వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలు, నేతలతోపాటు, తమ మాటవినని వారిపై అక్రమకేసులు, బహిరంగదాడులు, వేధింపులు ఎక్కువయ్యాయని, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా ఇలాంటిపరిస్థితులు లేవని, ఆపార్టీ సీనియర్‌నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. మంగళవారం గుంటూరులోని పార్టీరాష్ట్ర కార్యాల యంలో పల్నాడుప్రాంత వైసీపీ బాధితులకు టీడీపీ తరుపున నష్టపరిహారం కింద నగదు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆనందబాబు మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ఏనాడు వైసీపీ మాదిరిగా అరాచకాలకు పాల్పడలేదని, అలా చేసుంటే, వైసీపీఎప్పుడో కనుమరుగయ్యేదన్నారు. అక్రమకేసులతో యరపతినేని,చింతమనేనిపై కూడా కక్షసాధింపులకు పాల్పడుతోందన్నారు బెదిరింపులు, దాడులతో ఎల్లకాలం పాలనసాగించలేరన్న విషయాన్ని వైసీపీప్రభుత్వం గుర్తించాలని, నేడు అధికారపార్టీచేసే దురాగతాలకు భవిష్యత్‌లో తప్పకు ండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆనందబాబు తీవ్రస్వరంతో హెచ్చరించారు.

help 1112019 1

దాడులు, అక్రమకేసులతో ప్రత్యర్థులపై కక్షసాధింపులకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వంలో దోపిడీ తప్ప, ఎక్కడాకూడా మచ్చుకైనా అభివృద్ధి కనిపించడంలేదని గుంటూరుజిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవీ.ఆంజనేయులు మండిపడ్డారు. అధికారంలో ఉన్నామ నే అహంకారంతో తప్పుడుకేసులతో వేధిస్తునవారిని దెబ్బకుదెబ్బ తీస్తామని ఆయన హెచ్చ రించారు. తప్పకుండా టీడీపీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలెవరూ అధైర్యపడకుండా స్థానికఎన్నికల్లో సత్తాచాటాలని జీవీ పిలుపునిచ్చారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, కార్యకర్తలెవరూ అధైర్యపడాల్సిన పనిలేదని, టీడీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని మాజీఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఆరిపోయేదీపమని, అధికారం కొత్తకాబట్టే ఆపార్టీనేతల్లో అహంకారం ఎక్కువైందని ఆయన ఎద్దేవాచేశారు. పోలీస్‌శాఖను అడ్డుపెట్టుకొని ఎన్నాళ్లో ప్రభుత్వాన్ని నడపలేరని, పాలకులు ఎప్పుడు జైలుకువెళతారో కూడా తెలియని పరిస్థితులున్నాయని యరపతినేని వ్యాఖ్యానించారు. పల్నాడుప్రాంత కార్యకర్తలను, నాయకులను వేధిస్తున్న వారందరి జాతకాలు తమదగ్గరున్నాయని, ఎవరినీ వదిలేదిలేదని ఆయన హెచ్చరించారు.

help 1112019 1

వైసీపీ ప్రభుత్వ దాడుల్లో సర్వంకోల్పోయిన వారికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నివిధాలా అండగా నిలుస్తూ, వారి కన్నీళ్లు తుడుస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ తెలిపారు. పల్నాడులో వైసీపీ దాష్టీకాలకు బలైన, టీడీపీ కార్యకర్తలను ఆదుకునే క్రమంలో చంద్రబాబు పోరాటంచేశాకే రాష్ట్రప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. తెలుగుదే శం పార్టీని నమ్ముకున్నవారికి ఎన్నటికీ అన్యాయం జరగదని గిరిధర్‌ స్పష్టంచేశారు. ఒక్క అవకాశం ఇవ్వడంటూ ప్రజల కాళ్లావేళ్లాపడి బతిమలాడిన వైసీపీ, అధికారంలోకి వస్తే, పరిస్థితి ఇంతదారుణంగా ఉంటుందని ప్రజలెవరూ ఊహించలేదని ఎమ్మెల్సీ అశోక్‌ బాబు తెలిపారు. ఒక్కసారి అని వేడుకున్నవారు, అధికారంలోకి వచ్చాక ఇన్ని అరాచకాలు సృష్టిస్తారని ఎవరూ అనుకోలేదని, టీడీపీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవాల్సిన పనిలేదని, అశోక్‌బాబు చెప్పారు. వైసీపీపాల నలో ఇబ్బందులకు గురైనబాధితులకు టీడీపీ నాయకత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుం దన్నారు. జగన్‌ నాయకత్వంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనిస్థితికి రాష్ట్రంచేరుకుం దన్నారు. చుండూరు ఘటనతర్వాత, ఇన్నేళ్లకు వైసీపీప్రభుత్వ పుణ్యమాఅని మానవహక్కుల కమిషన్‌ రాష్ట్రంలో పర్యటనకు రావాల్సి వచ్చిందన్నారు. వైసీపీప్రభుత్వ దాష్టీకాలకు బలైన గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని జంగమేశ్వరపాడు, పిన్నెల్లి గ్రామస్తులైన ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 210 మంది టీడీపీ కార్యకర్తలకు నష్టపరిహారం కింద నగదు పంపిణీ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read