వినే జ‌నాలు ఉండాలి కానీ, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాను స‌త్య‌హ‌రిశ్చంద్రుడిన‌ని..తాను నీతిలో ధ‌ర్మ‌రాజు వార‌సుడిన‌ని కూడా చెప్పుకోగ‌ల స‌మర్థుడు. కొత్త ఏర్ప‌డిన ఏపీకి రాజ‌ధానిగా అమ‌రావ‌తి శంకుస్థాప‌నకి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వ‌చ్చాడు. ఏపీపై విషం చిమ్మే కేసీఆర్ వ‌చ్చాడు. అప్ప‌టి ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ మాత్రం అమ‌రావ‌తి ప్ర‌జారాజ‌ధాని శంకుస్థాప‌న‌కి డుమ్మా కొట్టేశాడు. తాను ఏం చేశానో మ‌రిచిపోయి, ఏపీలోనే దేశంలోని రాజ‌కీయ పార్టీల‌కి సుద్దులు చెబుతాడు జ‌గ‌న్ రెడ్డి. తాను త‌న సొంత రాష్ట్రంలో రాజ‌ధాని శంకుస్థాప‌న‌కి డుమ్మాకొట్టొచ్చు. పార్ల‌మెంటు భ‌వ‌నం ప్రారంభోత్స‌వానికి కేంద్రంలోని ప్ర‌తిప‌క్షాలు డుమ్మా కొడితే మాత్రం వారికి నీతులు చెబుతూ ట్వీట్లు వేశాడు జ‌గ‌న్. 'గొప్ప, విశాలమైన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేస్తున్నందుకు ప్రధాని మోదీకి నా అభినందనలు. పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం. మన దేశం ఆత్మను ప్రతిబింబిస్తుంది. ఇది మన దేశ ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీలకు చెందింది. ఇలాంటి శుభకార్యక్రమాన్ని బహిష్కరించడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి.. ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావాలని కోరుతున్నాను. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి నా పార్టీ హాజరవుతుంది' అని జగన్ ట్వీట్ చేశారు.ప్ర‌థ‌మ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా జరగాల్సిన కార్యక్రమాన్ని.. ప్రధాని మోదీ చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తూ పార్ల‌మెంటు భ‌వ‌నం సెంట్ర‌ల్ విస్టా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజ‌రు కాలేం అంటూ 19 ప్రతిపక్ష పార్టీలు ప్ర‌క‌టించాయి. కాంగ్రెస్, ఆప్, వామ‌ప‌క్షాలు ఇందులో ఉన్నాయి. అమ‌రావ‌తి రాజ‌ధానికి అసెంబ్లీలో ఒప్పుకున్న ప్ర‌తిప‌క్ష‌నేత‌గా, ఆహ్వానం అందినా హాజ‌రు కాలేని సంకుచిత స్వభావం గ‌ల జ‌గ‌న్, ఒక కాజ్ కోసం నూత‌న పార్ల‌మెంటు భ‌వ‌నం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి గైర్హాజ‌రు అవుతున్న విప‌క్షాల‌కి నీతులు చెప్ప‌డంపై అంద‌రూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read