తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుని, 20 రోజుల క్రితం, ఈఎస్ఐ స్కాం పేరుతొ ప్రభుత్వం, అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు పైల్స్ ఆపరేషన్ అయిన మరుసటి రోజే, అరెస్ట్ చేసి, దాదాపుగా 15 గంటలు, 600 కిమీ తిప్పి ఆయన్ను విజయవాడ తీసుకొచ్చారు. అయితే, ఆపరేషన్ అయ్యి 24 గంటలు మాత్రమే కావటంతో, అచ్చెన్నాయుడు గారికి తీవ్ర రక్త శ్రావం అయ్యి, ఆయనకు మరోసారి ఆపరేషన్ చెయ్యాల్సి వచ్చింది. ఇదంతా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో, ప్రభుత్వం ఆధ్వర్యంలో, పోలీస్ రేమాండ్ లోనే జరిగింది. ఆయనకు ఆరోగ్యం బాగోకపోవటం, రెండు సార్లు ఆపరేషన్ చెయ్యటంతో, కోర్టు కూడా, ఆయన్ను హాస్పిటల్ లో పెట్టి తగ్గేదాకా ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే నాలుగు రోజుల క్రితం, అర్ధరాత్రి పూట అచ్చెన్నాయుడుని డిశ్చార్జ్ చెయ్యటానికి, హాస్పిటల్ వర్గాలు ప్రయత్నించటం, వెంటనే ఏసీబీ అధికారులు అరెస్ట్ చెయ్యటానికి రెడీ కావటంతో, టిడిపి ప్రతిఘటించింది. ఆయన ఆరోగ్యం కుదుట పడలేదు, రెండో సారి ఆపరేషన్ చేసారు, నొప్పితో ఇబ్బంది పడుతున్నారు అని నిరసన తెలపగా, వెనక్కు తగ్గారు. అయితే ఈ రోజు హుటాహుటిన, అచ్చెన్నాయుడుని డిశ్చార్జ్ చేసి, విజయవాడ సబ్ జైలు కు తరలించారు.

ఆయన కనీసం నడవలేని స్థితిలో ఉన్నారు. వీల్ చైర్ పై అంబులెన్స్ దాకా తీసుకుని వచ్చారు. ఇదంతా కేవలం ఒక గంటలో జరిగిపోయింది. అయితే ఈ పరిణామం జరిగిన గంట ముందు, అచ్చెన్నాయుడు పై వేసిన బెయిల్ పిటిషన్‍ మీద వాదనలు జరిగాయి. ఈ రోజు బెయిల్ పిటీషన్ పై, వాదనలు ముగిసాయి. అచ్చెన్నాయుడు తరుపున, సీనియర్ సుప్రీం కోర్టు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు ముగియటంతో, రేపు కాని, ఎల్లుండి కాని, బెయిల్ పై తీర్పు రానుంది. ఈ విషయం తెలిసిన గంట సేపటికే, అచ్చెన్నాయుడుని డిశ్చార్జ్ చేస్తూ హాస్పిటల్ వర్గాలు నిర్ణయం తీసుకోవటం, పోలీసులు సబ్ జైలుకు తరలించటం జరిగిపోయాయి. ఇవి రెండు యాద్రుచికంగా జరిగాయో, లేదో కాని, తెలుగుదేశం ప్రభుత్వం, దీని వెనుక జగన్ ఉన్నారని, విచారణ అయిపొయింది కాబట్టి, ఆయనకు ఎలాగూ బెయిల్ వస్తుంది కాబట్టి, ఒక్క రోజు అయినా అచ్చన్నను జైలులో పెట్టటానికి, జగన్ ఈ విధంగా చేసారని, టిడిపి ఆరోపిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read