ఈఎస్ఎ కేసులో అరెస్టయిన మాజీమంత్రి అచ్చెన్నాయుడు వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆయనను ఈ నెల 25 నుండి 27 వరకు మూడు రోజులు పాటు కస్టడీకి ఎసిబి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. అచ్చెన్న నాయుడి ఆరోగ్యపరిస్థితుల రీత్యా ఆయనను చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో ఎసిబి అధికారులు విచారిస్తున్నారు. గురువారం ఏసీబీ డీఎస్సీ ప్రసాద్ ఈ విచారణను ప్రారంభించారు. అయితే ఈ కేసులో అచ్చె న్న సహా నిందితులను జైలు రిమాండ్ నుంచి ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకుని విచారి స్తున్నారు. అచ్చెన్నను ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించిన నేపథ్యంలో విపక్షం అధికార పార్టీపై విరుచుకుని పడింది. అచ్చెన్నను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసారనే కథనాలు ఆధారంగా ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేసి అచ్చెన్నపై హత్యకు కుట్ర జరుగుతుందని అభియోగించింది. అధికారులు ఒత్తిడిపై ఆసువత్రినుండి బలవంతంగా డిశ్చార్జ్ చేసారని ప్రతిపక్షం ఆరోపించింది. అయితే ఏసీబీ కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే గుంటూరు జీజీహెచ్ లోనే అచ్చెన్నను ఆయన న్యాయవాది సమక్షంలో వీడియో రికార్డింగ్ తో పాటుగా విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నను ఏసీబీ కస్టడీకి తీసుకుని విచారిస్తున్న అంశంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. ఈ చర్యను తప్పుబట్టారు.

అయితే మరోపక్క, అచ్చెన్నాయుడు విచారణాలో కూడా కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయని, అచ్చెన్నాయుడు ఎదురు ప్రశ్నించటంతో, ఏసీబీ దగ్గర సమాధానం లేదని కొన్ని పత్రికలు రాసాయి. నిన్న అచ్చెన్నాయుడుని మూడు గంటల పాటు ఏసీబీ అధికారాలు విచారణ చేసారు. మొదటగా, అచ్చెన్నాయుడు నేపధ్యం, ఆయన రాజకీయ, కుటుంబ జీవితం గురించి కొన్ని ప్రశ్నలు అడిగారని సమాచారం. మందులు కొనుగోళ్ళలో ఎలాంటి ప్రొసీజర్ పాటించారు, టెండర్లు లేకుండా కొన్ని కొనుగోళ్ళు ఎందుకు చేసారు అని అడగగా, అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తూ, మందులు కొనుగోళ్ళ వ్యవహారంలో తన సంతకం ఎక్కడా లేడని, మందులు కొనే టైంకి, నేను ఆ మంత్రినే కాదని ఆయన చెప్పారు. టెలిమెడిసిన్‌ విషయంలో మాత్రం, కేంద్రం ఇవి మొదలు పెట్టాలని చెప్పటంతో, తెలంగాణాలో ఎలా చేసారో అలా చెయ్యండి అని చెప్పానని అచ్చెన్న చెప్పగా, ఒక కంపెనీతో ఒప్పందం చేసుకోవాలని ఎలా చెప్తారు అని చెప్పగా, తెలంగాణాలో చేసినట్టు చెయ్యమన్నానని, కాని తరువాత ఒప్పందంలో తాను ఎక్కడా సంతకం చెయ్యలేదు కదా అని అచ్చెన్న ఎదురు ప్రశ్నించారు. ఎక్కడా ఒప్పందాల పై తన సంతకాలు లేవని, ఏమైనా ఉంటే చూపించండి అని అన్నారు. అప్పటికి టైం రాత్రి 8 అవ్వటంతో, విచారణ ముగించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read