ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. టీడీపీ తరఫున కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలిచారు. అయితే టీడీపీ తరఫున గెలిచిన, ఓడిన కొందరు కీలకనేతలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ బీజేపీ కండువా కప్పుకుంటారని పుకార్లు వస్తున్న విషయం విదితమే. అయితే తాజాగా.. ఈ వ్యవహారంపై సీఎం రమేష్ రియాక్టయి క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీ నేతలెవరూ మమ్మల్ని సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు బీజేపీలో చేరే ఉద్దేశం తనకు లేదని రమేష్ క్లారిటీ ఇచ్చారు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ కేవలం కల్పితాలేనని సీఎం రమేష్‌ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు. మరో పక్క, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పై కూడా గత కొద్ది రోజులుగా పార్టీ మారుతున్నట్లు వస్తున్న పుకార్లపై ఆయన మొదటిసారి స్పందించారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు.

ramesh 14062019

టీడీపీలోనే కొనసాగుతానని, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, తాను కలిసినా... ఓడిపోవడం వెనుక బలమైన కారణాలు ఏవో ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇద్దరూ కలిస్తే మనకు ఇబ్బందని కొందరు భావించినట్టున్నారన్నారు. ఈవీఎంలలో సమస్య ఉందని అనుమానిస్తున్నానని, తన నియోజకవర్గంలో ఇందుకు కొన్ని ఆధారాలు లభించాయని తెలిపారు. వైసీపీ మైండ్‌గేమ్‌ ఆడుతోందని, పార్టీని పునఃనిర్మిస్తామని, కార్యకర్తలకు అండగా ఉంటామని ఆదినారాయణరెడ్డి భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంటే.. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు గత రెండ్రోజులుగా అసెంబ్లీ సాక్షిగా, మీడియా ముఖంగా చెబుతున్న విషయం విదితమే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read