అమరావతి ఉద్యమం 312వ రోజుకి చేరుకుంది. అమరావతి ఉద్యమం రోజు రోజుకీ ఎక్కువ అవుతుంది. ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమంతో ఉద్యమ వేడి, ప్రభుత్వానికి తాకుతుంది. ఈ నేపధ్యంలోనే, రాజధాని రైతులకు వ్యతిరేకంగా మరో శిబిరం నడపాలని, కొంత మంది అమరావతి వ్యతిరేకులు నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రాజధాని గ్రామాలు కాకుండా, ప్రతి రోజు ఉద్యమం బయట నుంచి ఆటల్లో అమరావతికి వస్తున్నారు. ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు. అదేమీ అంటే, ప్రభుత్వం మాకు అమరావతిలో ఇళ్ళ పట్టాలు ఇచ్చింది అంటున్నారు. అసలు అమరావతిలో రైతుల భూములు ఇచ్చింది, రాజధాని నిర్మాణం కోసం, ఇందులో పేదల కోసం భారీగా ఇళ్ళ నిర్మాణం చేపట్టి, ఇప్పటికే 5 వేల ఇళ్ళ నిర్మాణం కూడా పూర్తి చేసి రెడీ గా ఉన్న ఇళ్ళు, పేదలకు ఇవ్వకుండా, ఇప్పుడు ఇళ్ళ పట్టాలు అంటూ, రైతుల భూములు ఇస్తున్నాం అంటూ, ఇద్దరి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసారు. ఈ విషయం కోర్టులో కూడా ఉంది. అయితే, ముందు రాజధాని నిర్మాణం చేపట్టాలని, తరువాత ప్రభుత్వ భూమి ఎవరికి ఇచ్చుకుంటే ఏమిటి అని రైతులు అంటుంటే, ఈ వర్గం మాత్రం, ప్రతి రోజు బయట ఆటోల్లో వస్తూ, పోటీ దీక్షలు చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ, వీరు ప్రతి రోజు ఎక్కడ నుంచో రావటం, ఆటోలు వేసుకుని రావటం, ఒకసారి వచ్చిన వాళ్ళు కాకుండా, వేరే వాళ్ళు రావటం, ఇలా గమనిస్తున్న అమరావతి రైతులు, సరైన ఆధారాలు లేక, ఇన్నాళ్ళు వదిలేసారు. అయితే నిన్న అనూహ్యంగా, వీడియోలో వెళ్ళు అడ్డంగా దొరికిపోయారు.

అమరావతి రాజధాని రైతులకు వ్యతిరేకంగా మందడం సీడ్ ఆక్సెస్ రోడ్డు వద్ద పోటీ శిబిరం వెలిసింది. ఇక్కడే గత కొన్ని రోజులుగా అమరావతి వ్యతిరేకంగా అంటూ శిబిరం నడుపుతున్నారు. ఒక వైపు పోలీసులు రాజధాని గ్రామాల్లో కొత్త వారు రాకూడదని, ఆధార్ కార్డులు చూపించాలని పోలీసులు చెప్తుంటే, వీరికి ఎలా పర్మిషన్ ఇచ్చారని రాజధాని రైతులు అడుగుతున్నారు. అయితే ఇదే సమయంలో ఆ శిబిరంలో జరిగిన ఒక సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. అక్కడ వారికి, కొందరు ట్రైనింగ్ ఇస్తున్న వీడియో బయట పడింది. మీరు ఎక్కడ నుంచి వచ్చారు అంటే, రాజధాని గ్రామాలు అని చెప్పండి, ఏమి కావాలి అంటే, ఇళ్ళ స్థలాలు కావలి అని చెప్పండి, మేము డబ్బులు కోసం ఇక్కడకు రాలేదని చెప్పండి, గట్టిగా మాట్లాడండి అంటూ, వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ విషయం ప్రముఖంగా చూపిస్తున్నారు. మొన్నటి దాకా, ఇప్పటికీ, అమరావతి రైతులు పైడ్ ఆర్టిస్ట్ లు అంటూ హేళన చేస్తున్న వారు, నేడు ఈ ఉదంతం పై ఏమంటారో మరి. వీళ్ళను ఏ ఆర్టిస్ట్ అని పిలుస్తారు ? ఇది చూస్తుంటే, అమరావతి రైతుల పై ఏదో కుట్ర జరుగుతుందని అర్ధం అవుతుంది. మరి ప్రభుత్వం, ఈ విషయం పై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read