వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. ఈ నెల రోజులల్లో 140 రాజకీయ దాడులు జరిగాయి. 7 గురు చనిపోయారు. అయితే వైసీపీ ఆగడాలు తెలుగుదేశం పార్టీ వరకే ఆగలేదు. ఏకంగా జర్నలిస్ట్ లను బెదిరిస్తూ, చంపేస్తాం అంటూ లొంగదీసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా, రాష్ట్రంలో హోం మంత్రి గారు మాత్రం, మేము అందరికీ కాపలా ఉండలేము, ఘటన జరిగిన తరువాత వస్తే న్యాయం చేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. హోం మంత్రే ఇలా మాట్లాడటం చూస్తుంటే, ఇలాంటి రౌడీ మూకలకు లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది. ఈ రోజు తాజాగా మరో ఘటన వెలుగు లోకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్యే, ఒక జర్నలిస్ట్ ను బెదిరిస్తున్నారు. ఇదే విషయం ఆడియోతో సహా తెలుగుదేశం మాజీ మంత్రి నారా లోకేష్, ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ప్రస్తుతతం రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుంది అని, దానికి ఇదే ఉదాహరణ అంటూ,  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ జర్నలిస్టును బెదిరిస్తున్న ఆడియో పోస్ట్ చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి ఇదని, ఇక సామాన్యుల సంగతి ఏంటో ఊహించుకోవాలని పేర్కొన్నారు.

ఈ బెదిరిపులకు సంబంధించి ఆడియో క్లిప్ ను లోకేశ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ఆడియోను కుటుంబ సభ్యులతో కలిసి విన వద్దు, ఇందులో అసభ్య పదజాలం ఉన్నయాని లోకేష్ ట్విట్టర్ లో పెర్కున్నారు. నడిరోడ్డుపై నరికేస్తా అంటూ బూతులతో విరుచుకు పడ్డారు కోటం రెడ్డి. అయితే ఈ విషయం పై , కోమటి రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. అసలు ఈ ఆడియో నాది కాదు అని వాదిస్తారో, లేక అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్తారో వేచి చూడాలి. మరో పక్క, ఆ విలేఖరి కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు మీడియాకు తెలిపే అవకాశం ఉంది. అయితే ఇలా ఒక అధికార పార్టీ ఎమ్మల్యే నరికేస్తా, పొడిచేస్తా అంటూ చేసిన వ్యాఖ్యలు చూసి ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే ఎక్కడ పడితే అక్కడ, మేకలను చంపినట్టు, నడి రోడ్డు పై జరుగుతున్న మర్డర్లు చూసి ప్రజలు భయపడుతుంటే, ఇప్పుడు ఏకంగా ఎమ్మల్యేలే ఇలా చెయ్యటం, హోం మంత్రి ఏమో ఘటన జరిగిన తరువాత కంప్లైంట్ ఇవ్వండి, అందరికీ కాపలా ఉండలేం అని చెప్పటం చూస్తుంటే, ఈ రాష్ట్రం ఎటు పోతుందో అర్ధమవుతుంది.

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు పై కక్ష సాధింపులు రోజు రోజుకీ ఎక్కవు అవుతున్నాయి. ఆయన ఉంటున్న ఇంటి నుంచి పంపించటానికి నిభందనల పేరుతో, చేస్తున్న హడావిడి చేస్తున్నాం. అయితే ఈ రోజు చంద్రబాబుకు మరో షాక్ ఇచ్చింది ప్రభుత్వం. జెడ్ + క్యాటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబుకు, భద్రతను మరింతగా తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే గత 20 రోజులుగా ఆయన భద్రత తగ్గించు కుంటూ వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు భద్రతను పూర్తిగా తొలగించారు. ఇక చంద్రబాబు కాన్వాయ్ లో పోలీసులు ఇవ్వాల్సి ఉన్న ఎస్కార్ట్‌, పైలెట్‌ క్లియరెన్స్‌ వాహనాలను తొలగించారు. అంటే చంద్రబాబు ట్రాఫిక్ లో ఇరుక్కుని, ఎమన్నా భద్రతా పరమైన ఇబ్బందులు వచ్చినా, అడిగే వారు ఉండరు. ఇక ఇప్పుడు తాజగా, చంద్రబాబుకు ఉండే ఇద్దరు ప్రధాన భద్రతా అధికారులను తొలగించారు. వీరితో పాటు, వీరికి అనుబంధంగా ఉండే ముగ్గురు ఆర్‌.ఐల నేతృత్వంలోని దాదాపు 15 మంది సిబ్బందిని కూడా తప్పించారు.

