అమరావతి రైతులకు సంకెళ్ళు వేయటం పై, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతుంది. అన్నం పెట్టే రైతులకు బేడీలు ఏమిటి అంటూ, అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు ఆందోళన ఒక వైపు, అలాగే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మరొక వైపు, మీడియా మరొక వైపు , పోలీసుల వైఖరి పై అభ్యంతరం తెలిపాయి. అన్ని వైపుల నుంచి వ్యతిరేకత రావటంతో, గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఈ అంశం పై స్పందించి చర్యలు తీసుకున్నారు అంటూ, పోలీస్ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. వివిధ కేసుల్లో రిమాండ్ లో ఉన్న 43 మందిని ఒకే బస్సులో నరసరావుపేట సబ్ జైల్, గుంటూరు జైలుకు తేసుకువచ్చె క్రమంలో ప్రిజనర్స్ ఎస్కార్ట్ ఏర్పాటు చేసి, వారిని తరలించే క్రమంలో, మిగతా వారితో కలిపి 7 గురు రైతులకు బేడీలు వేశామని తెలిపారు. అయితే సంకెళ్ళు వేసిన విషయం తెలిసిన వెంటనే, ఈ ఘటనకు బాధ్యులుగా 6 మంది హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి, కొంత మందికి మేమోలు ఇచినట్టు ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే ఈ ఘటన పై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. అయితే పోలీసులు ప్రకటన పై విమర్శలు వస్తున్నాయి. కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయటం కాదని, కానిస్టేబుళ్ళు చెప్తే సంకెళ్ళు వేయరు కదా, దీని వెనుక ఉన్న పై స్థాయి అధికారులు ఎవరు, వారికి చెప్పిన నేతలు ఎవరు, వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే డీఎస్పీ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం ఘటనకు డీఎస్పీదే బాధ్యత అని తెలిపారు.

రాజధానికోసం రైతులు చేసిన త్యాగాలను రోడ్డెక్కించేలా మూడురాజధానులనే మూర్ఖపు నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి భావితరాల భవిష్యత్ ను అంధకారం చేశాడని, ఆయన అరాచకపు పాలనకు నిదర్శనంగా అమరావతి మౌనంగా నిలిచి రోదిస్తోందని, టీడీపీ అధికారప్రతినిధి దివ్యవాణి స్పష్టంచేశారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! రాష్ట్రంకోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను రోడ్లెక్కించి, వారికి బేడీలు వేసిన పాలనను ఈ రాష్ట్రంలోనే చూస్తున్నాం. ప్రపంచంలోని అనేక గొప్పనగరాలకు ధీటుగా గత ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని తలపెట్టింది. చంద్రన్న పాలనలో ఆకాశాన్నంటే భవనాలు అక్కడ భూమిని చీల్చుకొని మొలిచాయి. సీడ్ యాక్సెస్ రోడ్లు రాజధానికి మణిహారాల్లా నిలిచాయి. అటువంటి నగరం ప్రభుత్వం మారగానే మౌనంగా రోదిస్తోంది. మూర్ఖపు పాలనలో మూడు రాజధానుల నిర్ణయంతో భావితరాల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. పాలకుల తెలివితక్కువ నిర్ణయానికి వ్యతిరేకంగా, రాయపూడి రోడ్డెక్కితే, తుళ్లూరు తుళ్లిపడింది. బోరుపాలెం బోరున విలపిస్తుంటే, అనంతవరం ఆగ్రహిస్తే, ఉద్ధండరాయుని పాలెం ఉడుకెత్తుతోంది. ఒక్క అవకాశమంటూ బతిమాలిన రాక్షసపాలనకు, రైతులకు మధ్య 315 రోజులుగా పోరాటం సాగుతోంది. దళితులు, బీసీలు, మైనారిటీలందరి కలల రూపంగా నిలిచిన బహుజనవర్గాల రాజధానికి కమ్మసామ్రాజ్యం అని పేరు పెట్టారు. శ్మశానమని, ఎడారని, ముంపుప్రాంతమని దుష్ప్రచారం చేశారు." అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read