అమరావతి రైతులకు సంకెళ్ళు వేసిన దానికి నిరసనగా, నిన్న అమరావతి జేఏసి, చలో గుంటూరు జైలుకు పిలుపు ఇచ్చింది. గత రెండు రోజులుగా ఈ విషయం పై వ్యక్తం అవుతున్న నిరసన చూసి, పోలీసులు ఈ చలో గుంటూరు జైలు కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. వస్తున్న స్పందన చూసి, రైతులు, మహిళలు ఎలాగైనా ఈ కార్యక్రమం చేసి తీరుతారని, ఇంటలిజెన్స్ రిపోర్టుల నేపధ్యంలో, ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయటానికి, పోలీసులు తమ వ్యూహానికి పదును పెట్టారు. శుక్రవారం అర్ధరాతి నుంచే అమరావతి జేఏసి నాయకులు, అలాగే విపక్ష నేతల ఇళ్ళ వద్దకు చేరుకున్నారు. ఉదయానికి మొత్తం, అందరినీ హౌస్ అరెస్ట్ చేసారు. అలాగే రాజధాని గ్రామాల్లో కూడా ముఖ్యమైన వ్యక్తులకు నోటీసులు ఇచ్చి, హౌస్ అరెస్ట్ చేసారు. ఉదయం 9 గంటల వరకు మొత్తం కంట్రోల్ లో లోని ఉందని పోలీసులు భావించారు. అప్పటికి వార్తలు కూడా, అందరినీ నిర్భందిస్తున్నారు అనే వార్తలే వచ్చాయి. ఎక్కడా చడీ చప్పుడు లేదు. దీంతో పోలీసులు, ప్రభుత్వం, అమరావతి ఉద్యమకారులు ఇచ్చిన పిలుపు భగ్నం చేశామనే ఆలోచనలో, మరొక్క రెండు మూడు గంటలు ఇలాగే ఉంటే చాలని అనుకున్నారు. పోలీసులు వ్యూహం ఫలించిందని అందరూ భావించారు. అయితే 10 గంటలు దాటగానే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. నెమ్మదిగా అక్కడక్కడ ఆక్టివిటీ జరుగుతూ వచ్చింది. వచ్చిన వాళ్ళను వచ్చినట్టు పోలీసులు అరెస్ట్ చేస్తూ వచ్చారు. అయితే 11.30 గంటల సమయంలో మెరుపు దా-డిలాగా అమరావతి ఉద్యమకారులు గుంటూరు దూసుకుని వచ్చారు. అంతే పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటిపోయింది. పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. అదనపు బలగాలు రప్పించారు.

మొత్తం పరిస్థితి మళ్ళీ చేతిలోకి రావటానికి, మధ్యానం రెండు గంటలు అయ్యింది. ఈ మధ్యలో అరగంట సేపు రహదారి దిగ్బంధించారు. అలాగే కొంత మంది, జైలు గోడలు దూకి లోపలకు వెళ్లి, రైతులకు సంఘీభావం తెలిపారు. ఇలా పోలీసులు పన్నిన వ్యూహాన్ని చేధించుకుని, అమరావతి ఉద్యమకారులు, తాము ఇచ్చిన కార్యక్రమ పిలుపుని, సక్సెస్ చేసారు. అయితే ఇందు కోసం అమరావతి రైతులు ఒక వ్యూహాన్ని అమలు చేసారు. పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేస్తారని తెలుసుకున్న నేతలు, శుక్రవారం సాయంత్రమే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. నేతలను పక్కన పెడితే సామాన్య రైతులు, మహిళలు, గుంటూరు చేరుకొని, రోడ్డు మీద అటు ఇటూ తిరుగుతూ, సమయం కోసం వేచి చూసారు. అనుమానం వచ్చి కొంత మందిని పోలీసులు అడిగితే, షాపింగ్ కోసం అని, మా వాళ్ళు వస్తారని, ఇలా రకరాల సమాధానాలు చెప్పారు. 11.20 సమయంలో ఒకేసారు అరండల్‌పేట, బ్రాడీపేట వీధుల నుంచి అందరూ జైలు వైపు పరుగులు తీసారు. అప్రమత్తం అయిన పోలీసులు, బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో రహదారిపై బైఠాయించటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతు జేఏసి కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌, దళిత రైతు జేఏసీ కన్వీనర్‌ మార్టిన్‌ లూథర్‌, ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌, వివిధ పార్టీల నేతలు సుంకర పద్మశ్రీ, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు సైతం ఇక్కడకు రావటంతో, పోలీసుల వ్యూహం కంటే, రైతుల వ్యూహమే ఫలించినట్టు అయ్యింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read