నవ్యాంధ్రకు కీలకమైన భారీ కంపెనీలు రానున్నాయి. ఈ ఉగాదికి ఈ రెండు కంపెనీలు శంకుస్థాపన చేయ్యనున్నాయి. ఇప్పటికే చిత్తూరు-నెల్లూరు జిల్లాల సరిహద్దులోని శ్రీ సిటీ సెజ్‌కు సమీపంలో హీరో మోటార్‌ కార్ప్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భూమిని కేటాయించింది. తనకు కేటాయించిన భూమిని గురువారం రిజిస్ర్టేషన్‌ చేసుకుంది. ఎన్నో అడ్డంకులను దాటుకుని, హీరో కంపెనీ ఉగాదికి శంకుస్థాపనకు సిద్ధం అయ్యింది. ఇక్కడ ప్రొడక్షన్ మొదలైతే, రాష్ట్రంలోనే హీరో ద్విచక్ర వాహనాలు తయారవుతాయి.

అలాగే, సాఫ్ట్-వేర్ దిగ్గజం, HCL అమరావతిలో తన కార్యకలాపాలను చేపట్టేందుకు సిద్ధం అయిన సంగతి తెలిసిందే. గన్నవరం సమీపంలో డెవల్‌పసెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఈ సంస్థ భావిస్తోంది. దానికోసం ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం సమీపంలో 100 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిని హెచ్‌సీఎల్‌ అధినేత నాడర్‌ కూడా పరిశీలించారు. ఈ సంస్థ కూడా, ఉగాది నాటికి శంకుస్థాపన చేసే ఆలోచనలో ఉంది.

ఈ రెండు కంపెనీల రాకతో, అటు ఆటోమొబైల్ రంగం, ఇటు సాఫ్ట్-వేర్ రంగాలకు రాష్ట్రంలో మంచి రోజులు రానున్నాయి. ఈ పెద్ద కంపెనీల రాకతో, మరిన్ని దిగ్గజ కంపెనీలు రాష్ట్రం వైపు చూడనున్నాయి. ఇప్పటికే, హ్యుండాయ్‌ కార్ల తయారీలో ప్రముఖ స్థానం పొందిన కొరియాకు చెందిన ‘కియ’కంపెనీ కూడా రాష్ట్రంలో ప్లాంట్ పెట్టటానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read