రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో జోష్ నింపేందుకు పార్టీ అధినేత చంద్రబాబు కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ ఏపీ అధ్యక్షునిగా ప్రస్తుతం కొనసాగుతున్న కళావెంకట్రావు స్థానంలో మరొకరికి అవకాశమివ్వాలని భావిస్తున్నారు. ఈమేరకుఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో సంప్రదింపులు సైతంచేస్తున్నట్లు సమా చారం. ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ప్రతిపాదనకు కార్యరూపం ఇచ్చే పనిలో నిమగ్నమైంది. టీడీపీ అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ నియామకాల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రాధా న్యత ఇవ్వాలనిచంద్రబాబు భావిస్తున్నారు. ఇప్ప టికే తెలుగుమహిళా అధ్యక్షురాలిని సైతం విశాఖ కు చెందినమాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితను నియమించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడితోపాటు తెలుగు యువత అధ్యక్ష పదవిని సీమ సీమ ప్రాంతానికి చెందినయువనేతకు ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ఏపీ, తెలంగాణా లకు ఇద్దరు అధ్యక్షులను నియమించింది. ఏపీ అధ్యక్షునిగా శ్రీకాకుళంకు చెందిన కిమిడి కళా వెంకట్రావును నియమించారు.గత ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైంది. ఇప్పుడుస్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలతో పాటుగా పార్టీలో జోష్ నింపేందుకు సంస్థాగతంగా కొత్త నియామకా లు చేపట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా తిరిగి శ్రీకాకుళంకే చెందిన మాజీమంత్రి అచ్చెన్నాయుడితో పాటు రామ్మోహన్ నాయుడిలో ఒకరికి పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించాలని సీనియర్ నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఇద్దరు నేతలు ఇప్పుడు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అటు అసెంబ్లీలో బాబాయ్, ఇటు పార్లమెంట్ లో అబ్బాయ్, గట్టిగా తమ వాణి వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

మాజీ మంత్రిగా, వాయిస్ ఉన్న నేతగా గుర్తింపు ఉండటంతో పాటుగా అసెంబ్లీలోనూ బయట వైసీపీని ఎటాక్ చేయడంలో చంద్రబాబుకు చేదోడువా దోడుగా నిలుస్తున్న అచ్చెన్నాయుడికే అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తుంది. రామ్మోహన్ నాయుడు ఎంపిగా పార్లమెంటులో తన ప్రసంగాలతో ప్రత్యేక గుర్తింపు పొందా రు. ఆయన సేవలు పార్టీ భవిష్యత్ లో మరింత గావినియోగించుకునే అవకాశముందని, అచ్చెన్నాయుడికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెప్తున్నారు. గతంలో దివంగత ఎర్రంనాయుడు కూడా, చంద్రబాబుకి ఎంతో అండగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎర్రం నాయుడు, ఢిల్లీలో ఉంటూ, పార్టీ తరుపున అన్ని పనులు చేస్తూ, చంద్రబాబుకి చేదోడు వాదోడుగా ఉండేవారని, ఇప్పుడు అచ్చెంనాయుడు, రామ్మోహన్ నాయుడు అండగా ఉంటున్నారని గుర్తు చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read