మ‌రో కొత్త స‌ర్వే వ‌చ్చింది. వైసీపీ గుండెల్లో గుభేల్మ‌మ‌నే గ‌ణాంకాలు మోసుకొచ్చింది. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ మూడు స్థానాల్లో ఎదురైన ప‌రాభ‌వం మ‌రిచిపోక ముందే మ‌రో ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌నే స‌ర్వే వైసీపీలో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.  రైజ్ అనే ఢిల్లీ బేస్డ్ సంస్థ చేసిన స‌ర్వేలో మంత్రులు చాలా మంది ఓడిపోతార‌ని తేల్చేసింది. మాజీ మంత్రులు కూడా ఓట‌మి త‌ప్ప‌ద‌ని వెల్ల‌డించింది. రైజ్ స‌ర్వే వెల్ల‌డించిన దాని ప్ర‌కారం మంత్రులు  గుడివాడ అమ‌ర్ నాథ్,  పినిపే విశ్వ‌రూప్, కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, జోగి ర‌మేష్‌, అంబ‌టి రాంబాబు, రోజాలు ఏం చేసినా గెలిచే ప‌రిస్థితి లేద‌ట‌. మాజీ మంత్రులు పేర్నినాని, మేక‌తోటి సుచ‌రిత‌,  అనిల్ కుమార్ యాద‌వ్, వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు,  అవంతి శ్రీనివాస‌రావు, కుర‌సాల క‌న్న‌బాబు,చెరుకువాడ శ్రీరంగ‌నాథ రాజులు దారుణ ప‌రాజ‌యం పాలు కాక త‌ప్ప‌ద‌ని స‌ర్వే సంస్థ రైజ్ గ‌ణాంకాలు ముందు పెట్టి మ‌రీ ప్ర‌క‌టించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read