రెండు రోజుల క్రితం, కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఎప్పటిలాగే అన్యాయం జరిగింది. విభజన చట్టంలో పెట్టిన ఏ హామీ పైనా ప్రస్తావన లేదు. విద్యాసంస్థలకు అరకోర కేటాయింపులతో సరిపెట్టారు. కేంద్ర బడ్జెట్ పై, ప్రతిపక్ష నేత, చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, కేంద్రం పై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా పై, రాజధాని పై ఒక్క మాట కూడా లేకపోవటం పై తీవ్రంగా స్పందించారు. అలాగే విద్యాసంస్థలకు ఇలా తక్కువ కేటాయిస్తే ఎప్పటికి పూర్తవుతాయి అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ పై తెలుగుదేశం పార్టీ నేతలు కూడా విమర్శలు గుప్పించారు. మోడీ చూపిస్తున్న వివక్ష పై ప్రశ్నలు గుప్పించారు. అయితే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించారు కాని, జగన్ మోహన్ రెడ్డి మాత్రం స్పందించలేదు. కేంద్ర బడ్జెట్ పై స్పందించని సియంగా జగన్ గారు ఉన్నారని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు. బడ్జెట్ బాగుంది అనో, బాగోలేదు అనో, ఎదో ఒకటి స్పందించాలి కదా అని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు.

అయితే, మీడియా ముందు జగన్ మోహన్ రెడ్డి మాట్లాడక పోయినా, పార్టీ నేతల వద్ద మాత్రం కేంద్ర బడ్జెట్ పై స్పందించారు. నిన్న తాడేపల్లిలోని ఆయాన నివాసంలో ముఖ్య నేతలతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా, బడ్జెట్ లో కేంద్రం మనకు అన్యాయం చేసిందని, జగన్ దృష్టిగా తేగా, జగన్ దీని పై స్పందించారు. కేంద్రం స్పందించకాపోతే, మళ్ళీ మళ్ళీ అడుగుదాం, పార్లమెంట్ లో అడుగుదాం, అన్ని చోట్లా అడుగుతూనే ఉందాం అని జగన్ చెప్పారు. అయితే, మొదటి సారి మోడీని కలిసిన తరువాత కూడా, జగన్ ఇదే రకమైన వ్యాఖ్యలు చేసారు. సార్, ప్లీజ్ సార్ ప్లీజ అని అడుగుతూ ఉంటానని జగన్ చెప్పిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి, జగన్ మోహన్ రెడ్డి, మోడీ పై, కేంద్రం పై, బహిరంగంగా ఏ విమర్శ చెయ్యరు అని అర్ధమవుతుంది. మనకు అన్యాయం జరుగుతున్నా, అడుగుతూనే ఉందాం, ప్లీజ్ సార్ ప్లీజ్ అని అడుగుదాం అనేది జగన్ గారి విధానంగా తెలుస్తుంది. మరి ఇలా అయితే మోడీ గారు, మనల్ని అసలు పట్టించుకుంటారా ? జగన్ గారు , మీ విధానం రాష్ట్రానికి మంచి జరిగితే పరవాలేదు కాని, మన హక్కుల కోసం, ప్లీజ్ ప్లీజ్ అని అడగటం ఎందుకు, ఒకసారి ఆలోచించండి.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిసి, జగన్ ను గెలిపించుకున్నారు. చంద్రబాబు ఆర్ధిక పరిస్థితి బాగోక పోయినా, ఉద్యోగస్తులకు తెలంగాణాకు సమానంగా జీతాలు పెంచారు. కాకపొతే ఆయన అడిగింది, రాష్ట్ర పరిస్థితి బాగోలేదు, అందరూ బాగా పని చెయ్యండి, అవినీతి చెయ్యకండి అని. అదే చంద్రబాబు పాలిట శాపం అయ్యి, ఉద్యోగస్తులను జగన్ కు దగ్గర చేసింది. అందుకే గెలిచిన తరువాత మొదటి సారి జగన్ సచివాలయానికి వచ్చినప్పుడు, వైసీపీ కార్యకర్తలు లాగా, జై జగన్, జై జగన్ అంటూ నినాదాలు చేసారు ఉద్యోగులు. ఇంత చేసిన ఉద్యోగులకు జగన్ కూడా బంపర్ ఆఫర్ ఇచ్చారని అందరూ అనుకున్నారు. అందుకు అనుగుణంగానే నిన్న, ఉద్యోగులు అందరికీ 27 శాతం ఐఆర్ పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకేముందు మా జగనన్న మాకు జీతాలు పెంచేసాడు అంటూ, ఉద్యోగులు సంబర పడే లోపే, వారికి మరో పిడుగు లాంటి వార్తా వినిపించారు. దీంతో ఉద్యోగులు ఖంగు తిన్నారు. అలా కుదరుదు అంటూ ఆందోళన మొదలు పెడుతున్నారు. ఇంతకీ విషయం ఏమి అంటే, జగన్ పెంచిన 27 శాతం ఐఆర్ జూలై నెల నుంచి వస్తుంది.

