మకు సీబీఐ డైరెక్టర్‌గా మళ్లీ బాధ్యతలు అప్పగించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. కేంద్రప్రభుత్వం తనను బలవంతంగా సెలవుపై పంపించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ కుమార్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సీబీఐ కేసులో కేంద్రం వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ వ్యవహారంలో సీవీసీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నతన్యాయస్థానం పక్కనబెట్టింది.

supreme 08012019

ఆలోక్‌వర్మకు తిరిగి బాధ్యతలను అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై ప్రధాని, ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తి వారంలో నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఈ సమయంలో ఆలోక్‌ వర్మ విధానపరమైన, ప్రధాన నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది. దేశంలో అసలు ఏమి జరుగుతుందో అర్ధం కావటం లేదు. రోజుకి ఒక వ్యవస్థ సర్వ నాశనం అయిపోతుంది. కోర్ట్ లు, సిబిఐ, ఈడీ, ఆర్బీఐ, సీవీసీ ఇలా అన్నీ నాశనం అయిపోతున్నాయి. మొన్నటి మొన్న సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తులు, మీడియా ముందుకు వచ్చి ప్రధాన న్యాయమూర్తి వ్యవహార శైలి పై చేసిన విమర్శలు మరువక ముందే, ఇప్పుడు సిబిఐలో టాప్ బాస్లు ఒకరి పై ఒకరు విమర్శలు చేసి, అరెస్ట్ లు దాకా వెళ్లారు.

supreme 08012019

దేశంలోనే అవినీతి వ్యహరాలను దర్యాప్తు చేసే అత్యున్నత సంస్థ సీబీఐ అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం, సీబీఐలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న అధికారులిద్దరూ ఒకరిపై ఒకరు 'ముడుపులు' తీసుకున్నారంటూ అవినీతి ఆరోపణలకు దిగడంతో కేసులు నమోదు వరకూ పరిస్థితి వెళ్లింది. ఈ పరిస్థితికి కారణమైన కేంద్రం, ఏమి చెయ్యాలో తెలియక, సీబీఐ చీఫ్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలను సెలవు పై పంపింది. అయితే, తనను సెలవుపై పంపడంపై అలోక్ వర్మ సుప్రీంను ఆశ్రయించారు. అలోక్ వర్మ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టు.. సీబీఐ డైరెక్టర్ అధికారాలను లాగేసుకునే హక్కు ఎవరికీ లేదని, వర్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

సత్తెనపల్లి వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. సత్తెనపల్లి వైసీపీ కన్వీనర్ అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా గోశాలలో అసమ్మతి నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పలువురు జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కార్యకర్తలు హాజరయ్యారు. దీంతో సత్తెనపల్లి వైసీపీలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అంబటి పార్టీపరంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అందరికీ సమ ప్రాధాన్యం కల్పించడం లేదని అసమ్మతి వర్గం ప్రధానంగా ఆరోపిస్తోంది. అంబటి రాంబాబు ఇదే విధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో సహకరించకూడదని ఆయన అసమ్మతి వర్గం భావిస్తోంది.

ambati 08012019

సత్తెనపల్లిని యోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి రాంబాబును మేము బరాయించలేం, ఆయన మా కొద్దంటూ కార్యకర్తలు గళమెత్తారు. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్ర ముగింపు సందర్భంగా సోమవారం రాత్రి స్థానిక గోళాల కల్యా ణ మండపంలో అంబటి వ్యతిరేకుల సమావేశం జరిగింది. సభకు వైసీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు గార్లపాటి ప్రభాకర్‌ అధ్యక్షత వహించగా, రాజుపాలెం జడ్పీ టీసీ మర్రి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ మండలంలో తనతో సంబంధం లేకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒంటెద్దు పోకడలు పోతున్నారన్నారు. అంబటి నాయకత్వంపై తాము పలుసార్లు జగన్‌కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. నియోజకవర్గంలో గ్రామాల్లో గ్రూపులు పెడుతూ పార్టీ నాయకులను, కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్న అంబటి రాంబాబును మార్చాలంటూ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

ambati 08012019

డాక్టర్‌ గజ్జల నాగభూషణంరెడ్డి మాట్లాడుతూ అంబటి రాంబాబు నియోజకవర్గంలో పార్టీని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వటంలేదన్నారు. కార్యకర్తలు, నాయకులు పలువురు అసమ్మతితో ఉన్నారన్నారు. ముప్పాళ్ళ మం డల నేత రహమతుల్లా అంబటి రాంబాబు చేసిన పొరపాట్ల వల్లనే గతంలో ఓడిపోవటం జరిగిందన్నారు. పొరపాట్ల గురించి ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోకుం డా ఇంకా పొరపాట్లు చేస్తున్నారన్నారు. గ్రామాల్లో వర్గాలను తయారుచేస్తు న్నారన్నారు. అంబటిని మా ర్చి మంచి సమన్వయకర్త కోసం అందరూ ఐక్యంగా ప నిచేస్తామన్నారు.

Advertisements

Latest Articles

Most Read