విజయవాడ రాజకీయాలు మళ్ళీ హీట్ ఎక్కాయి. మొన్నటి దాక సొంత పార్టీ నేతలు, కేశినేని నాని, బుద్దా వెంకన్న ట్వీట్ వార్ తో, మొన్నటి దాకా విజయవాడ రాజకీయాలు హీట్ ఎక్కాయి. అయితే గత వారం రోజులుగా అది తగ్గింది అనుకుంటే, మళ్ళీ ట్వీట్ వార్ కి, వైసిపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధి పీవీపీ ఎంటర్ అయ్యారు. కేశినేని నాని పై ట్వీట్ల వర్షం కురిపించారు. దానికి కేశినేని నాని కూడా ధీటుగా బదులు ఇస్తూ వచ్చారు. మొన్న కేశినేని నాని నన్ను దొంగ అన్నారు అంటూ, లీగల్ నోటీస్ కూడా పీవీపీ పంపించారు. ఇదే సందర్భంలో కేశినేని నాని ట్రావెల్స్ మూసేసే టైంలో వందలాది మంది కార్మికులకు జీతాలు ఎగ్గోట్టారని, వారికి ముందు డబ్బులు ఇచ్చి మాట్లాడు అంటూ పీవీపీ ట్వీట్ చేసారు. దీనికి నాని ధీటుగా బదులు ఇస్తూ, నేను ఎవరికీ బాకీ లేను అని, అందరికీ సెటిల్ చేసానని చెప్పారు.

nani 26072019 2

ఈ క్రమంలోనే, ఈ రోజు కేశినేని నాని ట్రావెల్స్ కు చెందిన మాజీ ఉద్యోగులు కొంత మంది విజయవాడ లెనిన్ సెంటర్ లో ధర్నాకు దిగారు. వారికి పీవీపీ మద్దతు ఇచ్చారు. కేశినేని నాని మూడేళ్ళ నుంచి తమకు బకాయి పడ్డ జీతాలు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ట్రావెల్స్ మూసినప్పటి నుంచి మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వలేదని అన్నారు. మేము లేబర్ కోర్ట్ లో కూడా కేసు వేశామని అన్నారు. మాకు రావాల్సిన బకాయాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేసారు. అయితే ఇదే అంశం పై పీవీపీ స్పందిస్తూ నాని పై రాజకీయ విమర్శలు చేసారు. దీంతో ఈ అంశం మొత్తం వెనకాల, పీవీపీ ఉండే కధ నడిపిస్తున్నారని అర్ధమైంది. ఇదే క్రమంలో నాని అనుచరులు, ధర్నా చేస్తున్న ప్రదేశానికి వెళ్లారు, ఎవరికి ఇవ్వాలని, ఎంత ఇవ్వాలి అనే విషయం పై ఆరా తీసేందుకు వెళ్తే, వారిని అక్కడ నుంచి పోలీసులు పంపించి వేసారు.

nani 26072019 3

ఈ అంశం పై కేశినేని నాని స్పందిస్తూ, తమ సంస్థలో 2వేలకు మంది పైగా ఉద్యోగాలు ఉండేవారని, 2017లో ట్రావెల్స్ మూసిన సమయంలో అందరికీ బకయాలు సెటిల్ చేసి, వారిని పంపించేసమని అన్నారు. కేవలం 14 మంది విషయంలో తేడా ఉందని, వారు లేబర్ కోర్ట్ కు వెళ్ళారని, కోర్ట్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని అన్నారు. ఈ లోపే ఇలా ఎందుకు చేసారో, ఎవరి వల్ల చేసారో అందరికీ కనిపిస్తుందని అన్నారు. ఆ 14 మంది కాకుండా, ఇంకా ఒక్కరినైనా చూపిస్తే, తాను వారికి కూడా ఇవ్వాల్సింది ఏమైనా ఉంటె ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. 14 మందితో తేడా వచ్చిందని, వారు కోర్ట్ కు వెళ్తే, వాళ్ళని ఇక్కడకు తీసుకొచ్చి, డ్రామాలు ఆడిస్తున్నారని, ఎవరో ట్వీట్ లకు నేను సమాధానం చెప్పను అని, పీవీపీ ని ఉద్దేశించి అన్నారు. ఈ 14 మంది విషయంలో కోర్ట్ ఏమి చెప్తే అది చేస్తామని నాని స్పష్టం చేసారు. 2017 ఏప్రిల్ 7న, తన ట్రావెల్స్ పై జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ఆరోపణలు చేస్తుంటే, ఆ మాటలు పడలేక, కేశినేని ట్రావెల్స్ మూసేసిన సంగతి తెలిసిందే.

