బీజేపీ పార్టీకి దేశ వ్యాప్తంగా ఉన్న ముసుగు పార్టీలు ఒకటి జగన్, రెండు కేసీఆర్, మూడు అన్నాడీఎంకే... అన్నాడీఎంకేని అడ్డు పెట్టుకుని, పార్లమెంట్ లో ఎన్ని నాటకాలు ఆడారో, తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో చూసాం. అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో బీజేపీ సౌత్ లో బలపడాలి అంటే, ఇక్కడ ఈ ముసుగు వీరులతో డైరెక్ట్ పొత్తుకు రెడీ అవుతుంది. ఈ బలహీనలు ముగ్గురినీ కేసులతో భయపెట్టి, వారిని కంట్రోల్ లో పెట్టుకుని, ఇప్పుడు వారితో పొత్తు పెట్టుకుని, ఇక్కడ కొన్ని సీట్లు సొంతగా గెలిచే ఎత్తులు వేసింది. ఇందులో భ్గంగానే, అన్నాడీఎంకేతో నిన్న బీజేపీ పొత్తుల పై చర్చించింది. ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, అమిత్ షా, ఇటు జగన్ మోహన్ రెడ్డితో కూడా, ఎన్నికల ముందే పొత్తుకు రెడీ అవుతునట్టు సమాచారం. కేసుల భయంతో, జగన్ కూడా అమిత్ షా షరతులకు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.

bjp jagan 16022019 2

నిన్న తమిళ నాడు వెళ్లి మరీ బీజేపీ నేతలు అన్నాడీఎంకేతో చర్చలు జరిపారు. రాష్ట్రమంత్రులు తంగమణి, వేలుమణిలతో భాజపా రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి, కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ మేరకు చర్చించారు. చెన్నైలోని ఓ పారిశ్రామికవేత్త నివాసంలో ఈ సమావేశం ఏర్పాటైంది. ఇంకా సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భాజపా ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చి వెళ్లగా... గురువారం భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈరోడులో పర్యటించారు. దీంతో పొత్తుల గురించి ప్రకటన వెలువడే అవకాశముందని అంతా ఆసక్తిగా భావిస్తున్న నేపథ్యంలో భాజపా తమిళనాడు ఎన్నికల ఇన్‌ఛార్జి, కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ రంగప్రవేశం చేశారు.

bjp jagan 16022019 3

గురువారం సాయంత్రం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... పార్టీల పొత్తుల గురించి చర్చలు జరిపేందుకే రాష్ట్రానికి వచ్చినట్టు స్పష్టం చేశారు. రాష్ట్రంలో భాజపా కూటమి బలంగా ఉందని, అన్నాడీఎంకేతో కూటమి ఏర్పాటుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. పీయూష్‌ గోయల్‌ పాల్గొననున్న కార్యక్రమాల గురించి పలు వార్తలు వినిపించినా వాటికి భిన్నంగా చెన్నై ఆళ్వార్‌పేటలోని పారిశ్రామికవేత్త పొళ్లాచ్చి మహాలింగం నివాసానికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి తంగమణి, స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి ఎస్పీ వేలుమణితో సమావేశమయ్యారు. భాజపాకు కేటాయించే నియోజకవర్గాల గురించి చర్చించినట్టు సమాచారం. ఇక్కడ తమిళనాడులో ఈ పొత్తులు చర్చలు అయిపోగానే, నెక్స్ట్ జగన్ దగ్గరకే అంటూ బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read