ఆంధ్రప్రదేశ్ లో కేబుల్ ఆపరేటర్లకు ప్రభుత్వం వైపు నుంచి వార్నింగ్ ఇచ్చారా ? తాము చెప్పినట్టు చెయ్యాల్సిందే, లేకపోతే కేబుల్ పీకి, ఏపి ఫైబర్ నెట్ అన్ని ఇళ్ళకు ఇస్తాం అని వార్నింగ్ ఇచ్చారా ? అవును అని చెప్తుంది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంచలన కధనం. మంత్రులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, కలిసి కేబుల్ ఆపరేటర్లకి వార్నింగ్ ఇచ్చారని, ఇద్దరు మంత్రులు కేబుల్ ఆపరేటర్లతో సమావేశమైన వీడియో ప్రసారం చేసింది ఏబీఎన్. ఈ సమావేశం పెర్ని నాని కార్యాలయంలో జరిగిందని, ఆ కధనంలో పెర్కుంది. అక్కడ సమావేశానికి వచ్చిన ఎంఎస్ఓ లను కూడా వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. మంత్రులు ఇద్దరూ, లోపల ఏమి చెప్పారో చెప్తూ, కధనం ప్రసారం చేసింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై వ్యతిరేక కధనాలు వేసే ఏ ఛానెల్ కూడా మీరు ప్రసారం చెయ్యకూడదు అంటూ, కేబుల్ ఆపరేటర్లకి మంత్రులు హుకం జారీ చేసారని ఆ కధనం సారంశం.

abn 13092019 2

అయితే మంత్రుల ఆదేశాలకు కొంత మంది ఎమ్మెస్వోలకు అది కుదరదు అని తేల్చి చెప్తూ, ట్రాయ్ తీసుకు వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారుడు కోరుకున్న చానల్ ను అందించాల్సి ఉంటుందని, అందులో ఫ్రీ చానల్ విషయంలో ఇవ్వాల్సిందే అని నిబంధనలు చెప్తున్నాయని, ఏబీఎన్ ఫ్రీ ఛానెల్ అని, దాన్ని బ్యాన్ చేస్తే చట్ట విరుద్ధమవుతుందని ఎమ్మెస్వోలు, మంత్రులకు చెప్పగా, వారి సమాధానంపై మంత్రులు సీరియస్ అయినట్లుగా ఆ కధనంలో ఏబీఎన్ చెప్పింది. అయితే దానికి మంత్రులు స్పందిస్తూ, ఆ చట్టాలు, నిబంధనల కాదు, తాము చెప్పిన టీవీ చానళ్లు మీ కేబుల్ లో రాకూడదు, కుదరదు అంటే చెప్పండి, మీ కేబుల్ తీసి అన్ని ఇళ్ళకు ఫైబర్ నెట్ వచ్చేలా చేస్తాం అంటూ, వారిని బెదిరించినట్టు ఆ కధనంలో ఏబీఎన్ పేర్కొంది.

abn 13092019 3

అయితే ప్రభుత్వం ఇలా చెయ్యటం పై, అందరూ మండి పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా, మీడియా స్వేఛ్చ అంటూ, తన సాక్షి పై పాఠాలు చెప్పిన జగన్, ఇప్పుడు ఇలా చెయ్యటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి అంత చేసినా, ఆయన ఎదుర్కున్నారు కాని, ఇలా బ్యాన్ చెయ్యలేదని గుర్తు చేస్తున్నారు. ఈ విషయం పై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు స్పందిస్తూ, న్యూస్‌ చానెళ్ల ప్రసారాలను నిలిపేయాలని మంత్రులే బెదిరించడమేంటని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మా గొంతు నొక్కేస్తున్నారు, సోషల్ మీడియాలో ఎవరైనా వ్యతిరేకంగా పెడితే, వారిని అరెస్ట్ చేస్తున్నారు, ఇప్పడు ఏకంగా ఛానెల్స్ నే బ్యాన్ చేసారు అంటూ చంద్రబాబు మండి పడ్డారు. 72 గంటల్లో ఎంఎస్‌వోలు స్పందించకపోతే ట్రాయ్‌కు ఫిర్యాదు చేయాలని, ప్రజలను చంద్రబాబు కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read