చంద్రబాబు హయంలో విద్యుత్ ఒప్పందాల సమీక్ష పై ఎవరి మాట వినకుండా, చివరకు కేంద్రం చెప్పినా పెడ చెవిన పెట్టి, దూకుడుగా వెళ్తున్న జగన్ కు, హైకోర్ట్ బ్రేక్ వేసింది. ఈ సందర్భంగా కోర్ట్ చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వానికి ఇబ్బందికరమనే చెప్పాలి. విద్యుత్ ఒప్పందాల సమీక్ష పై ఇచ్చిన జీఓ పై, 40 విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు హైకోర్ట్ కు వెళ్ళాయి. ఈ సందర్భంగా హైకోర్ట్ న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేసారు. విద్యుత్ ఒప్పందాలు పై సమీక్ష ప్రభుత్వానికి సంబంధం ఏంటి, అది మీ బాధ్యత కాదు కదా అని ప్రశ్నించారు. అది విద్యుత్‌ నియంత్రణ మండలి బాధ్యత అని తెలిసినా, మీరు ఎందుకు ప్రభుత్వం తరుపున ఇంత తొందరపడుతున్నారు అంటూ హైకోర్ట్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు, విద్యుత్ కంపెనీలను ఎందుకు బెదిరిస్తున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం అనే చెప్పాలి.

highcourt 26072019 2

ఇలాంటి నిర్ణయాల్లో మీరు నియమించిన ఉన్నత స్థాయి కమిటీ జోక్యం చేసుకుంటే కుదరదు అని కోర్ట్ తేల్చి చెప్పింది. మీరు ఇలాంటి హడావిడి నిర్ణయాలు చేస్తే, రాష్ట్రానికి చాలా ఇబ్బంది వస్తుంది, అలోచించి సరైన నిర్ణయం తీసుకోండి, విద్యుత్‌ నియంత్రణ మండలి వేదికగా సమస్యను పరిష్కరం చేసుకోవటమో, లేక వేరే ఏదైనా మార్గంలో, సమస్యలు లేకుండా చూసుకోండి అంటూ ప్రభుత్వానికి కోర్ట్ సూచించింది. ఇవన్నీ చెప్తూ, ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని నియముస్తూ, ప్రభుత్వం జారే చేసిన జీవో 63ను నాలుగు వారాల పాటు సస్పెండ్ చేస్తూ హైకోర్ట్ నిర్నయం తీసుకుంది. అంతే కాకుండా, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ, వివధ కంపెనీలకు ఇచ్చిన నోటీసులను కూడా కోర్ట్ రద్దు చేసింది.

highcourt 26072019 3

అయితే విచారణ సందర్భంగా, పిటీషన్ తరుపున న్యాయవాదులు, ప్రభుత్వ నిర్ణయాల పై విరుచుకుపడ్డారు. విద్యుత్ ఒప్పందాల విషయంలో ప్రభుత్వం తన పరిధికి మించి వ్యవహరిస్తుందని అన్నారు. 2015లో చేసుకున్న ఒప్పందాల్లో, గుజరాత్‌, తమిళనాడు వంటి రాష్ట్రాలకన్నా తక్కువ ధరకే రేట్లు నిర్ణయించారని, ఇప్పుడు వీళ్ళు కొత్తగా హై పవర్ కమిటి అంటూ, మళ్ళీ ధరలు నిర్ణయిస్తామని అంటున్నారని అన్నారు. యూనిట్ ధరను రూ.2.44కు తగ్గించాలని, బెదిరింపు ధోరణిలో, షోకాజ్ నోటీసులు పంపారని, ఇలా తమ పరిధిలో లేని అంశాలతో తమను బెదిరిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. అయితే ప్రభుత్వం వాదనలో కొంత వేడి తగ్గిందనే చెప్పాలి. మొన్నటి దాక బెదిరింపు ధోరణిలో ఉన్న ప్రభుత్వం, నిన్న కోర్ట్ లో మాత్రం కొంచెం తగ్గారు. రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ, దిస్కంలు ఆర్ధిక సంక్షోభంలో ఉన్నాయని, ధరలు తగ్గించమని కోరామని, ఏమైనా ఉంటె, ఈఆర్‌సీలో పరిష్కరించుకుందామని, ఒప్పందాలు రద్దు చేసి ఆలోచన లేదని, కంపెనీలు అవగాహన లోపంతో కోర్ట్ దాకా వచ్చాయని వాదన వినిపించారు. మరో పక్క రెండు రోజుల క్రితం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాత్రం, చంద్రబాబు స్కాం చేసారని, అందుకే రద్దు చేస్తున్నాం అని చెప్పారు. మొత్తానికి ఈ విషయంలో ప్రభుత్వం కొంచెం వెనకడుగు వేసినట్టే కనిపిస్తుంది.