అయితే ఈ నిర్ణయం మాత్రం చాలా వివాదస్పంగా మారించి. ఎందకంటే గత 20 ఏళ్ళలో చంద్రబాబుకు , ఎప్పుడూ ఇంత తక్కువ భద్రత లేదు. చివరకు రాజశేఖర్ రెడ్డి సియంగా ఉండగా కూడా, చంద్రబాబు భద్రత విషయంలో ఎలాంటి కక్షసాధింపు ప్రదర్శించ లేదు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండగా కూడా, చంద్రబాబుకు ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ, ముగ్గురు ఆర్‌ఐ బృందాలతో చంద్రబాబుకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు భద్రత కల్పిస్తూ వచ్చాయి. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి మాత్రం అందరినీ తొలగించి, కేవలం ఇద్దరేసి కానిస్టేబుళ్లు చొప్పున, రెండు బృందాలుగా 2+2భద్రతగా కేటాయించారు. 2003లో చంద్రబాబు సియంగా ఉన్న సమయంలో, ఆయన పై మావోయిస్టులు మందుపాతర పేల్చి చంపటానికి చూసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చంద్రబాబుకు జడ్‌ప్లస్‌ భద్రతతో పాటు ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పించారు. ఇప్పుడు తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయంతో తెలుగుదేశం శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భద్రత పరమైన రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించకుండానే, జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బాబుకు భద్రత తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. 

సరిగ్గా వారం క్రితం ఉన్నట్టు ఉండి, ప్రజా వేదిక వద్దకు వచ్చి, ఈ బిల్డింగ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది, ఖాళీ చెయ్యండి అంటూ, తెలుగుదేశం అధినేతకు, అధికారులు వచ్చి నోటీస్ ఇచ్చి వెళ్లారు. అలా సాయంత్రం వచ్చి చెప్పారో లేదో, తెల్ల వారే సరికి చంద్రబాబు సామాన్లు అన్నీ రోడ్డున పడేసారు.ఇక తరువాత రోజు కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్ అక్కడే జరిగింది. ఈ సమావేశంలో అనూహ్య నిర్ణయం తీసుకుంటూ, ప్రజా వేదికను కూల్చి పడేయండి అంటూ జగన్ ఆదేశాలు ఇచ్చారు. నిబంధనలు సరిగ్గా పాటించకుండా, ప్రజా వేదిక కట్టారని, దాన్ని రెండు రోజుల్లో కూల్చి వేయాలని ఆదేశాలు ఇచ్చారు. దానికి తగ్గట్టుగా, రాత్రికి రాత్రి జనాన్ని తీసుకువచ్చి కూల్చి వేసారు. అయితే ఇంతటితో వీరు శాంతించలేదు. చంద్రబాబు అద్దెకు ఉంటున్న ఇల్లుని కూడా టార్గెట్ చేసారు. చంద్రబాబు ఉంటున్న ఇల్లు కూల్చి, ఆయన్ను మరింత అవమాన పరిచే కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ క్రమంలో, ఆయన ఇంటి జోలికి మాత్రమే వెళ్తే ఇబ్బంది వస్తుందని గ్రహించి, మిగతా వారికి తూతూ మంత్రంగా వార్నింగ్ లు ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ జోలికి వెళ్తే ఏమి అవుతుందో జగన్ కు బాగా తెలుసు.

