రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ వ్యవహారంపై ఈసీ సీరియస్‌ అయ్యింది. ఓవైపు న్యాయస్థానం ఏకంగా డీజీపీ కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. మరోవైపు.. రేవంత్‌ అరెస్ట్‌ను పర్యవేక్షించిన ఎస్పీపై ఎన్నికల కమిషన్‌ వేటు వేసింది. ఆమెను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కూడా ఆదేశించింది. అన్నపూర్ణ స్థానంలో ఐపీఎస్‌ అధికారి అవినాష్‌ మహంతిని వికారాబాద్‌ ఎస్పీగా నియమించారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని ఈసీ ప్రకటించింది. కొడంగల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ వ్యవహారమే ఎస్పీ అన్నపూర్ణ ఆకస్మిక బదిలీకి కారణమైంది. అర్ధరాత్రి వేళ పోలీసులు ప్రహారీగోడ దూకి మరీ రేవంత్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లడం.. తలుపులు పగులగొట్టి నిద్రలో ఉన్న రేవంత్‌రెడ్డిని అరెస్ట్‌ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

vikarabad 05122018

ఈ అరెస్ట్‌ వ్యవహారాన్ని ఎస్పీ అన్నపూర్ణ స్వయంగా పర్యవేక్షించారు. దీంతో.. ఎస్పీ అన్నపూర్ణను పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేయాలని ఈసీ సూచించింది. ఆమెకు ఎటువంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని కూడా ఆదేశించింది. అన్నపూర్ణ స్థానంలో వికారాబాద్‌ ఎస్పీగా నియమితులైన అవినాష్‌ మహంతి ప్రస్తుతం హైదరాబాద్‌ సీసీఎస్‌ డీసీపీగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు అందగానే.. ఆయన వికారాబాద్‌ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టేందుకు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. అయితే.. రేవంత్‌ అరెస్ట్‌ వ్యవహారంలో ఐజీ శ్రీనివాసరావు మీద కూడా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు ఈసీని కోరారు. కానీ.. ఎస్పీ రమాదేవి బదిలీకే ఈసీ పరిమితమైంది.

vikarabad 05122018

రేవంత్ రెడ్డి అరెస్ట్ కేసులో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీల్ లేకుండా ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వడంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది. ఇలాంటి సాదాసీదా కాగితాల నివేదిక ఎవరైనా, ఎక్కడైనా తయారు చేయొచ్చని.. సీల్ లేకుండా ఇస్తే దాన్ని నిరుపయోగపరచరన్న నమ్మకం ఏంటని డీజీపీని ప్రశ్నించింది. పోలీసులు ఇలానే పని చేస్తారా అని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే తమ దగ్గర సీల్ విధానం లేదని హైకోర్టుకు తెలిపారు డీజీపీ. రేవంత్ ఆందోళనకు దిగుతారన్న సమాచారం ఉన్నప్పుడు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని.. కానీ వారంట్ లేకుండా అర్ధరాత్రి ఎలా అరెస్ట్ చేస్తారని మండిపడింది హైకోర్టు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read