రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా, పత్రికల పై ఆం-క్షలు పెరిగిపోయాయి. తెలంగాణాతో పోల్చుకుంటే, ఆంధ్రప్రదేశ్ లో మరీ పర్సనల్ స్థాయిలో, మీడియా ను టార్గెట్ చేసారు. ఏకంగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో, జగన్ మూడు పత్రికలు/ఛానెల్స్ ను పేరు పెట్టి మరీ చెప్పి, వారి సంగతి చూస్తాం అన్నట్టు ఇన్ డైరెక్ట్ గానే చెప్పారు. దానికి తగ్గట్టే, ఏబీఎన్, టీవీ ఛానెల్స్ ని అనధికారికంగా బ్యాన్ చేయించారు. అయితే ట్రిబ్యునల్ చీవాట్లు పెట్టి, ఫైన్ కట్టమని ఆదేశాలు ఇవ్వటంతో, ఆ రెండు ఛానెల్స్ వదిలినట్టే వదిలి, మళ్ళీ వెంటనే ఒక నెల రోజులు లోపే, మళ్ళీ రాకుండా చేసారు. ఇక, అసెంబ్లీ నిబంధనలు పాటించలేదని, ఏబీఎన్, ఈటీవీ, టీవీ5 ఛానెల్స్ ని అసెంబ్లీ ప్రసారాలు ఇవ్వకుండా వరుసుగా రెండో సెషన్ కూడా అడ్డుకున్నారు. ఇక మరో పక్క, జీవో నెంబర్ 2430 సంగతి అందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా జాతీయ మీడియా కూడా దీన్ని వ్యతిరేకించింది. ప్రభుత్వం పై వ్యతిరేక వార్తలు రాస్తే కేసులు పెట్టే అధికారం, అధికారులకు ఇచ్చారు.

ramoji 14122019 2

ఇక సోషల్ మీడియాలో కూడా ఇలాగే వ్యతిరేకంగా రాస్తే ఇబ్బంది పెడుతున్నారు. ఈ రకంగా మీడియా, పత్రికల పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆం-క్షలు పెట్టారు. ఇది ఇలా ఉంటే, ఈ రోజు ఈనాడు పేపర్ చూసిన వారు, షాక్ అయ్యారు. 46 ఏళ్ళుగా, ఈనాడు పేపర్ పై, ఎడిటర్ గా పేరు ఉన్న రామోజీ రావు గారి స్థానంలో, ఫౌండర్ రామోజీ రావు అని, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌కు మానుకొండ నాగేశ్వరరావు, తెలంగాణ సంచికకు డీఎన్ ప్రసాద్‌ ఎడిటర్లుగా పేపర్ పై కనిపించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా రామోజీ రావు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనే ఆసక్తికర చర్చ జరుగుతుంది. మీడియాను, పేపర్లని ప్రభుత్వాలు టార్గెట్ చేస్తున్న తరుణంలో, 80 ఏళ్ళ వయసులో, కేసులు అవి పెడితే, ఇబ్బంది అని, ఇలా చేసారా అనే అభిప్రాయం కలుగుతుంది.

ramoji 14122019 3

మరో పక్క, రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తినే ఎదుర్కున్న రామోజీ, కేసుల గురించి భయపడే వ్యక్తి కాదని, దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందనే చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ ఇలా కాంప్రోమైజ్ అవ్వాలి అనుకుంటే, ఎడిటర్ గానే కొనసాగుతూ, ప్రభుత్వం పై, ఎలాంటి వ్యతిరేక వార్తలు రాయకుండా, అలా కొనసాగించే వారని అంటున్నారు. అలా కాకుండా, ప్రభుత్వం వ్యక్తిరేక విధానాలను ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్న కారణంగానే, ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఏపి ప్రభుత్వం స్పీడ్ చూస్తే, ఏదో ఒక రకంగా కేసులు పెట్టి ఇరికించే విధంగా ఉంది కాబట్టి, ఆయన వయసు ద్రుష్టిలో పెట్టుకుని, ముందు జాగ్రత్తగా ఎడిటర్ హోదా నుంచి తప్పుకున్నారని, అంటే దాని అర్ధం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై, ఇక వరుస కధనాలు రాబోతున్నాయని అంటున్నారు. చూద్దాం ఏమి జరుగుతుందో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read