రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్ లు తిరోగమనం వైపు వెళ్తున్నాయి. అమరావతి, పోలవరం, బందర్ పోర్ట్, తిరుపతి గరుడ వారధి, ఇలా కీలక ప్రాజెక్ట్ లు అన్నీ ఆగిపోయాయి. దీనికి ప్రస్తుత ప్రభుత్వం చెప్తున్న మాట, చంద్రబాబు అవినీతి చేసారు, అందుకే పనులు ఆపెసాం, ఆ అవినీతి అంతా బయటకు తీసి, అప్పుడు కాని పనులు మొదలు పెట్టం అని. దీని వెనుక ఎవరి రాజకీయం వారికి ఉన్నా, నష్టపోతుంది మాత్ర, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అటు చంద్రబాబుకి ఏమి కాదు, ఇటు జగన్ కు ఏమి కాదు. ఎవరికి వారు బాగానే ఉంటారు. కాని ఆంధ్రులకు అద్భుతమైన రాజధాని ఉండాలి అనే కల, కలగానే ఉండి పోతుంది. మొన్నటి దాక పోలవరం పూర్తవుతుంది, 70 శాతం పనులు పూర్తి చేసారు, 70 ఏళ్ళ కల త్వరలోనే నిజం అవుతుంది అనే ఆలోచన ఉండేది, కాని ఇప్పుడు మళ్ళీ పోలవరం మొదటికి వచ్చింది. ఇలా అనేక ప్రాజెక్ట్ లు. చివరకు, గుళ్ళు, గోపురాల పై కూడా, ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది. చంద్రబాబు మొదలు పెడితే ఏంటి, జగన్ అది పూర్తి చేస్తే ఏంటి ? ప్రజలకు ఉపయోగ పడితే చాలు అని మాత్రం ప్రస్తుత పాలకులు అనుకోవటం లేదు.

తాజగా అమరావతి పరిధిలో నిర్మించ తలపెట్టిన, తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణ పనులు ఆపేయాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. దేవస్థానంకు సంబంధించి గర్భగుడి నిర్మాణం మినహా, మిగతా పనులు చేయొద్దని ఆదేశాలు వెళ్ళాయి. దీంతో కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం పనులు నిలిపేసి అక్కడ పని చేస్తున్న సిబ్బందిని వేరే ప్రాంతాలకు తరలించారు. ఇంజనీర్ స్థాయి సిబ్బంది కూడా వేరే చోటకు వెళ్లిపోయారు. అమరావతిలోని, వెంకటపాలెం సమీపంలో 25 ఎకరాల పరిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం గతంలో శంకుస్థాపన చేసింది. వాటి పనులు కూడా మొదలుపెట్టారు. ఈ లోపు ప్రభుత్వం మారింది. కొద్ది రోజుల క్రిందట, టిటిడి ఛైర్మన్‌గా నియమితులైన, జగన్ బాబాయ్ వై.వి.సుబ్బారెడ్డి నిర్మాణ పనులను పరిశీలించారు. వెంటనే ప్రభుత్వం పనులు నిలిపేయాలని, గర్బగుడి పనులు మినహా ఇతర పనులు ఏమీ చేయొద్దని కాంట్రాక్టర్ కు మౌఖికంగా ఆదేశించింది. దీంతో కాంట్రాక్టర్ అయిన నటరాజన్‌ కంపెనీ ఎక్కడ పనులు అక్కడ ఆపేసి, సిబ్బందిని అక్కడ నుంచి తరలించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read