ప్రకాశం జిల్లా ప్రజానీకం కల సాకారమైంది. మహా ప్రకాశం దిశగా రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ప్రకాశం జిల్లా అభివృద్ధిలో కీలకమలుపు తీసుకురానున్న రామాయ పట్నం పోర్టుకు, ఆసియా పల్ప్‌ సంస్థ ఆధ్వ ర్యంలో భారీ కాగితపు పరిశ్రమకు రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాలోని ఉలవపాడు మండలం రామాయపట్నం వద్ద శం కుస్థాపన చేశారు. మేజర్‌ పోర్టా, నాన్‌ మేజర్‌పోర్టా అన్న సంశయాలు అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టును 2022 నాటికి పూర్తిచేస్తామన్నారు. కాగితపు పరిశ్రమలో దిగ్గజమైన ఆసియా పల్ప్‌ కంపెనీ ఈ ప్రాంతంలో భారీ పరిశ్రమ నెలకొల్పడానికి ముందుకు రావడం శుభసూచక మన్నారు. పోర్టు, భారీ పరిశ్రమ కలిపి ఏర్పాటు చేయడం ద్వారా ప్రకాశం జిల్లా అభివృద్ధికి హితోధికంగా ఉపయోగపడు తుందని చంద్రబాబు పేర్కొ న్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి పైలాన్‌లను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి భారీ కాగితపు పరిశ్రమకు సంబంధించి అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. ప్రకాశం జిల్లా రామాయపట్నం వద్ద నైసర్గికమైన అన్ని అనుకూలతలు ఉన్నాయని, ఇక్కడ పోర్టు నిర్మిస్తే లాభాలు ఆర్జిస్తున్న అనేక పోర్టుల కంటే మెరుగైన పోర్టుగా మారుతుం దని చాలా కాలంగా జిల్లా ప్రజానీకం డిమాండ్‌ చేస్తోంది.

రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన దుగ రాజపట్నం పోర్టుకు సానుకూలత లేదని, కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిన తరుణంలో రామాయపట్నం పోర్టుపట్ల మరింత డిమాండ్‌ పెరిగింది. రామాయపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మి స్తుందని, అందుకు అనుగుణంగా అడ్డంకిగా ఉన్న కృష్ణప ట్నం పోర్టు యాజమాన్య హక్కులు కుదింపు చేస్తూ నవయుగ కంపెనీని చంద్రబాబు అంగీకరింపచేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రామాయపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేల కోట్లతో నిర్మాణం చేయడానికి సంక ల్పించింది. ప్రాథమిక అంచనా ప్రకారం ప్రకాశం జిల్లా రామాయపట్నం నుంచి నెల్లూరు జిల్లా చెన్నూరు వరకు మూడు వేల ఎకరాల్లో భూసేకరణ పూర్తిచేసి రామాయపట్నం పోర్టు నిర్మిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. తొలివిడత గా 5 బెర్త్‌ల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. మేజర్‌, నాన్‌మేజర్‌ పోర్టంటూ ప్రతిపక్షాలు గొడవచేసే ప్రయత్నం చేస్తున్నాయని, దీనిని 2022 నాటికి పూర్తిచేస్తామని ప్రకటిం చారు. మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, వారి జీవనోపాధికి ఎలాంటి సమస్య రాకుండా పోర్టు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. సంక్రాంతి వేళ రామాయపట్నం పోర్టు నూతన కాంతు లు తీసుకువస్తుందని సీఎం ప్రకటించారు. పోర్టుతో పాటు భారీ కాగితపు పరిశ్రమ కూడా రావడం జిల్లా ప్రజల అదృష్ట మని పేర్కొన్నారు.

