వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, అక్రమ మైనింగ్ చేస్తున్నారు అంటూ, వైసీపీకి చెందిన కార్యకర్తలే, హైకోర్టులో కేసు వెయ్యటం సంచలనం అయ్యింది. అయితే ఈ కేసు పై ఈ రోజు వాయిదా ఉండటంతో, విచారణ జరిగింది. అయితే ఈ రోజు కేసు పై ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు గతంలో, ఈ కేసు పై కౌంటర్ దాఖలు చెయ్యల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ రోజు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యలేదు. తగినంత సమయం ఇచ్చినా, ఎందుకో కానీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యలేదు. సరైన సమాచారం లేదా ? లేదా మరింత సమాచారం రావాల్సి ఉందా ? లేదా అక్కడ నిజంగానే ఏదైనా జరుగుతుందా, అది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందా ? అనే చర్చ జరుగుతుంది. అయితే ఈ రోజు విచారణలో, ప్రభుత్వ తరుపు లాయర్లు మాట్లడుతూ, కోర్టు దృష్టికి ఒక విషయం తీసుకుని వచ్చారు. ఈ పిటీషన్ వేసిన వారిలో, ఒక వ్యక్తి మైనింగ్ కేసులో ముద్దాయిగా ఉన్నారని కోర్టుకు తెలిపారు. అయితే దీని పై స్పందించిన హైకోర్టు, ఇప్పుడు ఆ అంశం పై ఇక్కడ విచారణ జరగటం లేదు కదా అని ప్రశ్నించింది.

దీంతో ప్రభుత్వ తరుపు లాయర్ కు ఏమి చెప్పాలో అర్ధం కాలేదు. అయితే హైకోర్టు కౌంటర్ ఎప్పుడు దాఖలు చేస్తారో చెప్పాలని, ప్రభుత్వాన్ని కోరింది. దీనికి స్పందించిన ప్రభుత్వ తరుపు న్యాయవాది, మరో వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని, హైకోర్టుకు తెలిపారు. దీంతో, హైకోర్టు, ఈ కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలోని, రాజుపాలెం అనే మండంలో ఉన్న కొండమోడు దగ్గర, అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారు అంటూ, వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పై గత నెల 26న విచారణ జరపగా, పూర్తి నివేదిక తమకు సమర్పించాలని, హైకోర్టు కేసుని ఈ రోజుకి వాయిదా వేసింది. అయితే దీని పై విచారణ జరిపినా, ప్రభుత్వం ఈ రోజు కౌంటర్ దాఖలు చేయలేదు. పూర్తి నివేదికతో, మరో వారం రోజుల్లో కౌంటర్ వేస్తామని కోర్టుకు చెప్పింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read