ఈ నేపధ్యంలో, మొదటిగా చంద్రబాబు ఇల్లుని టార్గెట్ చేసారు కాబట్టి, ఆయన ఉంటున్న ఇల్లుకే ముందుగా నోటీసులు ఇచ్చారు. ఉండవల్లి కరకట్ట పై ఉన్న ఆయన నివాసానికి ఈ రోజు ఉదయం సీఆర్డీఏ అధికారులు వచ్చారు. ఈ నోటీసులు ఇవ్వటానికి, సీఆర్డీఏ అసిస్టెంట్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి, చంద్రబాబు నివాసం దగ్గరకు వచ్చి నోటీసులు ఇచ్చి వెళ్లారు. వెంటనే ఇళ్లు ఖాళీ చేసి, దీన్ని పడగొట్టాలని, లేకపోతే మేమే వచ్చి కూల్చేస్తామని నోటీసులో అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. వారం రోజుల్లో ఏ విషయం చెప్పాలని, నోటీసులకు వివరణ ఇవ్వకపోతే మేమే వచ్చి కూల్చేస్తామని చెప్పారు. ప్రస్తుతం చంద్రబాబు అద్దెకు ఉంటున్న ఇల్లు, ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు చెందినది. అయితే అధికారులు కేవలం చంద్రబాబు ఉంటున్న ఇంటికే నోటీస్ ఇచ్చారా, మిగతా వాటికి కూడా ఇచ్చారా అనేది తెలియదు. ఏది ఏమైనా, మరో వారం రోజుల్లో, చంద్రబాబు ఉంటున్న ఇల్లు కూడా కూల్చేస్తారు అనేది స్పష్టం.

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు పార్టీ మారుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ, చంద్రబాబు విదేశాల్లో ఉన్న టైములో కాపు నేతలు అంతా మీటింగ్ అవ్వటం, అలాగే చంద్రబాబు తిరిగి వచ్చిన తరువాత, నేతలు అందరూ కలిసనా, బొండా రాకపోవటంతో, ఆయన పై అనుమనాలు పెరిగిపోయాయి. సొంత పార్టీ నేతల పై, మాజీ మంత్రుల పై బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టపిక్ అయ్యాయి.  అయితే బొండా ఉమా మాత్రం, నేన్ పార్టీ మారటం లేదు అంటూ పదే పదే చెప్తూ వస్తున్నారు. బొండా ఉమా అసంతృప్తిలో ఉన్నారని తెలుసుకున్న చంద్రబాబు, ఆయనతో ఫోన్ లో మాట్లాడారు. అన్ని విషయాల పై చర్చించారు. జూలై 1 న కాపు నేతలు అందరితో సమావేశం ఏర్పాటు చేసానని, అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందామని చంద్రబాబు చెప్పటంతో, బొండా ఉమా శాంతించారు. అయితే నిన్న అనూహ్యంగా జరిగిన కొన్ని పరిణామాలతో ఉమా మళ్ళీ అలక పాన్పు ఎక్కారు. దీంతో మళ్ళీ చంద్రబాబు ఫోన్ చేసినట్టు సమాచారం.

నిన్న టీడీపీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నాం అంటూ, నియోజక్వారంలో కొంత మందికి ఫోన్లు వచ్చాయి. వాళ్ళల్లో కొంత మంది కార్పొరేటర్ లు కూడా ఉన్నారు. వారికి తెలుగుదేశం ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని, బొండా ఉమా వెళ్ళిపోతే, మీ నియోజకవర్గంలో మరో బలమైన నాయకుడు ఎవరూ అంటూ, అడిగినట్టు వారు చెప్తున్నారు. బొండా ఉమాకు ప్రత్యామ్నాయం ఎవరూ అంటూ అడిగినట్టు సమాచారం. అయితే, ఈ ఫోన్లు వస్తున్న విషయాన్ని వీళ్ళు బొండా ఉమ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న బొండా ఉమా, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. తాను పార్టీ మారటం లేదని, ఏకంగా చంద్రబాబుకు చెప్పినా, ఇలా ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.బొండా ఉమా మళ్ళీ అసంతృప్తితో ఉన్నారని తెలుసుకున్న చంద్రబాబు, గురువారం కూడా ఫోన్ చేసి మాట్లాడారు. తన ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని, ఇలా చేస్తే పార్టీ పరువు కూడా పోతుందని చంద్రబాబు వద్ద చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దీనికి స్పందించిన చంద్రబాబు, పార్టీ పరంగా ఇలాంటి కాల్స్ ఏమి చెయ్యలేదని, నాకు తెలియకుండా ఎవరైనా చేస్తే వారి పై చర్యలు తీసుకుంటానని, చెప్పటంతో బొండా ఉమా శాంతించారు.

Advertisements

Latest Articles

Most Read