ఆసియా పల్ప్‌ కంపెనీ రూ. 24,500 కోట్ల పెట్టుబడితో కాగితపు పరిశ్రమ స్థాపిస్తుందని, సుబాబుల్‌, జామాయిల్‌ రైతాంగానికి ఈ పరిశ్రమ ఓ వరం కానుందన్నా రు. ఇంతపెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ఏపీపీ కంపెనీ ముందుకు రావడం ఓ రికార్డన్నారు. అనంతపురంలో ఏర్పా టైన కియా మోటార్స్‌ కంపెనీ కూడా రూ. 15 వేల కోట్ల పెట్టు బడి పెట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8 నుంచి 10 కొత్త పరిశ్రమలు ప్రారంభమవుతున్నాయని, వీటన్నింటి ద్వారా రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెంద బోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు కావాల్సినంత ప్రోత్సాహం ఇస్తుందని స్పష్టం చేశారు. ఇటువంటి పరిశ్రమలు రావడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. పెట్టుబడి పెట్టేవారు ఊరికేరారని వారికి తగిన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంద న్నారు. కాగితపు పరిశ్రమ నిర్మాణానికి ఆసియా పల్ప్‌ కంపెనీ 2.5 సంవత్సరాలు గడువు కోరిందని, అయితే వారి కి 18 నెలల నుంచి 20 నెలలు మాత్రమే గడువు ఇస్తున్నామని, ఈలోగా పూర్తిచేయాలని చంద్రబాబు సూచించారు. ఈ ప్రాజెక్టుకు జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ను ప్రత్యేక అధి కారిగా నియమిస్తు న్నా నని, ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహ కారం కావా లన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కంపెనీ కూడా అగ్రిమెంట్‌ చేసుకొని మౌనంగా ఉంటే కుదరదని, పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తానని తెలిపారు.

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తన విహార యాత్రను ముగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. ప్రతి వారం ఇంటికి వెళ్తూ చేసిన ఫ్యాన్సీ యాత్రకు పవిత్రత ఎక్కడుంటుందని ఆయన ప్రశ్నించారు. తాను అర్ధరాత్రి దాటాకా కొన్ని రోజులు నడిచిన సందర్భాలున్నాయని, కానీ ఏనాడైనా రాత్రి 7 గంటల తరువాత జగన్‌ పాదయాత్ర చేశారా? అని నిలదీశారు. రోజుకు 8 కిలోమీటర్లు నడిస్తే దానిని పాదయాత్ర అంటారా? వారానికోసారి విశ్రాంతి తీసుకుని చేసేది పాదయాత్రా? అని ప్రశ్నించారు. బుధవారం రాత్రి ఉండవల్లిలోని ప్రజా వేదికలో విలేకరులతో కొద్దిసేపు ఇష్టాగోష్ఠిగానూ, అంతకుముందు ప్రకాశం జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లోనూ చంద్రబాబు మాట్లాడారు. ప్రజల మనోభావాలకు తగ్గట్లే రాష్ట్రంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని, కాంగ్రెస్‌తోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

cbn jagan 10012019

ఈనెల 19న కోల్‌కతాలో మమతా బెనర్జీ నిర్వహించే సభ రోజున అమరావతిలో ధర్మపోరాట సభ తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సరైన సమయంలో పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. అప్పట్లో జగన్‌ చేసిన అవినీతి కారణంగా రాష్ట్రం ఎన్నో ఆస్తులను కోల్పోయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘రాష్ట్రం పరపతి పోయింది. అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్లారు. ఆస్తులు నిరుపయోగమయ్యాయి’ అంటూ అప్పటి వాన్‌పిక్‌ భూముల వ్యవహారాన్ని గుర్తు చేశారు. ‘ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఎన్నికలకు ముందు ఇవ్వడాన్ని ఏమనుకోవాలి. అదీ తెదేపా ఎంపీలను సస్పెండు చేసి మరీ బిల్లును ప్రవేశపెట్టారు."

