రాష్ట్రంలో కరోనా మాటున, రాజకీయం చేస్తూ, మాకు ఓట్లు వెయ్యండి అని చేస్తూ, ప్రచారం చేసుకుంటున్న వైసీపీ తీరు, నిన్నటి నుంచి చూస్తున్నాం. కరోనా వల్ల పనుల లేక ఇంట్లో ఉంటున్న వారిని ఆదుకుంటానికి, తెల్ల కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి, వెయ్యి రూపాయలు ఇస్తాం అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 4న వెయ్యి రూపాయలు ఇస్తాం అని చెప్పినట్టే, నిన్న కొంత మందికి డబ్బులు ఇచ్చారు. అయితే ఇక్కడ అనూహ్యంగా, వాలంటీర్లు లేక రెవిన్యూ సిబ్బంది కాకుండా, వైసీపీ ఎమ్మల్యేలు, స్థానిక సంస్థల్లో పోటీకి నుంచున్న వాళ్ళు వెళ్లి ఆ వెయ్యి పంచి, వచ్చే స్థానిక సంస్థల్లో వోటు వెయ్యండి, ఇవి జగన్ పంపించాడు అని చెప్పటంతో అందరూ అవాక్కయ్యారు. కరోనాలో ఈ కక్కుర్తి బుద్ధి ఏమిటి అంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఇవన్నీ చూస్తున్న బీజేపీ, ఇక సహించం అంటూ, రియాక్ట్ అయ్యింది. మొన్న 5 కేజీల బియ్యం, ఒక కేజీ కందిపప్పు కూడా, కేంద్రం ఇస్తే, తాము ఇచ్చినట్టు డబ్బా కొట్టుకున్నారని, ఇప్పుడు వెయ్యి రూపాయలు కూడా అలాగే చేస్తున్నారని రియాక్ట్ అయ్యారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇవి కేంద్రం, రాష్ట్ర విపత్తుల సంస్థకు ఇచ్చిన నిధులు అంటూ, కొన్ని లెక్కలు చూపిస్తూ ట్వీట్ చేసారు. కరోనా వచ్చిన తరువాత, పంచాయతీలకు ఇచ్చే 14వ ఆర్ధిక సంఘం నిధులు : రూ.870 కోట్లు
, మునిసిపాలిటీలకు ఇచ్చే 14వ ఆర్ధిక సంఘం నిధులు : రూ.431 కోట్లు, రెవెన్యూ లోటు భర్తీ కింద, 15వ ఆర్ధిక సంఘం ఇచ్చే నిధులు రూ.491.41 కోట్లు, విపత్తుల సహాయ నిధి అడ్వాన్స్ కింద : రూ.559.50 కోట్లు, మొత్తంగా, 2,352 కోట్లు కేంద్రం ఇస్తే, అందులో నుంచి, 1300 కోట్లు , ఈ వెయ్యి రూపాయలు పంచి, డబ్బా కొడుతున్నారు అంటూ బీజేపీ ఆరోపించింది. మొత్తంగా, బియ్యం కేంద్రం, కందిపప్పు కేంద్రం, ప్రజలకు ఇచ్చే వెయ్యి రూపాయలు కేంద్రం, షెల్టర్లలో ఉండే వారికి అయ్యే ఖర్చు కేంద్రం, టెస్టింగ్ కిట్లు కేంద్రం, మందులు కేంద్రం, మెడికల్ కిట్లు కేంద్రం. మొత్తంగా, కరోనా పై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2,352 కోట్లు ఇచ్చింది కేంద్రం అంటూ బీజేపీ ఆరోపించింది.

బీజేపీ చేస్తున్న ఆరోపణల పై వైసీపీ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి, బీజేపీ నేతలను ఏకి పడేసారు. చంద్రబాబు, పవన్, కన్నా లక్ష్మీనారాయణ విధానాలు ఒకేలా ఉన్నాయి, బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ సొమ్మును పంచుతున్నామని అంటున్నారు, కాని, కోటి 33 లక్షల పేదలకు రాష్ట్ర ప్రభుత్వమే రూ.1000 వాలంటీర్ల ద్వారా అందజేసింది. రూ.1000 ఇచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నట్లుగా ఓ వీడియో పెట్టారు. కన్నా లక్ష్మీనారాయణకు చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఎక్కడిదో బయటపెట్టాలి, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రెవెన్యూ లోటు కింద కేంద్రం నిధులు విడుదల చేసింది, ఏపీతో పాటు 13 రాష్ట్రాలకు నిధులు విడుదలయ్యాయి, ఏపీకి ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించలేదు" అంటూ అంబటి బీజేపీ నేతల పై విరుచుకు పడ్డారు. మరి, ఇప్పుడు బీజేపీ ఏమి అంటుందో చూడాలి..

Advertisements

Advertisements

Latest Articles

Most Read