ఆంధ్రప్రదేశ్ పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులను, రెండిటినీ కూడా ఉపసంహరించుకుంటూ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన బిల్లులను, రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ రూపంలో దాఖలు చేసారు. ఈ నెల 22వ తేదీన రాష్ట్ర హైకోర్టులో త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరుగుతున్న సమయంలో అడ్వొకేట్ జనరల్ శ్రీరాం శుభ్రమణ్యం, ఈ రెండు బిల్లులను కూడా ఉపసంహరించుకుంటున్నామాని, మరి కొద్ది సేపట్లో ఈ విషయం పై ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేస్తారని, త్వరలోనే దీనికి సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు మేరకు, శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేయాలని, తదుపరి విచారణ సోమవారం ఉంటుందని హైకోర్టు పేర్కొంది. అయితే ఈ నేపధ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం తరుపున, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి దీనికి సంబంధించి మెమో ఫైల్ చేసారు. ఈ రెండు చట్టాలను కూడా ఉపసంహరించుకుంటు, రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసామని చెప్పారు. బిల్లు రూపంలో ఈ నెల 22 తేదీన చర్చ తరువాత అసెంబ్లీలో అమోదించామని తెలిపారు. తరువాత 23వ తేదీన శాసనమండలిలో కూడా చర్చించి ఆమోదించారని, ఈ రెండు కూడా బిల్లు రూపంలో తీసుకొచ్చారని కూడా, ఆమె మెమోలో తెలిపారు.

hc 26112021 2

శాసనసభ కార్యదర్శి తమకు ఇచ్చిన సమాచారం మేరకు, ఈ రెండిటిని కూడా రాష్ట్ర హైకోర్టులో ఫైల్ చేస్తున్నామని వివరించారు. ఈ అఫిడవిట్ తో పాటుగా, ఆ రెండు చట్టాలు రద్దు చేస్తున్నట్టు ఆమోదించిన బిల్లులను కూడా ఈ అఫిడవిట్ తో జత పరిచారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు మేరకే, వీటికి కోర్టులో దాఖలు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం హైకోర్టులో ఈ మెమోతో పాటుగా, బిల్లులు వీటి అన్నిటిని కూడా పిటీషనర్ లు కూడా, ప్రభుత్వం ఇచ్చింది. ఎవరు అయితే సీఆర్డీఏ చట్టం, వికేంద్రీకరణ చట్టానికి వ్యతిరేకంగా హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారో, రైతులు తరుపున, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు తరుపున న్యాయవాదులకు కూడా ఇవన్నీ అంద చేసారు. దీని పైన సోమవారం విచారణ జరగనుంది. అయితే ఇందులో కీలక అంశం ఉంది. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మూడు రాజధానులు ఉండేది ఉండేదే అని, బిల్లులో కొన్ని అంశాలు మార్చి, మెరుగైన బిల్లుతో వస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ఈ అంశం పై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read