అమరావతి.. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన వేళ, రాష్ట్రమే కాదు, దేశం కూడా పులకించింది. రాష్ట్రం నలు మూలాల నుంచి, ఇది మన రాజధాని అంటూ, ప్రతి ఊరి నుంచి మట్టి, నీరు తెచ్చి, అమరావతికి మద్దతు తెలిపారు 13 జిల్లాల ప్రజలు. కానీ రాను రాను, వారిలో విష భీజాలు నాటారు కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు. ఇది చివరకు అమరావతి అంటే ద్వేషంగా, అమరావతి ప్రజలని, మహిళలను, రైతులను అవమాన పరిచే స్థాయి వరకు వెళ్ళిపోయింది. ముందుగా ఈ ప్రభుత్వం అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసే పనిలో పడింది. అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేసింది. తరువాత శాసన రాజధాని అని చెప్పింది. కొంత మంది మంత్రులు, అసలు అది శాసన రాజధానిగా కూడా ఉండటానికి వీలు లేదని తేల్చి చెప్పారు. ఇలా అమరావతి పై కక్ష కొనసాగుతున్న వేళ, ఈ రోజు అమరావతి ప్రజలకు మరో షాకింగ్ వార్త వినాల్సి వచ్చింది. ఇది నిజానికి అమరావతి వాసులకే కాదు, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల ప్రజలకు కూడా షాకింగ్ వార్తే. రాజధాని అమరావతిలో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ అనంతపురం-అమరావతి ఎక్ష్ప్రెస్ వే. రాజధానిగా అమరావతిని ప్రకటించిన తరువాత, రాయాలసీమ జిల్లాలకు దగ్గరగా, వేగంగా కనెక్టివిటీ ఉండాలనే లక్ష్యంతో, అప్పట్లో చంద్రబాబు ఈ ప్రతిపాదనను కేంద్రం ముందు పెట్టారు. అయితే కేంద్రం 22 వేల కోట్ల ఖర్చులో, రాష్ట్రం సగం పెట్టుకోవాలని ప్రతిపాదన చేయటంతో, అప్పట్లో ప్రభుత్వం ఒప్పుకుంది. మొత్తంగా 394 కిమీ కొత్త రహదారి నిర్మించాలని అనుకున్నారు. మొత్తం డీపీఆర్ కూడా రెడీ అయ్యింది. కేంద్రం నిర్వహించే భారతమాల ప్రాజెక్ట్ లో దీన్ని చేర్చారు.

అయితే జగన్ మోహన్ రెడ్డి అమరావతిని మూడు ముక్కలు చేయటంతో, ఈ ప్రాజెక్ట్ పై కూడా ఆ ప్రభావం పడింది. ఎలాగు అమరావతి రాజధానిగా ఉండదు కాబట్టి, ఈ ప్రాజెక్ట్ లో ఖర్చు తగ్గించుకుంటే రాష్ట్ర వాటా కూడా తగ్గుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారిని కేవలం చిలకలూరిపేట వరుకే కుదించాలని, ఇలా చేస్తే 59 కిమీ రహదారి తగ్గి, 3,700 కోట్లు ఆడా అవుతాయని నిర్ణయం తీసుకుని, కేంద్రానికి చెప్పటంతో, కేంద్రం దీని ప్రకారమే తాజగా బులిటెన్ విడుదల చేసింది. దీంతో అందరూ షాక్ తిన్నారు. ముఖ్యంగా ఈ పరిణామంతో ఆటు రాయలసీమ ప్రజలకు, ఇటు గుంటూరు, కృష్ణా ప్రజలకు కూడా ఇబ్బంది అనే చెప్పాలి. రాయలసీమ ప్రజలు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువ పని ఉంటుంది. ఇక్కడే రైల్, ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉంది. ఇక్కడకు అనుసాధనం చేయకుండా, కేవలం పేట దగ్గరే ఆపేస్తే, ఏమి ఉపయోగం ఉంటుందో మరి. ఇక పొతే ఇక్కడ తగ్గించిన ప్రభుత్వం, అనంతపురం నుంచి బెంగుళూరు కు ఈ రాజహదరి విస్తరణ చేయాలని కేంద్రాన్ని కోరింది. ఇక్కడ రాజధానికి అనుసంధానం ఉండదు కాని, పక్క రాష్ట్ర రాజధానికి మాత్రం అనుసంధానం కావాలని చెప్పటం ఏమిటో మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read