తన సహజ శైలికి భిన్నంగా, ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఓర్పుకి కూడా ఒక హద్దు ఉంటుంది అనేది అందుకేనేమో. గత పది రోజుల నుంచి అసెంబ్లీలో చంద్రబాబుని ఎంత అవమానిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అయినా చంద్రబాబు ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా, అలాగే ఉన్నారు. మాట్లాడే అవకాసం ఇవ్వకపోయినా, నిరసన తెలిపే అవకాసం ఇవ్వకపోయినా, కాంగా బయటకు వచ్చి, సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి, తాను చెప్పాలి అనుకున్నది ప్రజలకు చెప్పి వెళ్ళిపోతున్నారు. అయితే ఏ మనిషికి అయినా సహనం ఎంత కాలం ఉంటుంది, ఓర్పు నసించకుండా ఉండదు కదా ?ఆయన కూడా ఒక మనిషే కాదా, ఈ రోజు సభలో చంద్రబాబు పై జరిగిన అవమానాలకు, తన సహజ శైలికి భిన్నంగా చంద్రబాబు రియాక్ట్ అయ్యారు.

cbn 25072019 2

తెలంగాణాకు గోదావరి జలాలు తరలింపు పై, చంద్రబాబు ఎక్కడా ప్రభుత్వం పై ఒక్క విమర్శ కూడా చెయ్యకుండా, సూచనలు ఇచ్చారు. తెలంగాణా భూభాగం నుంచి మన నీళ్ళు వెళ్తే, శ్రీశైలం వచ్చే సరికి ఎంత నీరు వస్తుందో తెలుసా, ఇవన్నీ ఆలోచించండి, మేధావులతో చర్చించండి అంటూ ఒక్క విమర్శ కూడా చెయ్యకుండా, ఇది భావితరాలకు సంబందించిన విషయం, నీటి విషయం చాలా సున్నితమైనది, ఎక్కడా చిన్న తప్పు చెయ్యద్దు అంటూ జగన్ కు సలహా ఇచ్చారు. అయితే, జగన్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. అలాగే మంత్రులు కూడా అలాగే హేళన చేస్తూ స్పందించారు. నీ 40 ఏళ్ళ అనుభవం దేనికి, మేము కేసిఆర్ తో కలిసి చేసి చూపిస్తాం చూడు అంటూ, చంద్రబాబు పై విరుచుకు పడ్డారు. అయితే ఈ సందర్భంలో చంద్రబాబు మైక్ ఇవ్వమని ఎంత కోరినా స్పీకర్ మైక్ ఇవ్వలేదు.

