జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ఇప్పటి వరకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై, 500 పైగా దాడులు జరిగాయని, 8 మంది చనిపోయారని తెలుగుదేశం పార్టీ ఆందోళన చేస్తున్న సంగాతి తెలిసిందే. వైసిపీ అరాచకాలు తట్టుకోలేక, గ్రామాల నుంచి ప్రాణ భయంతో వెళ్ళిపోయిన కార్యకర్తలను, గుంటూరులో శిబిరం ఏర్పాటు చేసి అక్కడ ఉంచారు. అయితే, పోలీసులకు ఎంత చెప్పినా, ఎవరూ పట్టించుకోవటం లేదని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. అందుకే చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. ఈ నెల 11న చలో పల్నాడు పేరుతొ, ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులతో పాటుగా, వైసిపీ బాధితులు అంతా అక్కడకు హాజరు కావాలని చంద్రబాబు పిలుపిచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అనే అనుమానాలు వస్తున్న తరుణంలో, ఇప్పుడు మరో ట్విస్ట్ బయటకు వచ్చింది.

palnadu 09092019 2

గురజాల పోలీసులు, గురజాలలో, ఈ రోజు నుంచి, 12వ తారీఖు వరకు 144 సెక్షన్ పెట్టారు. దీనికి కారణంగా, మొహరం పండుగ, గణేష్ నిమ్మజనం అని ఉత్తర్వుల్లో పెర్కున్నారు. అయితే, ఇలా పండుగల రోజుల్లో 144 సెక్షన్ పై ప్రజల్లో మిశ్రమ స్పందన వస్తుంది. ముఖ్యంగా, గ్రామాల్లో ఘనంగా, ఊరంతా ఏకమై జరుపుకునే గణేష్ నిమ్మజనంలో కూడా 144 సెక్షన్ ఎలా పెడతారు అంటూ కొంత మంది ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక రాజకీయ కారణాలు లేకపోలేదని, తెలుగుదేశం నేతలు అంటున్నారు. చంద్రబాబు గారు ఈ నెల 11న పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు కాబట్టి, వైసిపీ ప్రభుత్వ అరాచకాలు బయటకు రాకుండా ఉండేందుకు, చంద్రబాబు పర్యటనను అడ్డుకునే క్రమంలో, ఇలా 144 సెక్షన్ పెట్టేరని తెలుగుదేశం ఆరోపిస్తుంది.

palnadu 09092019 3

500 మంది పై దాడి చేసి, 8 మందిని చంపేస్తే కూడా, ఆందోళన చేసే హక్కు కూడా లేదా అని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. దీని పై అనవసర రాద్ధాంతం చేసి, చంద్రబాబు పై మరోసారి కక్ష తీర్చుకునే ప్రయత్నంలో, ఇలా 144 సెక్షన్ పెట్టి, ఆ రోజు మరింత ఉద్రిక్త పరిస్థితులు రేపే ఉద్దేశంతో ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. మరో పక్క, ఈ రోజు హోం మంత్రి, మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలేమీ లేవని, రాష్ట్రం ప్రశాంతంగా ఉందని అన్నారు. మరి అలాంటప్పుడు 144 సెక్షన్ ఎందుకు పెట్టారని తెలుగుదేశం ప్రనిస్తుంది. మరో పక్క, తెలుగుదేశం పునరావాస కేంద్రంలో అందరూ పైడ్ ఆర్టిస్ట్ లే ఉన్నారు అంటూ, హోం మంత్రి ప్రకటన చేసారు. అక్కడ తలలు పగిలి, ఒంటి నిండా కుట్లు వేసుకున్న వాళ్ళు రోజు మీడియాతో మాట్లాడుతున్నా, ఆ బాధితుల్ని, సాక్షాత్తు హోం మంత్రి గారే, పైడ్ ఆర్టిస్ట్ లు అనటం పై తెలుగుదేశం నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు 144 సెక్షన్ పెట్టటంతో, చంద్రబాబు పర్యటన ఎలా సాగుతుంది, చంద్రబాబు తదుపరి అడుగులు ఎలా ఉంటాయి అనేది వేచి చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read