ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వివరాలు అడిగితే, ఆ వివరాలు కోర్టుకు ఇవ్వలేమని, అవి రాజ్యాంగ విరుద్ధం అంటూ ప్రభుత్వం తరుపున రాష్ట్ర డిప్యూటీ అకౌంటెంట్‌ జనరల్‌ కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ ఇప్పుడు ఆసక్తిగా మారింది. సహజంగా కోర్టు అడిగితే, ఎక్కడ విషయం దాయటం అనేది ఉండదు. అదీ వేల కోట్లు ఖర్చు చేసిన కేసు పై హైకోర్టులో కేసు నడుస్తూ ఉండగా, అవి మేము మీకు ఇవ్వం అని చెప్పటం పై అందరూ షాక్ అయ్యారు. ఏదైనా ఉంటే సీల్డ్ కవర్ లో ఇచ్చి, హైకోర్టుకు ఇది బయటకు ఇవ్వద్దు అని చెప్పవచ్చని, అలా కాకుండా నిబంధనలు చెప్తూ, అసలు కోర్టుకు సమాచారం ఇవ్వం అని చెప్పటం కర్రెక్టా కాదా అనే చర్చ జరుగుతుంది. అసలు కేసు విషయానికి వస్తే, అమరావతి మార్పు విషయం పై హైకోర్టులో అనేక కేసులు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ముఖ్యంగా ఒక కేసు విషయం పై అందరికీ ఆసక్తి నెలకొంది. అది ఇప్పటి వరకు అమరావతిలో పెట్టిన ఖర్చు. గత తెలుగుదేశం హయాంలో దాదాపుగా 9 వేల కోట్లు పైన ఖర్చు అయ్యిందని చెప్తున్నారు. కొండవీటి వాగు, సీడ్ ఆక్సెస్ రోడ్డు, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్, వివిధ అంతర్గత రోడ్డులు, డ్రైనేజిలు, ఐఏఎస్, ఐపిఎస్, జడ్జి క్వార్టర్స్, ఎన్జీవో హౌసింగ్, నాలుగవ తరగతి హౌసింగ్, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ హౌసింగ్, ఇలా అనేక అనేక బిల్డింగ్ల నిర్మాణాలు జరిగాయి. అయితే ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసిన భవనాలు ఇప్పుడు ఇక్కడ ఆపేసి, మళ్ళీ వైజాగ్ వెళ్లి, అక్కడ మళ్ళీ ఇంతా ఖర్చు చేసి భవనాలు నిర్మాణం చేయటం ఏమిటి అనేది పిటీషన్.

ag 28112020 2

అయితే దీని పై స్పందించిన హైకోర్టు, అసలు అమరావతి పై ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేసారు, ఏ ప్రాజెక్ట్ కు ఎంత ఖర్చు చేసారో చెప్పండి అంటూ రాష్ట్ర ప్రభుత్వ అకౌంటెంట్ జెనెరల్ ను వివరాలు ఇవ్వమని ఆదేశించింది. అయితే ఇలా అయినా అసలు అమరావతి పై ఎంత ఖర్చు చేసారో తెలుస్తుందని, ఇన్నాళ్ళు వైసీపీ ప్రచారం చేస్తున్నట్టు అక్కడ గ్రాఫిక్స్ మాత్రమే ఉన్నాయా, నిజమైన నిర్మాణాలు జరిగాయా అనేది తెలుస్తుందని అందరూ ఆశించారు. అయితే రెండు వాయిదాలకు కూడా అకౌంటెంట్ జెనెరల్ వివరాలు ఇవ్వకపోవటంతో హైకోర్టు సీరియస్ అయ్యి, వివరాలు ఇవ్వకపోతే అకౌంటెంట్ జెనెరల్ ను కోర్టుకు పిలుస్తామని హెచ్చరించింది. అయితే రెండు రోజుల క్రితం డిప్యూటీ అకౌంటెంట్‌ జనరల్‌ పేరుతో హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసి, తాము లెక్కలు అన్నీ రాష్ట్రపతికి, గవర్నర్ కి ఇస్తామని, అక్కడ నుంచి అసెంబ్లీకి వస్తుందని, ఇలాంటి వివరాలు బహిర్గత పరచటం కుదరదు అంటూ, దానికి సంబంధించి రాజ్యాంగంలో చెప్పిన రూల్స్ అన్నీ వివరిస్తూ, వివరాలు ఇవ్వటం కుదరదనే విధంగా అఫిడవిట్ లో తెలిపారు. అయితే ఈ అఫిడవిట్ పై కోర్టు ఎలా స్పందిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read