cbn jagan 10012019

"అత్యంత కీలకమైన ఈ బిల్లులో తెదేపాను భాగస్వామిని చేయలేదు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. కోడి కత్తి కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరించడం లేదు. ఆ కేసును ఎన్‌ఐఏకు అప్పగించడం రాష్ట్ర అధికారాల్లోకి కేంద్రం చొరబడటమే. గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ జోక్యాన్ని మోదీ వ్యతిరేకించారు. ఇప్పుడు దాన్నే మన రాష్ట్రంపై ప్రయోగిస్తున్నారు. భవిష్యత్తులో నేను ఎవరినో కొట్టానంటూ తప్పుడు కేసులు బనాయించినా ఆశ్చర్యపోనవసరం లేదు. అమరావతి భూముల్లో అవినీతి అంటున్నారు. ఆ భూములను రైతులే ముందుకొచ్చి ఇచ్చారు. వారికి తిరిగి 30 శాతం అధికంగానే ప్రయోజనం చూపిస్తాం. రాష్ట్రంలో మళ్లీ తెదేపా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.

అమరావతిలోని, స్టార్టప్ ఏరియా ఫేస్1 దగ్గర వెల్‌కం గ్యాలరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ హాజరయ్యారు. లింగాయపాలెం స్టార్టప్‌ ఏరియాలో మొత్తం 50 ఎకరాలలో రూ.44 కోట్లతో వెల్‌కమ్ గ్యాలరీని నిర్మించనున్నారు. బిజినెస్‌ ప్రమోషన్‌కు వీలుగా గ్యాలరీ భవన నిర్మాణం జరుగనుంది. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ అంకుర అభివృద్ధిలో భాగంగా వెల్‌కమ్‌ గ్యాలరీ నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. దేశంలోనే మొదటిసారి రైతులు 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారని ముఖ్యమంత్రి కొనియాడారు. సింగపూర్‌ ప్రభుత్వం మద్దతుతో.. టెక్నాలజీ డెవలెప్‌ చేయాలన్నా, ప్రొజెక్టు చేయాలన్నా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చునని ఆయన అన్నారు. చాలా అంశాల్లో సింగపూర్‌ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకున్నామని చెప్పారు.

startup 10012019

ఏంటీ ప్రాజెక్టు? అమరావతిలో 1,691 ఎకరాల్ని స్టార్టప్‌ ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్టియంను రాష్ట్ర ప్రభుత్వం స్విస్‌ఛాలెంజ్‌ విధానంలో ప్రధాన అభివృద్ధిదారుగా ఎంపిక చేసింది. సింగపూర్‌ సంస్థల కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) కలసి స్టార్టప్‌ ఏరియాని అభివృద్ధి చేయనున్నాయి. ఈ రెండూ కలసి ఏర్పాటు చేసిన సంయుక్త భాగస్వామ్య సంస్థే ఏడీపీ. 1,691 ఎకరాల్ని మూడు దశల్లో అభివృద్ధి చేయాలన్నది ప్రతిపాదన.

startup 10012019

ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం... ఉత్ప్రేరకాభివృద్ధిగా 50 ఎకరాల్ని మొదట ఏడీపీ అభివృద్ధి చేయాలి. దానిలో భాగంగానే ‘వెల్‌కం గ్యాలరీ’ ప్రాజెక్టుని ఏడీపీ చేపట్టింది. స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి కోసం మొదట ఒప్పందం చేసుకున్నప్పుడు వెల్‌కం గ్యాలరీ ప్రాజెక్టు ప్రతిపాదన లేదు. స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో... మొదట ఐదు ఎకరాల్లో ‘ఫేజ్‌ జీరో’ పేరుతో ఒక ప్రాజెక్టు చేపడతామని సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదించింది. దీన్ని ‘వెల్‌కం గ్యాలరీ’గా మార్చారు. భవిష్యత్‌ అవసరాల కోసం 75 వేల చ.అడుగుల నిర్మిత ప్రాంతం గల భవనాన్ని ఇక్కడ నిర్మిస్తారు.

