ఫ్యాక్షన్ భావజాలమున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితేఎలా ఉంటుందో నిన్న రాష్ట్రప్రజలతోపాటు, దేశమంతా గమనించిందని, దాదాపు 6గంటలపాటు మాజీముఖ్యమంత్రి, టీడీపీఅధినేత చంద్రబాబానాయుడిని నేలపై కూర్చొని నిరసనవ్యక్తంచేయడంతో వైసీపీ ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని టీడీపీ అధికారప్రతిని ధి నాగుల్ మీరా స్పష్టంచేశారు. వైసీపీప్రభుత్వ దౌర్జన్యాలను, రౌడీ యిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని ప్రజలు ఎల్లకాలం చూస్తూఊరుకోరనే వాస్తవాన్ని జగన్ ఎంతత్వరగా తెలుసుకుంటే అంతమంచిదన్నా రు. వైసీపీప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాల్లో ప్రజలకు మంచిఆదరణ లభిస్తుందన్న నమ్మకం ఈ ముఖ్యమంత్రికి ఉంటే, నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధిచేశానన్ననమ్మకం జగన్ కు ఉంటే, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు దుశ్చర్యలకు పాల్ప డుతున్నారో సమాధానంచెప్పాలని నాగుల్ మీరా డిమాండ్ చేశా రు. ఓటుకు రూ.5వేలు, రూ.10వేలు ఇచ్చి, పంచాయతీలను ఎం దుకు గెలిచారో చెప్పాలన్నారు. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, వారిరాజకీయ లబ్ధికోసం వ్యవస్థలను వాడుకుంటున్న మాట నిజం కాదా అని టీడీపీనేత ప్రశ్నించారు. అరచేత్తో సూర్యకాం తిని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుగెలుపుని అడ్డుకోవడం వైసీపీ ప్రభుత్వతరం కాదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటువేయబోయే ఓటర్లు, పట్టణప్రాంత ప్రజలు వైసీపీప్రభుత్వ దుర్మార్గాలపై ఆలోచన చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. పట్టణ ప్రాంత యువతకు ఉద్యోగాలు, ఉపాధికల్పించకుండా, రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాకుండా ఏముఖం పెట్టుకొని యువతను వైసీపీ వారు ఓట్లు అడుగుతున్నారన్నారు. అప్పులుతెచ్చి, ప్రజలపై భారంవేస్తూ, అరకొర సంక్షేమాన్నిఅమలుచేస్తున్న జగన్మోహన్ రెడ్డి పాలనపై పట్టణప్రాంత ఓటర్లు విసిగివేసారి ఉన్నారని నాగుల్ మీరా తెలిపారు.

పెట్రోల్ –డీజిల్ ధరలతోపాటు, ఇంటిపన్ను, నీటి పన్ను, చెత్తపన్ను, ఆస్తిపన్నురూపంలో ప్రజల్ని పీల్చుకుతింటు న్న ఘనత జగన్ కే దక్కిందన్నారు. కడుపుకాలిపోయే పిచ్చి మందు లిక్కర్ షాపుల్లో అమ్ముతున్న జగన్, ఏడాదికి రూ.19వేల కోట్లవరకు దోచుకుంటున్నాడన్నారు. భర్తలసంపాదన మొత్తం నాసిరకం మద్యానికి ఖర్చవుతుండటంతో మహిళలు బోరున విలపిస్తున్నారన్నారు. చంద్రబాబునాయుడి పాలనలోట్రాక్టర్ ఇసుక రూ.1500లకు లభిస్తే, నేడు అదేట్రాక్టర్ ఇసుక రూ.10వేల కు జగన్ అమ్ముతున్నాడన్నారు. నిర్మాణరంగం కుదేలవడంతో, భవననిర్మాణకార్మికులతో పాటు, వడ్రంగులు, ప్లంబర్లు, ఎలక్ట్రీషి యన్ల్, పెయింట్ పనివారు