గత 280 రోజులుగా అమరావతి పరిరక్షణ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. అమరావతిలో ఈ 280 రోజులుగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారు. నిర్బంధాలు, లాఠీ ఛార్జ్ లు, వేధింపులు, కేసులు, ఇలా అనేక కష్టాలు ఎదుర్కున్నారు. ఇన్ని చేసినా, ప్రభుత్వం మాత్రం, వీరితో ఇప్పటి వరకు ఎలాంటి చర్చలకు రాలేదు. ఒక వైపు ఉద్యమం కొనసాగిస్తూ, ప్రజా ఉద్యమం చేస్తూ ఉండగానే, మరో పక్క న్యాయ పోరాటం కూడా రైతులు చేస్తున్నారు. ఇప్పటికే అమరావతి పై అనేక కేసులు కోర్టులో నమోదు అయ్యాయి. రైతుల తరుపున, అమరావతి పరిరక్షణ సమితి తరుపున, రాజకీయ పక్షాల తరుపున, ఇలా అనేక మంది తమ పిటీషన్లు హైకోర్టులో వేసారు. రైతులు అగ్రిమెంట్ ప్రకారం కోర్టుకు వెళ్తే, విభజన చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, అలాగే శాసనమండలిలో జరిగిన పరిణామాలు ప్రకారం, ఇలా రకరకాలుగా కేసులు హైకోర్టులో పడ్డాయి. గత నెలలో అమరావతిని మూడు ముక్కలు చేస్తూ, బిల్ ని గవర్నర్ ఆమోదించటం పై, హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ సందర్భంగా హైకోర్టు స్టేటస్ కో ఇస్తూ, రెండు సార్లు వాయిదా వేసింది. రెండో సారి విచారణ వేసి, సెప్టెంబర్ 21కి వాయిదా వేసారు. అయితే ఈ రోజు నుంచి అమరావతి కేసులలో పురోగితి కనిపించే అవకాసం ఉంది. ఈ రోజు అమరావతి రైతులతో పాటుగా, వివిధ పక్షాలు వేసిన పిటీషన్ పై హైకోర్టులో రోజు వారీ విచారణ జరిగే అవకాసం ఉంది. ఈ రోజు హైకోర్టు ముందుకు 93 పిటీషన్లు విచారణకు రానున్నాయి. ఈ కేసులు అన్నీ వివిధ రకాల కేసులు, సిఆర్డీఏ అగ్రిమెంట్ ఉల్లంఘించటం పై, జీఎన్ రావు, బోస్టన్ కమిటీ చట్టబద్దత, మాస్టర్ ప్లాన్ ఉల్లంఘన, అమరావతిలో 144 పెట్టి నిర్బందించటం, ఇలా వివిధ రకాల కేసులు, ఈ రోజు హైకోర్టు ముందు విచారణకు రానున్నాయి. ఈ కేసులు అన్నీ, ఆన్లైన్ లోనే హైకోర్టు విచారణ చేయ్యనుంది. ఈ రోజు నుంచి రోజు వారీ విచారణ జరుగుతుందనే ఊహగానాల మధ్య, కోర్టు విచారణ పై ఆసక్తి నెలకొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read