అయితే ఇప్పటికే చంద్రబాబు కూడా ఐఆర్ పెంచి ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఫిబ్రవరి 18 , 2019 న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల 01.04.2019 నుంచి 20 శాతం జీతాలు పెంచుతూ జీవో నెంబర్ 21 విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి అందరికీ 20 % ఐఆర్ ప్రకటించారు. జూలై నెలలో, ఏప్రిల్, మే, జూన్ నెలల పెరిగిన ఐఆర్ తీసుకోవచ్చు అంటూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం మాత్రం చంద్రబాబు పెంచిన 20 శాతం, ఏప్రిల్, మే, జూన్ నెలకు ఇవ్వలేమని, జూలై నుంచి పెంచిన 27 శాతం ఇస్తామని అంటుంది. దీని పై యూటీఎఫ్‌, ఎస్టీయూ, ఏపీటీఎఫ్‌ ఉపాధ్యాయసంఘాలు అభ్యంతరం చెప్తున్నాయి. చంద్రబాబు పెంచిన ఆ మూడు నెలలు 20 శాతం ఇవ్వకపోతే, జగన్ ఇస్తాను అంటున్న 27 శాతం జూలై నుంచి ఇచ్చినా, ఈ ఏడాది వచ్చేది 9 నెలలకే అని, అంటే ఆ మూడు నెలలు కోల్పోతే, యావేరేజ్ న ఈ ఏడాది మాకు వచ్చేది 20 శాతమే అని అంటున్నారు. అంతే కాకుండా, చంద్రబాబు ఇచ్చిన 20 శాతం ఐఆర్ రద్దు చెయ్యటం వల్ల, ఏప్రిల్, మే, జూన్ నెలలో పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు పింఛను, సర్వీసులో ఉన్నవారికి వేతనంపై ప్రభావం చూపుతుందని, దయ చేస్ చంద్రబాబు నిర్ణయం అమలు చేసి, ఉద్యోగస్తులకు అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వాలని చేపినవి ఇవ్వాలని, జగన్ ను కోరుతున్నారు.

విజయవాడకు చెందిన స్టీల్ ఫ్యాక్టరీ వ్యాపారి, హైదరాబాద్ లో హత్యకు గురి కావటం, అన్ని వేళ్ళు వైసీపీ నేత కోగంటి సత్యం వైపు చూపటంతో, కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. నిన్న రాత్రి హైదరాబాద్ పంజాగుట్ట వద్ద తేలప్రోలు రాంప్రసాద్ పై, గుర్తు తెలియని దుండగలు కత్తులతో పొడిచి వెళ్లారు. ఆయన్ను హాస్పిటల్ కు తీసుకువెళ్లటంతో, ఈ రోజు మృత్యువుతో పోరాడి ప్రాణం విడిచారు. అయితే మృతుడి కుటుంబ సభ్యలు మాత్రం, వైసీపీ నేత కోగంటి సత్యం పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలు, కొండపల్లిలోగల కామాక్షి స్టీల్ ఫ్యాక్టరీ చుట్టుూ తిరుగుతున్నాయి. పధకం ప్రకారం విజయవాడలో స్కెచ్ వేసి, హైదరాబాద్ లో చంపినట్టు తెలుస్తుంది. ప్రొఫెషనల్ గ్యాంగ్ చేత ఈ హత్య చేపించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యల వివరాల ప్రకారం, కృష్ణా జిల్లా కొండపల్లిలోగల కామాక్షి స్టీల్ ఫ్యాక్టరీలో రాంప్రసాద్, కోగంటి సత్యం భాగస్వాములు. అయితే కోగంటి సత్యం, రాంప్రసాద్ కు రూ.50 కోట్లు బాకీ పడ్డాడుని సమాచారం.

