రాష్ట్రంలో నేడుజరిగిన చీకటిరాజకీయం, జాతీయమీడియాకూడా ప్రసారంచేసిందని, చంద్రబాబునాయుడు చేసినతప్పేమిటో, డీజీపీ, ఏపీ పోలీస్ శాఖకు ఉన్న అధికారాలేమిటో చెప్పాలని టీడీపీ ఎమ్మె ల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. తిరుపతిలో గాంధీబొమ్మ వద్ద నిరసనప్రదర్శన చేయడానికి వెళుతున్న చంద్రబాబును అడ్డుకో వడం నిజంగా అరాచకానికి పరాకాష్టేనన్నారు. గతంలో హైకోర్టు చేతిలో చీవాట్లు తిన్న డీజీపీ, నేడు ఉత్తుత్తినోటీసులు ఇచ్చి మాజీ ముఖ్యమంత్రిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడన్నారు. తిరుపతి లో శాంతియుతంగా నిరసన తెలపడానికి టీడీపీ అనుమతికోరితే, 5వేలమందితో చంద్రబాబానాయుడు బహిరంగసభ పెడుతున్నం దునే తాముఅడ్డుకున్నామని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో జరిగే రాజ్యాంగఉల్లంఘన గురించి గాంధీ విగ్రహానికి తామువినతిపత్రం ఇవ్వాలనుకుంటే, దాన్నికాదనే హక్కు ఎవరికీలేదన్నారు. చంద్రబాబునాయుడిని రేణిగుంట విమా నాశ్రయంలో నిర్బంధించడంవల్ల ప్రయాణీకులు కూడా అనేక ఇబ్బందులు పడ్డారని అశోక్ బాబు తెలిపారు. చంద్రబాబుని అన్యా యంగా నిర్బంధించినందుకుగాను, డీజీపీకోర్టుకు సమాధానం చెప్పితీరాలన్నారు. చంద్రబాబునాయుడి వాహనశ్రేణిపై రాళ్లు, చెప్పులు విసిరితే, ప్రజాస్వామ్యంలో నిరసనతెలిపే హక్కు అందరికీ ఉంటుందని ఆనాడుడీజీపీ చెప్పాడన్నారు. అదేహక్కు నేడుమాజీ ముఖ్యమంత్రికి ఉండదా అని అశోక్ బాబు డీజీపీని నిగ్గదీశారు. కోవిడ్ నిబంధనలను సాకుగాచూపుతున్న పోలీసులు, తిరుపతిలో ఎక్కడ ఆ నిబంధనలు అమలవుతున్నాయో చెప్పాలన్నారు. పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చిలుకపలుకులు పలుకుతున్నార ని, వారికి చంద్రబాబునాయుడి ఆరోగ్యంపై అంతటిశ్రద్ధే ఉంటే, చిత్తూరుఎస్పీని, కలెక్టర్ ను కలవకుండా ఎందుకు అడ్డుకున్నారని అశోక్ బాబు ప్రశ్నించారు.

ఇదేవిధంగా పిచ్చిపనిచేసిన ప్రభుత్వం, రామతీర్థంలో విజయసాయిరెడ్డికి చేదుఅనుభవం జరిగేదాకా తెచ్చుకుందన్నారు. ముఖ్యమంత్రి హోదాలోఉన్నవ్యక్తి, తనస్థాయి ని మరిచి మాజీముఖ్యమంత్రిపై చర్యలకు పాల్పడుతున్నాడన్నా రు. శాంతియుతంగా నిరసన తెలిపేహక్కు ప్రతిఒక్కరికీ ఉంటుంద నే ఆలోచనకూడా లేకుండాపెద్దిరెడ్డి మాట్లాడుతున్నాడన్నారు. ఎన్నికల్లో వైసీపీ సాగించిన అరాచకాలు, అక్రమాలపై తాము చేసిన ఫిర్యాదులపై ఒక్కచర్యకూడా తీసుకోలేదన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఏప్రభుత్వం అనుసరించని మార్గాలను జగన్ ప్రభుత్వం అను సరించిందన్నారు. పిల్లిని నాలుగ్గోడలమధ్యన పెట్టికొడితే, పులి అవుతుందనే వాస్తవాన్ని జగన్ గుర్తించాలన్నారు. జగన్మోహన్ రెడ్డిని జైల్లో చాలా గౌరవంగా చూశారని, అక్కడ కూడా ఆయనకు మంచిమెనూ అమలుచేశారని, అటువంటప్పుడు ఆయన బెయిల్ పై బయటకు ఎందుకొచ్చాడో మంత్రిపెద్దిరెడ్డి సమాధానంచెప్పాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు తలపెట్టిన ఛలోఆత్మకూరు పర్యటనను అడ్డుకున్నప్పడే, ఈప్రభుత్వం ప్రజా ఉద్యమానికి బాటలు వేసిందన్నారు. 80, 90శాతం ప్రజలు వైసీపీ కే మద్ధతిస్తున్నారని చెప్పుకుంటున్న పాలకులు, పదిశాతంప్రజల ఆదరణకూడాలేని చంద్రబాబునాయుడినిచూసి ఎందుకు తడుపు కుంటున్నారని టీడీపీఎమ్మెల్సీ ప్రశ్నించారు.

వైసీపీప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి పైకి మేకపోతు గాంభీర్యం చూపుతూ, లోపల్లోపల వణికిపోతున్నారన్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే, 85శాతం మంది మద్ధతు చంద్రబాబునాయుడికే ఉందని నేషనల్ మీడియా సర్వేల్లో తేలిందని, ఆ వాస్తవంతెలియబట్టే, చంద్రబాబునాయుడిని అణగదొక్కి ఎన్నికల్లో గెలవడానికి వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. జగన్, ఆయనప్రభుత్వం ఇలానే చేస్తుంటే, రాష్ట్రప్రజలంతా తాడేపల్లిప్యాలెస్ పై దాడిచేసేరోజు వస్తుందన్నారు. చంద్రబాబునాయుడిని నిర్బంధిస్తే ఏమవుతుందో, రాష్ట్రం ఎలా ఆగ్రహిస్తుందో త్వరలోనే జగన్ కు అర్థమవుతుందన్నారు. జగన్ బతుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతోనే ముగిసిపోతుందన్న అశోక్ బాబు, ఉత్తరాంధ్రవాసులు స్టీల్ ప్లాంట్ కోసం ఎంతలా ఉద్య మిస్తున్నారో చూస్తూనే ఉన్నామన్నారు. ప్రజలఉద్యమంతోనే జగన్ ప్రభుత్వానికి పుల్ స్టాప్ పడుతుందన్నారు. డీజీపీ, డీజీపీలా వ్యవహరించకుండా, వైసీపీకార్యకర్తలా ప్రవర్తిస్తున్నాడన్నారు. చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకొని చంద్రబాబునాయుడిని అడ్డుకోవడమనేది ఈ ప్రభుత్వానికి ఎల్లకాలం కుదరదన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి ప్రభుత్వం పూనుకోకుంటే, తెలుగుదేశం చేపట్టబోయే కార్యక్రమాలే దుష్టపాలనను అడ్డుకుంటా యన్నారు. నేషనల్ మీడియాసాక్షిగా వైసీపీప్రభుత్వ అరాచకాలు నేడు దేశమంతా తెలిశాయని అశోక్ బాబు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read