ఐ ప్యాక్ స‌ర్వే పేరుతో సోష‌ల్మీడియాలో స‌ర్కులేట్ అవుతున్న దానిపై ఆంధ్ర‌జ్యోతి ఓ క‌థ‌నం రాసింది. ఐ ప్యాక్ పేరిట సోషల్ మీడియాలో వైరల్‍గా మారిన సర్వే ఆంధ్ర‌జ్యోతి స్టోరీ అయ్యింది. అయితే దీనిని ఐ ప్యాక్ విచిత్రంగా ఖండించింది. ఫేక్ స‌ర్వేలు వేసిన మీరు మీ పాపాన మీరే పోతార‌న్న‌ట్టు శాప‌నార్థాలు పెట్ట‌డం ఏంటో? అంతుబ‌ట్ట‌టంలేదు. దేశ‌వ్యాప్తంగా కార్పొరేట్ రేంజులో విస్త‌రించిన ఐప్యాక్ త‌మ పేరుతో ఫేక్ స‌ర్వేని ప్ర‌చురిస్తే లీగ‌ల్ చ‌ర్య‌లు తీసుకోకుండా ట్వీట్ ద్వారా ఖండించి ఎందుకు వ‌దిలేసింద‌నేది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అంటే స‌ర్వేని వారే లీక్ చేశారా? స‌ర్వేని వారే చేశారా? అనేది తేలాల్సి ఉంది. ఈ స‌ర్వే ప్ర‌కారం  ఏపీ కేబినెట్‍లో మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి, అంజాద్ బాషా, విశ్వరూప్, దాడిశెట్టి రాజాలు మాత్ర‌మే గెలుస్తార‌నే నివేదిక ఉంది. మాజీ మంత్రుల్లో ధర్మాన కృష్ణదాస్, కొడాలి నాని గెల‌వొచ్చ‌ని, మిగిలిన తాజా..మాజీ మంత్రులంతా ఓడిపోతార‌ని స‌ర్వే వెల్ల‌డించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read