చంద్రబాబుని గెలిపించింది నేనే... చంద్రబాబుకి అనుభవం ఉందని, నేనే మద్దతు ఇచ్చి గెలిపించా... నేను కాపుని, కాని నాకు అన్ని కులాలు ముఖ్యం... చంద్రబాబుకి ఎలా పాలించాలో తెలియదు.. ఏపిలో మార్పు రావాలి, నేను మార్చేస్తా... ఏపి యువత అంతా నా వెంటే ఉన్నారు... తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసే టైం నాకు లేదు, ముందస్తు రాకుండా ఉంటే పోటీ చేసే వాడిని, తెలంగాణాలో నా టార్గెట్ వచ్చే పార్లమెంట్ ఎన్నికలు... చంద్రబాబు నన్ను చూస్తే భయపడి పోతున్నారు.. చంద్రబాబు నాకు పర్మిషన్ ఇవ్వటం లేదు.. పోయిన ఎన్నికల్లో టిడిపిని నేనే గెలిపించా, ఈ సారి మాత్రం గెలిపించను... ఈ మాటలు అన్నది ఎవరో చెప్పుకోండి ? పవన్ కళ్యాణ్ ఏ కదా, ఇంత సిల్లీ ప్రశ్న ఏంటి అనుకుంటే, మీరు పొరపాటు పడినట్టే..

paul 10012019

అచ్చం జనసేన లాగా, అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఆలోచించే ఇంకో కొత్త పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాటలు ఇవి. మత ప్రచారకులు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కె.ఎ.పాల్‌ చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడు ప్రధాని మోడీ పైనే ఇలాంటి వ్యాఖ్యలు చేసారు. ఇక్కడ చంద్రబాబునే కాదు, అక్కడ మోడీ కూడా నా వల్లే గెలిచాడు అంటున్నాడు పాల్.. మోదీకి సపోర్ట్ చేయొద్దని ఎల్‌కే ఆడ్వాణీగారు చేతులు జోడించి మరీ తనను రిక్వెస్ట్ చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన విషయాలు వెల్లడించారు. ప్రజాశాంతి పార్టీ వ్యవహారాల గురించి తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేఏ పాల్ మాట్లాడుతూ.. 2014లో తాను మద్దతు ఇవ్వడం వల్లే మోదీ ప్రధాని అయ్యారని చెప్పారు. మోదీయే తన వద్దకు వచ్చి అడగడం, సెక్యులరిజం అని చెప్పడంతో ప్రచారం చేశానన్నారు.

paul 10012019

‘‘మీరు బీసీ, నేను బీసీ. నాకు ఫ్యామిలీ లేదు. మీకూ ఫ్యామిలీ లేదు. దేశమే మన ఫ్యామిలీ. ఇద్దరం కలిసి దేశాన్ని అభివృద్ధి చేద్దామని గంటా నలభైఐదు నిమిషాలపాటు నాతో చర్చించారు. బీజేపీ ప్రెసిడెంట్లు, సెక్రెటరీలు, ట్రెజరర్లు.. ఇలా అందరినీ అమెరికా పంపించి.. మసాజ్ చేసి.. రిక్వెస్ట్ చేసి.. ఇది చేసి, అది చేసి ఎంతగా నన్ను వేడుకున్నారంటే.. ఒక చిన్న కుర్రాడిలా మోదీ బిహేవ్ చేశారు. అయితే ఆడ్వాణీగారు మాత్రం వద్దన్నారు. 2013 అక్టోబర్ 1న చేతులు జోడించి గంటన్నరపాటు చెప్పారు. మోదీకి సపోర్ట్ చేయొద్దు. అతను ఒక్క హామీని కూడా నెరవేర్చడని చెప్పారు. ఆయనే తన ఇంటికి డిన్నర్‌కు పిలిచి ఈ విషయం చెప్పారు. నేను మోదీగారి ఇంటికి వెళ్లలేదు. ఆయనే నా దగ్గరికి వచ్చారు. కానీ ఆడ్వాణీగారి ఇంటికి వెళ్లాను.’’ అని కేఏ పాల్ వెల్లడించారు.

 

Advertisements

Latest Articles

Most Read