బీజేపీ, వైసీపీ మధ్య గ్యాప్ రోజు రోజుకీ పెరిగిపోతుంది. హలో విజయ్ గారు అని ప్రధాని మోడీ, విజయసాయి రెడ్డిని సంబోధించిన దగ్గర నుంచి, హలో రాజు గారు అంటూ, అదే ప్రధాని మోడీ, రఘురామకృష్ణంరాజుని సంబోధించే దాకా వ్యవహారం వచ్చింది. మేము ఏమి పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, దాని వెనుక ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయి అంటూ, గతంలో పీపీఏల విషయంలో, పోలవరం విషయంలో, విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల నుంచి, రెండు పార్టీలకు గ్యాప్ వచ్చింది. మీ ప్రభుత్వం చేసే నిర్ణయాలకు, మేము ఎలా బాధ్యులం అంటూ, బీజేపీ అధిష్టానం, ఆగ్రహించినట్టు, అప్పటి నుంచి, విజయసాయి రెడ్డిని దూరం పెట్టినట్టు ప్రచారం జరిగింది. అదీ కాక, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న వివిధ పనులు, దేశాన్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉండటంతో, కేంద్ర పెద్దలు, జగన్ మోహన్ రెడ్డి టీంను దూరం పెడుతూ వస్తున్నారు. అయితే ఎందుకో కాని, వైసీపీ ఎంపీ, రఘురామకృష్ణం రాజుకు మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్ లభిస్తుంది.

amit 06122019 2

పార్లమెంట్ సమావేశాలు మొదలైన దగ్గర నుంచి, రఘురామకృష్ణం రాజు, షాకులు మీద షాకులు ఇస్తున్నారు. తాజగా మరోసారి, రఘురామకృష్ణం రాజుకు, బీజేపీ అధిష్టానం దగ్గర, ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా దగ్గరే ప్రాధాన్యం లభించింది. అది కూడా, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, వైసీపీ లోక్‌సభలో నాయకుడు మిథున్‌ రెడ్డి సమక్షంలో. విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి ఒక పని మీద, రఘురామకృష్ణం రాజు ఒక పని మీద, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలవటానికి, ఆయన ఆఫీస్ కు వెళ్లారు. విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి ముందుగా వెళ్లి అక్కడ ఎదురు చూస్తూ ఉండగా, తరువాత వచ్చిన రఘురామ రాజుకు, అమిత్ షా నుంచి మొదట పిలుపు వచ్చింది.

amit 06122019 3

ఈ పరిణామంతో, విజయసాయి రెడ్డికి, షాక్ ఇచ్చారు, అమిత్ షా. ఢిల్లీ పర్యటన కోసం వస్తున్న, జగన్ మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించటం కోసం, విజయసాయి, మిథున్‌ హోంమంత్రి చాంబర్‌కు వచ్చారు. రాత్రి 10 గంటల తరువాత, తన నివాసానికి రావాలని అమిత్ షా వారికి చెప్పారు. అయితే, రాత్రి 10 గంటలు తరువాత కూడా, అమిత్ షా నుంచి, జగన్ మోహన్ రెడ్డికి పిలుపు రాలేదు. ఇది ఇలా ఉంటే, తాను ఈ నెల 11న, 300కు పైగా ఎంపీలకు విందు ఇస్తున్నానని, ఆ విందుకు హాజరుకావాలని, అమిత్ షా ను, రఘురాం కృష్ణ రాజు ఆహ్వానించారు. ఈ విందుని, తన వియ్యంకుడు, కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ నివాసంలో ఏర్పాటు చేసారు. మొత్తానికి, విజయసాయి రెడ్డిని వెయిట్ చేయించి, ముందుగా, రఘురామకృష్ణంరాజుని లోపలకి పిలిచి, ఎవరి ప్రాధాన్యత ఏమిటో అమిత్ షా, చెప్పకనే చెప్పారని ప్రచారం జరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read