ఈ రోజు హైకోర్ట్ లో, రాష్ట్ర ప్రభుత్వానికి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు విషయంలో ఇచ్చిన జీవో కొట్టేసి, కోర్ట్ ధిక్కరణ కేసు వేస్తాం అని చెప్పిన సంగతి తెలిసిందే. తరువాత డాక్టర్ సుధాకర్ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తీర్పు పై నమ్మకం లేదని, అందుకే డాక్టర్ సుధాకర్ కేసుని, సిబిఐకి ఇస్తున్నాం అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో విషయంలో కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఇంటలిజెన్స్ డీజీగా ఉండగా, అవినీతి చేసారు అంటూ, ఆరోపణలు మోపి, రాష్ట్ర ప్రభుత్వం ఇంటలిజెన్స్ డీజీగా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు ని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై, ఏబీ వెంకటేశ్వరరావు ముందుగా క్యాట్ కు వెళ్ళగా, అక్కడ రిలీఫ్ రాకపోవటంతో, హైకోర్ట్ కు వెళ్ళారు ఏబీ వెంకటేశ్వరరావు. గత నెల రోజులుగా ఈ విషయం హైకోర్ట్ లో విచారణ చెయ్యగా, ఈ రోజు తీర్పు ఇచ్చారు.

ఐపీఎస్ అధికారి ఏడీజీ వెంకటేశ్వరరావు పై సప్సెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. సస్పెన్షన్‍ను సమర్థిస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్ట్ పక్కన పెట్టింది. ఏబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. సస్పెన్షన్ కాలం నాటి జీతభత్యాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. అయితే గతంలో చంద్రబాబు హయంలో ఆయన ఇంటలిజెన్స్ డీజీగా పని చేస్తున్న క్రమంలో, ప్రతిపక్షంలో ఉన్న జగన్, విజయసాయి రెడ్డి డైరెక్ట్ గా ఆయన పై విమర్శలు చేసారు. తరువాత అధికారంలోకి రాగానే, ఏబీవీ పై ఆరోపణలు మోపి, ఆయన్ను సస్పెండ్ చేసారు. కొన్ని రోజుల ముందు ఇలాగే ఐఆర్ఎస్ జాస్తి సాంబశివరావు పై కూడా ఇలాగే ఆరోపణలు చెయ్యటం, సస్పెండ్ చెయ్యటం, ఆయన సస్పెన్షన్ కూడా ఎత్తివేసిన విషయం తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read