కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్ది సేపటి క్రితం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసారు. చంద్రబాబు రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి, భారత రాష్ట్రపతిని కలుసుకున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలోని చంద్రబాబు బృందం రాష్ట్రపతిని కలిసిన తరువాత, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసారు. అయితే అమిత్ షా మూడు రోజుల పాటు జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్నారు. నిన్న సాయంత్రం అమిత్ షా ఢిల్లీకి రావటం, ఆ తరువాత కూడా ముందుగా నిర్ణయించిన కౌన్సిల్ అఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఉండటంతో, ఆయనకు కలవటం కుదరలేదు అని చెప్పి, అమిత్ షా పేషీ అధికారులు చంద్రబాబు బృందానికి సమాచారం అందించారు. దీంతో చంద్రబాబు బృందం నిన్న సాయంత్రం బయలుదేరి అమరావతి వచ్చేశారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు తన కోసం ఎదురు చూసారని తెలుసుకున్న అమిత్ షా, కలవటం కుదరక పోయి నందుకు చంద్రబాబుకు ఫోన్ చేసారు. ముందుగా నిర్ణయం తీసుకున్న కార్యక్రమాలు ఉండటంతో కలవలేక పోయానని, మరొకసారి మీరు ఢిల్లీ వచ్చినప్పుడు కలుద్దాం అని చెప్పారు. అయితే చంద్రబాబుని ఎందుకు కలవాలి అనుకుంటున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

phone 27102021 2

అయితే తాము ఏదైతే వినతి పత్రం తయారు చేసామో అది మీకు పంపుతున్నాం అని అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసం జరుగుతుందని, ఇటీవల టిడిపి కేంద్ర కార్యాలయం పై జరిగిన దా-డు-లు పరాకాష్ట అని, రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు, నేతల పై దా-డు-లు, వి-ధ్వం-సా-లు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని, చంద్రబాబు ఈ సందర్భంగా అమిత్ షా దృష్టికి తీసుకుని వెళ్లారు. అదే విధంగా గంజాయి, ఇతర డ్ర-గ్స్ విషయాల పై ఆంధ్రప్రదేశ్ లో మూలాలు ఉండటం, గంజాయి దేశంలో ఎక్కడ పట్టుబడినా కూడా, ఏపి నుంచి వెళ్తూ ఉండటం, వీటి అన్నీ కూడా యువత జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాల పై అసలు పట్టించుకోవటం లేదని అన్నారు. ఇప్పటికే రాష్ట్రపతికి ఫిర్యాదు చేసామని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు, వీడియోలతో సహా పంపుతాం అని అన్నారు. వీటి అన్నిటి పై తాను కూడా వివరాలు సేకరించి, అన్ని విషయాల పై సమీక్ష చేస్తానని అమిత్ షా హామీ ఇచ్చారు. తాను త్వరలోనే ఢిల్లీ వచ్చి కలుస్తానని చంద్రబాబు తెలిపారు. అయితే అనూహ్యంగా అమిత్ షా నుంచి చంద్రబాబుకు ఫోన్ రావటంతో, వైసీపీ ఫీజులు ఎగిరి పోయాయి. నిన్నటి నుంచి హేళన చేసిన వారికి, ఏమి చేయాలో అర్ధం కాని పరిస్థితి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read