వైసీపీ విజయంతో ఆ పార్టీ శ్రేణులు రెచ్చిపోయాయి. పలుచోట్ల టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డాయి. కొన్నిచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయులు ఘర్షణకు పాల్పడ్డారు. అనంతపురంలో వైసీపీ నాయకులు టీడీపీ వర్గీయుల ఇంటిపై దాడిచేశారు. కుర్చీలు, తలుపులపై రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. బాధితులు తెలిపిన వివరా ల మేరకు... నగరంలోని కృపానందనగర్‌లో డిప్యూటి మేయర్‌ సాకే గంపన్న సోదరుడి కు మారుడు సాకే చంద్రమోహన్‌ ఇంటిపై వైసీపీకి చెందిన చంద్రశేఖర్‌, సురేంద్ర, తిక్కసా యి, చిట్టి, వడ్డే నవీన్‌ శుక్రవారం రాత్రి తా గిన మత్తులో దాడికి దిగారు. దీంతో ఇరువురిమధ్య వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. వైసీపీ నాయకులు రాళ్లతో ఇంటి ముందున్న కుర్చీలను, సరుకులను, ఇంట్లోని కూలర్‌, ఫ్రిజ్‌ను ధ్వంసం చేసి దాడికి దిగారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. టూ టౌన్‌ పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వైసీపీ నాయకులు ఇంటిపైకొచ్చి దాడిచేయడంతోపాటు తమపై అసభ్య పదజాలంతో దూషించారని బాధితు లు ఆవేదన వ్యక్తంచేశారు. ఘటనపై టూ టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక అనంతపురం నగరంలోని వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న ఇద్దరిపై వైసీపీ నాయకులు దాడులు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని విద్యుత్‌నగర్‌ సర్కిల్‌లో లోకేష్‌, సాయిక ల్యాణ్‌ అనే అన్నదమ్ములిద్దరూ వస్త్రదుకాణం నిర్వహిస్తున్నారు. అయితే వైసీపీకి చెందిన సాకే చంద్రశేఖర్‌, సురేంద్రనాథ్‌రెడ్డి, గుజ్జల గంగాధర్‌, నగేష్‌, మధు, నరేంద్ర అనే వైసీపీ కి చెందిన యువకులు వస్త్రదుకాణంపై శుక్రవారం దాడికి దిగారు. వారందరూ అన్నదమ్ములిద్దరిపై ఇష్టారాజ్యంగా మాటలతో దూ షించడంతోపాటు మూగదెబ్బలు తగిలేలా చితకబాదారు. ‘మా ప్రభుత్వమొచ్చింది. మీకు దిక్కున్నచోటు చెప్పుకోండి’ అంటూ హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో బాధితులు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రొళ్ల మండలంలోని రొళ్ల గొల్లహట్టి టీడీపీ కార్యకర్త గద్దెతిమ్మప్పకు చెందిన అవిస చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. ఆరెకరాలో వక్కచెట్లు అంతరపంటగా అవిసచెట్లను సాగుచేశాడు. వక్క చెట్లకు నీడగానూ, గొర్రె పిల్లల మేత కోసం ఎంతో ఉపయోగపడే ఈ చెట్ల నరికి వేయడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని బా ధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫ లితాలు విడుదల కాగానే తమకు గిట్టని వా రు ఈ పనిచేసి ఉంటారని వాపోయారు. ఈ విషయమై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేయనున్నట్లు బాధితుడు తెలిపాడు. ఇక బ్రహ్మసముద్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి గురువారం రాత్రి దుండగులు నిప్పంటించారు. కనగానపల్లిలో పలు గ్రామాలలో టీడీపీ, వైసీపీ వర్గాల మ ధ్య ఘర్షణ చోటు చేసుకుని ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. ఇలా అనేక చోట్ల, వైసీపీ నాయకులు, టిడిపి కార్యకర్తలని హింసకు గురి చేస్తున్నారు.

 

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈనెల 23న వెలువడిన ఫలితాల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఓడిపోయానని బాధపడకుండా ఆయన ఇంటింటా తిరుగుతూ క్షమాపణ కోరారు. పెనమలూరు, కంకిపాడు కాలువ కట్టలపై బులెట్‌పై ఒంటరిగా పర్యటిస్తూ తాను ఏమైనా తప్పు చేస్తే క్షమించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తనకు ఓటు వేసినవాళ్లకు, వేయని వారికి కూడా కృతజ్ఞతలు చెబుతూ ముందుకు సాగారు. తానేమీ తప్పు చేయలేదని.. అయినా తనను క్షమించాలని వేడుకున్నారు. పెనమలూరు, కంకిపాడు కాలువ కట్టలపై బులెట్‌పై ఒంటరిగా పర్యటిస్తూ తాను ఏమైనా తప్పు చేస్తే క్షమించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తనకు ఓటు వేసినవాళ్లకు, వేయని వారికి కూడా కృతజ్ఞతలు చెబుతూ ముందుకు సాగారు. తానేమీ తప్పు చేయలేదని.. అయినా తనను క్షమించాలని వేడుకున్నారు.

తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయంలో జనసేన కూడా తన వంతు పాత్ర పోషించినట్లు స్పష్టమైంది. ఫ్యాన్‌ హోరుతో టీడీపీ ఓటమిపాలు కాగా మరీ తక్కువ సీట్లు రావడానికి జనసేన కారణమనే వాదన వినిపిస్తోంది. వైసీపీ విజయం సాధించిన 32 చోట్ల.. అది సాధించిన మెజారిటీ కంటే జనసేన గణనీయమైన ఓట్లు సాధించడం గమనార్హం. 2009లో ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని ఇలాగే దెబ్బతీసింది. ఆ ఎన్నికల్లో టీడీపీ 80 స్థానాల్లో రెండో స్థానంలో నిలువగా.. అక్కడ కాంగ్రెస్‌ సాధించిన మెజారిటీ కంటే పీఆర్పీకి అధిక ఓట్లు రావడం విశేషం. అలాగే ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం 5 వేల ఓట్ల లోపు ఓడిపోయిన స్థానాలు 28 వరకు ఉన్నాయి.

pk 240520199

ఈ దఫా ఎలమంచిలిలో టీడీపీ అభ్యర్థిపై వైసీపీకి 4 వేల ఓట్లు అధికంగా రాగా.. జనసేనకు 16,500 ఓట్లు వచ్చాయి. రామచంద్రపురంలో వైసీపీకి 5వేల ఓట్లు మెజారిటీ దక్కగా.. జనసేనకు 17,592 ఓట్లు వచ్చాయి. తణుకులో వైసీపీ 1264 ఓట్లతో గెలిస్తే జనసేనకు అక్కడ 35502 ఓట్లు పడ్డాయి. విజయవాడ వెస్ట్‌లో వైసీపీ 6వేల ఓట్ల తేడాతో గెలిస్తే జనసేనకు 22,312 ఓట్లు వచ్చాయి. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ 1587 ఓట్లతో ఓడిపోగా జనసేనకు 4104 ఓట్లు పడ్డాయి. తిరుపతిలో వైసీపీ 708 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచింది. ఇక్కడ జనసేన అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తికి 12వేలకు పైగా ఓట్లు వచ్చాయి.

pk 240520199

తాజా ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీపై ప్రజారాజ్యం తాలూకు నీలినీడలు కనిపించాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీ 18 స్థానాల్లో గెలవడం, అనంతరం ఆ పార్టీని కాంగ్రెస్‌లో కలిపివేయడంతో ఓటర్లలో ఇంకా ఆ జ్ఞాపకాలు చెదిరిపోలేదు. ఆ ప్రభావం జనసేనపై కనిపించిందని చెప్పవచ్చు. 2009లో ప్రజారాజ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 18 స్థానాలు గెలిచింది. తెలంగాణను మినహాయించి మిగిలిన ఆంధ్రప్రదేశ్‌ను పరిగణిస్తే 16 స్థానాల్లో ప్రజారాజ్యం గెలిచింది. ప్రస్తుత ఫలితాల్లో జనసేన ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోవడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తెలుగుదేశం 35 సీట్లలో ఓడిపోవటానికి ఒక కారణం అయిన పవన్ కళ్యాణ్ కు, వైసీపీ కార్యకర్తలు థాంక్స్ చెప్తున్నారు.

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్‌ కు బెయిల్‌ మంజూరైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న శ్రీనివాస్‌ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నందున బెయిల్‌ మంజూరు చేయాలని అతని తరఫు న్యాయవాది సలీమ్‌ వారం క్రితం విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో సెక్షన్‌ 55(ఎ) కింద పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి సంబంధించి న్యాయనిపుణుల అభిప్రాయం కోర్టు ముందుకు రావడంతో గురువారం వాదనలు జరిగాయి. తన క్లయింట్‌ మలేరియా, డెంగీ, అజీర్ణంతో బాధపడుతున్నాడని సలీమ్‌ వాదించారు. గుండె సంబంధిత వ్యాధి సోకే అవకాశం కూడా ఉందన్నారు. ఈ వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి పార్ధసారథి రూ.60 వేలు, ఇద్దరి పూచికత్తుపై బెయిల్‌ మంజూరు చేశారు.

srinivas 25052019 1

బెయిల్ పై బయటకు రాగానే శ్రీను సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎయిర్ పోర్టులో తాను కుక్ గా పనిచేస్తూ ఉండేవాన్ని అని.. ప్రజల సమస్యలపై తాను చాలా రాశానని అవన్నీ జగన్ కు తెలియజేయాలని చూశానని వైజాగ్ ఎయిర్ పోర్టులో దాడి చేసిన శ్రీనివాస్ చెప్పాడు. తాను జగన్ అభిమానిని కాదని తేలిస్తే శిరచ్ఛేదనం చేసుకుంటానని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఆ రోజు తాను జగన్ ను చంపాలని అసలు అనుకోలేదని శ్రీనివాస్ చెప్పారు.. అది పొరపాటున జరిగింది అని అన్నారు. తన ఆలోచనలకు సంబంధించిన విషయాలను జగన్ తో ఆరోజు చెప్పాలని అనుకున్నానని శ్రీనివాస్ చెప్పారు.

srinivas 25052019 1

ఆరోజు తాను ఫోటో కోసం వెళ్లానని.. కంగారుగా ఏమి చేశానో కూడా తనకు తెలీదు అని శ్రీనివాస్ చెప్పారు. ఆయనకు ఏమి తగిలిందో కూడా తనకు తెలీదని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. ఆరోజు అక్కడ ఉన్న వాళ్ళు చంపేసేవాళ్ళని.. కానీ జగన్ తనను కొట్టొద్దని చెప్పారని శ్రీనివాస్ చెప్పాడు. తాను వంటవాన్ని అని.. తన దగ్గర ఫోర్క్ లాంటివి ఎన్నో ఉన్నాయని శ్రీనివాస్ చెప్పారు. అది యాక్సిడెంటల్ గా జరిగిందని శ్రీనివాస్ వెల్లడించారు. తన మీద చాలా అవాస్తవాలు సృష్టించారని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. ప్రమాదవశాత్తూ జరిగింది తప్ప మరేదీ కాదని శ్రీనివాస్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జగన్ కు సానుభూతి రావడం కోసం తాను ఈ పని చేయలేదని అన్నారు శ్రీనివాస్.

Advertisements

Latest Articles

Most Read