తమకు సంఖ్యా బలం లేదని, అక్కడ తమ మాట వినటం లేడని, ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ, జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించిన సంగతి తెలిసిందే. శాసనమండలి రద్దు చర్చ సందర్బంగా, మండలి దండగ అని, మండలి అంటే పెద్దల సభ అని, మన అసెంబ్లీ లోనే, అన్ని రకాల వారు ఉన్నారని, డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, మాజీ అధికారులు, జర్నలిస్టులు ఉన్నారని, శాసనమండలి పై ఒక్క పైసా ఖర్చు పెట్టినా వృధా అని, అందుకే శాసనమండలి రద్దు చేస్తున్నాం అంటూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం శాసనమండలి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ నిర్ణయం తీసుకోవటానికి, కారణాలు వేరే ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం విషయంలో, అది దేశ చట్టలకే వ్యతిరేకం అని, ఇంగ్లీష్ మీడియంతో పాటుగా, తెలుగు మీడియం ఆప్షన్ కూడా ఉంచాలని, శాసనమండలి, బిల్లుని తిప్పి పంపించింది. ఇక సీఆర్డీఏ రద్దు, మూడు ముక్కల రాజధాని పై బిల్లులు కూడా శాసనమండలి ఆపింది. ఈ రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపించాలని కోరింది. ఆ రోజే సెలెక్ట్ కమిటీకి పంపించి ఉండి ఉంటె, ఈ పాటికి ఆ గడువు అయిపోయేది, ప్రభుత్వానికి ఏది ఇష్టం వస్తే, అది చేసుకునే పని. కాని జగన్ మోహన్ రెడ్డి, నా మాటకే ఎదురు చెప్తారా అని, ఏకంగా మండలిని రద్దు చేసి, తీర్మానం కేంద్రానికి పంపించారు.

అయితే కేంద్రం ఇప్పటికే ఈ బిల్లుని పాస్ చేసే అవకాసం కనిపించటం లేదు. కరోనా వల్ల, ఎప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయో తెలియదు. జరిగినా, అవి ముఖ్యమైన బిల్లులు వరుకే పరిమితం అవుతాయి కాని, ఇలాంటి బిల్లులు పరి చర్చించే అవకాసం ఉండదు. దీంతో, అప్పటి వరకు ఆగకుండా, శాసనమండలిలోనే బలం పెంచుకోవాలని వైసీపీ తమ వ్యుహన్ని మార్చుకుంది. ప్రస్తుతం కొత్తగా వచ్చిన డొక్కాతో కలుపుకుని, వైసీపీకి 10 మంది ఉన్నారు. ఇక రెండు ఇప్పటికే ఖాళీగా ఉండగా, మరో రెండు మోపిదేవి, బోసు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నాలుగు కూడా వైసిపీ ఖాతాలో అతి త్వరలోనే వెళ్తాయి. ఇక వచ్చే జూన్ నాటికి ఈ నాలిగిటితో కలుపుకుని 25 స్థానాలు ఖాళీ కానున్నాయి. గవర్నర్ కోటా, ఎమ్మెల్యేల కోటాలో 12 స్థానాలు ఖాళీ అవ్వగా, అవీ వైసీపీ గెలుచుకుంటుంది. ఇక మిగతా 7 స్థానిక సంస్థల నుంచి ఎన్నిక అయ్యేవి. అందుకే వీలు అయినంత త్వరగా స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టి, అక్కడ కూడా బలం పెంచుకుంటే, ఈ 7టిలో కూడా మెజారిటీ తమకే వస్తాయని వైసిపీ అంచనా వేస్తుంది. ఇక మరో వ్యూహంగా, కొంత మంది టిడిపి నేతలను తమ వైపు తిప్పుకుని, రాజీనామా చేసి, మళ్ళీ వారికే ఆ స్థానం ఇచ్చి, తమ పార్టీ ఖాతాలో వేసుకోవాలనే వ్యూహం కూడా ఉంది. మొత్తానికి మండలి పై పైసా ఖర్చు కూడా దండగ అనే దగ్గర నుంచి, మండలిలో ఎలా బలం పెంచుకోవాలనే వ్యూహంలో వైసిపీ ముందుకు వెళ్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read