cbn 25072019 3

దీంతో చంద్రబాబు వాక్ అవుట్ చేసి బయటకు వచ్చారు. సాయంత్రం మీడియాతో మాట్లాడారు. శాసనసభలో జగన్, అతని మంత్రుల ప్రవర్తన తీవ్ర అభ్యంతరంగా ఉందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి, ఒళ్లు దగ్గరపెట్టుకో. భాషను కంట్రోల్ చేసుకో. మీ మంత్రులకు కూడా చెప్పండి. ఇష్టం వచ్చింట్టు నోరు పారేసుకుంటే మీ సియం హోదాకు హుందాతనం రాదు. నేను కూడా ఒక్క నిమిషంలో తిరిగి మీరు మాట్లాడినట్టే మాటలు అనగలను, నేను ఆ మాటలు అంటే జగన్ తల ఎక్కడ పెట్టుకుంటాడు? నోరు అదుపులో పెట్టుకో అని జగన్‌కి వార్నింగ్ ఇస్తున్నా అంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కోసం ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్‌ను తాకట్టు పెడతారా? అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను రాష్ట్రపతి నియమించిన సంగతి తెలిసిందే. ఆయన రెండు రోజుల క్రితం బాధ్యతలు తీసుకున్నారు. గవర్నర్ ప్రమాణస్వీకారానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా హాజరయ్యారు. ఆ సమయంలో ప్రోటోకాల్ ప్రకారం, చంద్రబాబు వాహనం లోపలకి అనుమతిచం అని చెప్పటంతో, చంద్రబాబు గేటు దగ్గరే దిగి రాజ్ భవన్ లోపలకి నడుచుకుంటూ వెళ్లారు. ప్రమాణస్వీకరం ముగిసిన తరువాత, గవర్నర్ ప్రభుత్వం ఇచ్చిన తేనీటి విందుకు వెళ్ళిపోవటంతో, చంద్రబాబుకు గవర్నర్ కలసి అభివాదం చేసే అవకాసం కూడా దొరకలేదు. దీంతో చంద్రబాబు నిన్న గవర్నర్ వద్దకు ప్రత్యేకంగా వెళ్లి కలిసి, గవర్నర్ గా నియమితులు అయినందుకు అభినందించారు.

governer 26072019 1

చంద్రబాబుతో పార్టీ నేతలు యనమల, చినరాజప్ప, పయ్యావుల, డొక్కా మాణిక్యప్రసాద్ తదితరులు ఉన్నారు. చంద్రబాబు వారందరినీ గవర్నర్ కు పరిచయం చేసారు. ఈ భేటీలోనే గవర్నర్‌ హరిచందన్‌, తనకు ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని తెలుగుదేశం నేతలతో పంచుకున్నారు. మొదటిసారిగా ఎన్టీఆర్ ను భవనేశ్వర్‌ ఎయిర్‌పోర్టులో కలిసానని, ఆయన ఒక మహా శక్తిగా ఎదిగిన తీరు అద్భతం అని కొనియాడారు. గతంలో కొన్ని సందర్భాల్లో విజయవాడ వచ్చానని, ఆ విశేషాలు కూడా పంచుకున్నారు. ఇదే సందర్బంలో చంద్రబాబుకు బిజూపట్నాయక్‌తో తన అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. అయితే తరువాత, గవర్నర్, చంద్రబాబు ఏకాంతగా మాట్లాడుకోవటం రాజకీయంగా చర్చనీయంసం అయ్యింది. దాదాపుగా 15 నిమషాలకు పైనా, ఇరువురు ఏకాంతంగా మాట్లాడుకున్నారు.

governer 26072019 1

రాష్ట్రంలో తాజా రాజకేయ పరిస్థితుల గురించి చంద్రబాబు వివరించి ఉంటారని తెలుస్తుంది. బిశ్వభూషణ్ హరిచందన్ ను ఏరి కోరి బీజేపీ మన రాష్ట్రానికి పంపించింది. కొద్ది రోజుల క్రిందట, మోడీ ఆయన్ను పిలిచి, మీకు పెద్ద బాధ్యత ఇవ్వబోతున్నా అని చెప్పారు. అంటే గవర్నర్ ద్వారా, రాష్ట్రంలో బలపడే ప్లాన్ లో బీజేపీ ఉంది. అంతే కాదు, బిశ్వభూషణ్ హరిచందన్ అవినీతి లేని సమాజం కోసం పోరాటాలు చేసిన చరిత్ర ఉన్న మనిషి. బీజేపీ-బీజేడీ సంకీర్ణంలో ఆయాన మంత్రిగా పని చేసిన సమయంలో, అవినీతిని నిర్మూలించే చర్యలు తీసుకున్నారు. జగన్ పై ఉన్న కేసులు దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆయన వైఖరి ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు ఆయనతో ఏకాంతంగా భేటీ కావటం కూడా రాజకీయంగా ఆసక్తి రేపే అంశం. గత గవర్నర్ నరసింహన్ మొదటి నుంచి చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన కు అనుకూలంగా పని చేసారనే అభిప్రాయం ఉండేది. మరి కొత్త గవర్నర్ ఎలా వ్యవహరిస్తారు అనేది చూడాలి.

Advertisements

Latest Articles

Most Read