జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు కూడా ముందుగా చెప్పిన సమయాని కంటే, నాలుగు గంటలు ముందుగానే ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్ళిన జగన్ మోహన్ రెడ్డిని, ఆ పార్టీ ఎంపీలు స్వాగతం పలికారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటల సమయంలో, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తో జగన్ భేటీ అయ్యారు. ఈ భేటీ దాదాపుగా 50 నిమిషాల పాటు కొనసాగింది. అయితే ఈ భేటీ అసంపూర్తిగా ముగిసిందని, రేపు మళ్ళీ జగన్ మోహన్ రెడ్డిని, అమిత్ షా రమ్మన్నారని, రేపు ఉదయం 10.30 గంటలకు మళ్ళీ అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఒక ప్రముఖ ఛానల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, ఈ భేటీలో అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి పై అసహనం వ్యక్తం చేసారని తెలుస్తుంది. ముఖ్యంగా న్యాయవ్యవస్థ పై అధికార పార్టీ జరుపుతున్న దాడి విషయంలో, లైన్ దాటుతున్నారని, ఇది మంచిది కాదని చెప్పినట్టు తెలిసింది.

ఇదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి కూడా, అమరావతి భూములు విషయం, ఫైబర్ గ్రిడ్ విషయం, అంతర్వేది రధం దగ్ధం విషయంలో సిబిఐ విచారణ కోసం అడిగారని తెలుస్తుంది. అయితే ఈ విషయం పై ప్రధాని కార్యాలయంతో మాట్లాడాలని, ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రాతో వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవటంతో, జగన్ ఈ విషయాల పై సిబిఐ వెయ్యమని కోరారని తెలుస్తుంది. అయితే ఈ భేటీ ముఖ్యంగా న్యాయ వ్యవస్థ పై జరుగుతున్న దాడి విషయం పైనే జరిగిందని, అందుకే జగన్ వెంట అడ్వకేట్ జెనెరల్ తో పాటుగా, సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుమారుడు, భూషణ్ కూడా ఉన్నారని తెలుస్తుంది. భూషణ్ కూడా లయార్ గా చేస్తున్నారు. వీళ్ళను కూడా తీసుకు వెళ్లారు అంటే, ఆలోచించాల్సిన విషయమే. అయితే వైసీపీ పార్టీ మాత్రం, పోలవరం, ప్రత్యెక హోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధుల పై, అమిత్ షా తో చర్చించినట్టు చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read