ఉపాధికోల్పోయి విలపిస్తున్నా రన్నా రు. మాటతప్పను, మడమతిప్పను అన్నజగన్ హామీలఅమల్లో మడమతిప్పితిప్పి, ఆయన మడమకూడా అరిగిపోయిందని, అందుకే తాడేపల్లిదాటి బయటకురావడంలేదని నాగుల్ మీరా ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు అమరావతిని మార్చనని చెప్పిన జగన్ నేడు, మూడురాజధానులపేరుతో మాట తప్పలేదా అన్నారు. కేంద్రం మెడలువంచి ప్రత్యేకహోదా తెస్తానన్న జగన్ ఇప్పుడు ఆమాట ఎందుకు ఎత్తడంలేదన్నారు. గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లు గెలుస్తానని శపథాలు చేస్తున్న జగన్మో హన్ రెడ్డి ఆశలు అడియాశలు అయ్యేలా, వైసీపీ అభ్యర్థులకు గుంటూరు, విజయవాడ నగరాలవాసులు కర్రుకాల్చి వాతపెట్టాల ని నాగుల్ మీరా సూచించారు. వైసీపీఅభ్యర్థులు గెలిచి, గుంటూరు విజయవాడ కార్పొరేషన్లు జగన్ పరమైతే, అమరావతి తరలింపు నకు కృష్ణా, గుంటూరుజిల్లాలప్రజలు అంగీకరించారనే భావనతో జగన్ రెచ్చిపోతాడన్నారు.

అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతు లు, మహిళలపోరాటాన్ని ప్రతిఒక్కరూ గుర్తుంచుకొని, ఓటు అనే ఆయుధంతో జగన్ కు తగినవిధంగా బుద్ధిచెప్పాలని నాగుల్ మీరా పిలుపునిచ్చారు. జగన్ సాగిస్తున్న నిర్బంధ, అటవిక, రాక్షస పాలనకు పట్టణఓటర్లే చరమగీతం పాడాలన్నారు. జగన్ పాదయాత్ర చేసినప్పుడు, చంద్రబాబునాయుడుకూడా జగన్ మాదిరే అడ్డుకుంటే, ఆనాడు వైసీపీనేత ప్రజల్లో తిరగగలిగేవాడా అని నాగుల్ మీరా ప్రశ్నించారు. తెలుగుదేశంపార్టీ నేతలు, కార్యకర్త ల ప్రచారాన్ని అడ్డుకోవడానికి కోవిడ్ నిబంధనలను సాకుగా చూపుతున్న ప్రభుత్వం, వైసీపీవారికి మాత్రం మినహయింపులి స్తోందన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం రావణకాష్టంలా రగిలిపోతుం టే, అన్నివర్గాలప్రజలు ఆదాయంలేక, అర్థాకలితో అలమటిస్తున్నా రన్నారు. జగన్ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చేపరిస్థితిలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరెన్నికగన్న రాజకీయనాయకుల్లో చంద్రబాబునాయుడు ఒకరని, అటువంటి వ్యక్తిపై కక్షసాధింపులకు పాల్పడటంద్వారా జగన్ తన గొయ్యితానే తవ్వుకుంటున్నాడని నాగుల్ మీరా స్పష్టంచేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బ డిగా పరిశ్రమలు వచ్చాయని, జగన్ వచ్చాక ఒక్కటంటే ఒక్క పరిశ్రమకూడా రాలేదన్నారు. ప్రజలంతా విజ్ఞతతోఆలోచించి, వైసీ పీ ప్రభుత్వాన్ని కట్టడిచేయాలన్నారు. పట్టణప్రాంత ఓటర్లు వైసీపీ ఆగడాలకు అడ్డుకట్టవేసి, చంద్రబాబునాయకత్వాన్ని ఆమోదిస్తార నే నమ్మకం తమకుఉందన్నారు. ప్రజల పన్నులతో జీతాలు తీసుకంటున్న అధికారులందరి తప్పులను తాము లెక్కిస్తున్నామ న్న టీడీపీనేత, వారందరూ భవిష్యత్ లో తగినమూల్యం చెల్లించుకు తీరుతారని హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read