ఆ రూ.50 కోట్ల వ్యవహారం పై ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తుంది. రాం ప్రసాద్ ఎంత ఒత్తిడి చేసినా, కోగంటి సత్యం ఏమి ఇవ్వకపోవటంతో, కోర్టులో కేసువేశాడు. ఈ నేపధ్యంలోనే కోర్ట్ హియరింగ్ కు వస్తున్న టైములో, హత్యకు కోగంటి సత్యం పక్కా ప్లాన్ చేసి చంపినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే కోగంటి సత్యం నుంచి తనకు ప్రాణహాని ఉందని భావించే రాం ప్రసాద్ హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఈ లోపే అతన్ని చంపేశారు. అయితే కుటుంబ సభ్యులు వైసీపీ నేత కోగంటి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క కోగంటి సత్యం, గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను పోలీసుల ముందు లొంగిపోతానని కోగంటి చెప్తున్నట్టు సమాచారం. రాం ప్రసాద్ వల్ల తానె 70 కోట్లు నష్టపోయానని చెప్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ లో ఓ ఓ ప్రముఖ రాజకీయ నేత ఆశ్రయంలో కోగంటి ఉన్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మొన్నా మధ్య, ఎన్నికలు అయిపోగానే, తిరుపతి వచ్చిన ప్రధాని, ఒక మీటింగ్ పెట్టి, మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు, ఇంకా బయటకు రాలేదు అంటూ, చంద్రబాబుని ఉద్దేశిస్తూ వెటకారంగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే తిరుపతి వచ్చిన కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ కూడా చంద్రబాబు పై వెటకారంగా స్పందించారు. కేంద్రం చక్రం తిప్పుతా అని ప్రగల్భాలు పలికిన వారు ఏమి చెయ్యలేకపోయారు అంటూ చంద్రబాబు ఉద్దేశిస్తూ వ్యంగంగా మాట్లాడారు. చంద్రబాబు గతంలో గెలిచారు అంటే, అది బీజేపీతో ఉండబట్టే అని చెప్పుకొచ్చారు. అంతే కాదు, చంద్రబాబు ఇలా ఓడిపోవటానికి కారణం, మోడీని అకారణంగా దూషించటం అంట. మోడీని చంద్రబాబు తిడుతున్నారు కాబట్టే, చంద్రబాబుని ఘోరంగా ఓడించారు అని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ చెప్పుకొచ్చారు. అయితే కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు తెలుగుదేశం శ్రేణులు వేస్తున్న ప్రశ్నలకు, బీజేపీ వాళ్ళ దగ్గర సమాధానం లేదు.

మోడీతో అకారణంగా గొడవ పడటానికి చంద్రబాబుకు ఏమి పని ? మోడీ, చంద్రబాబుకు ఎమన్నా పొలం తగాదాలు, సరిహద్దు తగాదాలు ఉన్నాయా ? రాష్ట్రానికి మోడీ చేసిన అన్యాయం తట్టుకోలేక, ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయం పై ప్రశ్నించారు. రెండు జాతీయ పార్టీలో విభజన చట్టం చేసి, పార్లమెంట్ లో చేసిన చట్టం గురించి పట్టించుకోకపొతే, ఆ విషయం పై మోడీని నిలదీశారు. ఢిల్లీకి మించిన రాజధాని కడతాను అంటూ, 1500 కోట్లు మాత్రమే ఇచ్చిన మోడీని నిలదేసారు. కేసుల కోసం, సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ తెలుగువారి ఆత్మగౌరవం మోడీ ముందు తాకట్టు పెట్టలేదు. అయితే కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ చెప్తున్నట్టు, మోడీతో గొడవ వల్లే, ప్రజలు చంద్రబాబుని ఓడిస్తే, బీజేపీని గెలిపించాలి కాని, జగన్ ను ఎందుకు గెలిపించారు. నోటా కంటే తక్కువ ఓట్లు బీజేపీకి ఎందుకు వచ్చాయి ? ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి గారి దగ్గర సమాధానం ఉందో లేదో మరి ?

Advertisements

Latest Articles

Most Read