సోషల్ మీడియాలో వైసీపీ నడుపుతున్న సోషల్ మీడియా వింగ్ చేస్తున్న పనులకు ఎంతో మంది బాధితులు ఉన్నారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి, సామాన్య మహిళలు దాకా అందరూ బాధితులే. ఇంకా చెప్పాలి అంటే, ఈ దేశ న్యాయ వ్యవస్థ, అత్యున్నత స్థాయిలో ఉన్న న్యాయమూర్తులు కూడా బాధితులే. అంతలా విషం చిమ్ముతూ ఉంటుంది వైసీపీ సోషల్ మీడియా. అయితే ఇందులో వింత ఏమిటి అంటే, ఇలాంటి బురదగుంటను, సమర్ధిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు చేసే వ్యాఖ్యలు. ఇలా చేస్తుంటే వారిని దండించి, ఇది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పాలి కానీ, ఏకంగా మీడియాకు ఎక్కి, వాళ్ళను సమర్ధిస్తూ మాట్లాడటంతో, వాళ్ళు మరింత రెచ్చిపోతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో న్యాయస్థానాలు, న్యాయ మూర్తుల పై ఇష్టం వచ్చినట్టు, ఈ బ్యాచ్ రేచ్చిపోతూ, సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టిన విషయం తెలిసిందే. దీనికి విసుగు చెందిన హైకోర్టు రిజిస్టార్, ఏకంగా తానె హైకోర్టు తరుపున పిటీషన్ వేయాల్సిన పరిస్థితి. దీంతో ఈ విషయం పై స్పందించిన న్యాయస్థానం వంద మంది వరకు నోటీసులు ఇచ్చి, సిఐడి విచారణకు ఆదేశించింది. అయితే సిఐడి సరిగ్గా పని చేయకపోవటంతో, ఏకంగా సిబిఐ విచారణకు ఆదేశించింది. సిబిఐ విచారణకు ఆదేశించినా, హైకోర్టులో ఈ కేసు ఉన్నా, ఈ బ్యాచ్ మాత్రం ఏ మాత్రం భయ పడటం లేదు. ఈ నేపధంలోనే, ఈ మధ్య అమరావతి పై ఎలాంటి ఫేక్ చేస్తున్నారో చూస్తున్నాం. నిన్నటికి నిన్న హైకోర్టు మునిగిపోయింది అంటూ కట్టు కధలు అల్లారు.

అలాగే అమరావతి పోరాటం చేస్తున్న మహిళల పై అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. అలాగే మరోసారి సోషల్ మీడియాలో అమరావతిలో ఉద్యమం చేస్తున్న ఒక మహిళ పై, తుళ్ళూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త గద్దె రాకేష్ అసభ్య పదజాలంతో పోస్టింగ్ పెట్టాడు. మూడు వందల రోజుల ఉద్యమం సందర్భంగా, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తుళ్ళూరు దీక్షా శిబిరాన్ని సందర్శించిన సమయంలో, ఒక మహిళా రైతు లోకేష్ తో తన బాధలు చెప్పుకున్నారు. తన భర్త చనిపోయి, మూడేళ్ళు అయ్యిందని, పగలు దీక్షా శిబిరంలో ఉద్యమం చేస్తూ, రాత్రి పూట మిషన్ కుట్టుకుని జీవనం సాగిస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నానని, ఆమె లోకేష్ ముందు గోడు చెప్పుకున్నారు. అయితే కొన్ని పత్రికల్లో వచ్చిన ఆ వార్త తీసుకుని, తుళ్ళూరు కు చెందిన వైసీపీ కార్యకర్త గద్దె రాకేష్ ఆ మహిళా రైతు పై అసభ్యకరంగా పోస్టింగ్ పెట్టారు. దీంతో విషయం తెలుసుకున్న అమరావతి మహిళలు, రైతులు రాకేష్ వద్దకు వెళ్లి దేహశుద్ధి చేసారు. అమరావతి మహిళల జోలికి వస్తే ఇక నుంచి చూస్తూ ఊరుకోం అని, ఎవరికైనా ఇలాగే బుద్ధి చెప్తాం అంటున్నారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు, జరిగిన సంఘటన పై ఆరా తీస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read