ఒకరికి నష్టం వస్తే, మరొకరికి లాభం అంటే, ఇదేనేమో... గత 20 రోజులుగా అమరావతి పరిస్థితి పాతాళానికి పోతుంటే, హైదరాబాద్ లాభపడటం చూస్తున్నాం.. మొన్నటి దాక అమరావతి అంటే హాట్ కేక్.. కాని, ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం అమరావతి పై పంథా తెలియకపోవడంతో తీవ్ర సందిగ్ధం నెలకొంది. గతంలో ఇక్కడ అమరావతిలో గజం రూ.25 వేలు పై వరకు వరకు ధర పలికితే అదే స్థలం ధరలు, ఇప్పుడు రూ.15 వేల నుంచి రూ.20 వేలకు పడిపోయింది. ఇంత తగ్గినా, అమరావతి పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించక పోవటంతో, కొనేవారు కనిపించడం లేదు. మొన్నటి దాక ఎకరం రూ.కోటి నుంచి కోటిన్నర వరకు పలకగా, ప్రస్తుతం ఆ రేట్ తగ్గినప్పటికీ అక్కడ కూడా కొనేవారు లేరు. ఇక, రాజధాని పరిధిలోని తుళ్ళూరు, తాడికొండ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, గుంటూరు తదితర మండలాల పరిధిలోని గ్రామాల్లోని రైతుల్లో కూడా ఆందోళన నెలకుంది.

అమరావతిలో అనుకూల పరిస్థితులు ఏర్పడితే, ఇక్కడ పెట్టుబడులు పెట్టవచ్చనే భావనలో కొంత మంది ఉన్నారు. అయితే ప్రస్తుతానికి అమరావతి పై ఏ క్లారిటీ రాకపోవటంతో, ఇక్కడ పెట్టుబడి పెడదాం అనుకున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున హైదరాబాద్‌ వైపు దృష్టి సారించారు. హైదరబాద్ లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. అమరావతి ప్రాంత అభివృద్ధితో పాటు ప్రధాన కంపెనీలు, సంస్థలు పెట్టుబడులు పెట్టిన పక్షంలో రియల్‌ వ్యాపారుల్లో కొంత కదలిక వస్తుందని వారంటున్నారు. కాని ప్రభుత్వం ధోరణి చూస్తుంటే ఇప్పుడే ఏమి అమరావతి పై ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. చూద్దాం, ఈ ప్రభుత్వం ఈ విషయం పై, ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో...

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read