వర్షాకాలంలో చెరువులన్నీ నీటితో నిండినట్టు, వైసీపీ పాలనలో నామినేటేడ్ పోస్టులన్నీ జగన్ సొంత సామాజికవర్గంతో నిండిపోయాయని, టిడిపి నేతలు, అనగాని సత్య ప్రసాద్, డోలా బాల వీరాంజనేయస్వామి వ్యాఖ్యానించారు. నిన్న వారు మాట్లాడుతూ, "ఎన్నికలకు ముందు దళితులను ఉద్దరిస్తామని చెప్పి జగన్ అధికారంలో వచ్చాక దళితుల హక్కుల్ని, అవకాశాలను కాలరాస్తున్నారు. దళితులకు పెద్దపీట వేస్తామని ప్రగల్బాలు పలికి దళితులకు న్యాయంగా దక్కాల్సిన పదవులు సైతం దక్కకుండా దళితుల్ని దగా చేస్తున్నారు. దళితులు సలహాదారులుగా పనికిరారని అసెంబ్లీ సాక్షిగా అవమానించిన జగన్ తన సామాజికవర్గం వారికి మాత్రం ఏ అర్హత లేకున్నా దొడ్డిదారిన పదవులు కట్టబెడుతున్నారు.నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బిసిలను మోసం చేసి తన సొంత సామాజిక వర్గానికి 800 వందలకు పైగా పదవులు కట్టబెట్టిన జగన్ రెడ్డి ఇప్పుడు రెగ్యులర్ పదవుల్లో న్యాయంగా ఆ వర్గాలకు దక్కాల్సిన పదోన్నతుల్లో సైతం మోసానికి తెర లేపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, కులాలకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు ఏవి? వర్షాకాలంలో చెరువులన్నీ నీటితో నిండినట్టు, వైసీపీ పాలనలో నామినేటేడ్ పోస్టులన్నీ జగన్ సొంత సామాజికవర్గంతో నిండిపోయాయి..ఎంత సేపు కులాల రాజకీయమేనా? వైసిపి కి కులమే ఊపిరి గా మారింది. ఇలాంటి పెడదొరణి ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం .రాగద్వేషాలుపారదర్శకత అని ఊదరగొట్టే జగన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గం వారైతే అర్హతలు లేకున్న పదవులు ఉచితంగా ఇస్తాడనటానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. పంచాయతీ రాజ్ విభాగంలో ఇంజనీర్‌ ఇన్ చీప్ గా పనిచేస్తున్న సుబ్బా రెడ్డికి 2019 లో ఈఈ నుండి ఎస్‌.ఈ గా పదోన్నతి లభించింది. తరువాత పంచాయతీ రాజ్ శాఖలో చీఫ్ ఇంజనీర్ గా పూర్తి అదనపు బాధ్యతలు కూడా కట్టబెట్టారు. ఇది చాలదన్నట్లు సీనియారిటీకి విరుద్ధంగా సుబ్బారెడ్డికి ఇంజనీర్-ఇన్-చీఫ్ పదవిని కూడ కట్టబెట్టి విజయవాడలోని పంచాయతీ రాజ్ విభాగంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో నియమించారు. ప్యానెల్ జాబితాలో సుబ్బారెడ్డి చాలా జూనియర్ అయినప్పటికీ సర్వీస్ కోడ్ నియమావళికి విరుద్ధంగా ఇంజనీర్ ఇన్ చీఫ్ గా జీతం డ్రా చేసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ 31-08-2019 న జి.ఓ. ఎంఎస్.నం 136 విడుదల చేసింది.

ఇంజనీర్ ఇన్ చీప్ గా సుబ్బారెడ్డి మే 31, 2021 న పదవి విరమణ చేసినప్పటికీ ప్రభుత్వం ఎస్సీ, స్ట్రీట్, బిసి వర్గాలకు చెందిన చీఫ్ ఇంజనీర్ల హక్కులను కాలరాస్తూ సుబ్బారెడ్డి పదవీ కాలాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగిస్తూ మే 28, 2021 న జి.ఓ. ఎం.ఎస్.నం 32 ను జారీ చేసింది. అంతేకాకుండా, పదవి విరమణ పొందిన సుబ్బారెడ్డి జీతభత్యాలకు సంబంధిన వ్యవహారాన్ని ఫైనాన్స్ డిపార్ట్ మెంటు కు తెలపాల్సి ఉంటుంది. కానీ పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ ఎటువంటి నిబంధనలు పాటించకుండా హై స్పీడ్ తో ఆయనకు ఒక సంవత్సరం పాటు పదవి పొడిగించింది. సీనియారిటీ కలిగిన ఎస్సీ, ఎస్టీ, బిసి ఇంజనీర్లను పక్కన్న పెట్టి రెడ్డి కులానికి ఎక్కడ లేని అధికారాలను కట్టబెడుతూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గం. చీఫ్ ఇంజనీర్ల ప్యానల్ లిస్ట్ సుబ్బారెడ్డికి అనుభవం కూడా లేదు. ఆయన సి.ఈ గా రెండేళ్లు, ఎస్.ఈ రెండేళ్లు మాత్రమే పనిచేసి అనుభవం ఉంది. ఇలాంటప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఆయన సేవలు అవసరమని ఎలా చెబుతుంది? రిటైర్డు అయిన వారికి అడ్డగోలుగా పదవి కట్టబెట్టాల్సిన అవసరం ఏంటి? జగన్ రెడ్డికి దళితులు, గిరిజనులు, బిసిలంటే ఎంత చిన్నచూపో పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ లో ఇచ్చిన ఈ అక్రమ పదోన్నతే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధుల వినియోగం లో ఇంజనీర్-ఇన్-చీప్ కీలక భాద్యతలు పోషిస్తారు. ఆ నిధులను అడ్డగోలుగా మళ్లించుకోవడానికి ఇలా అడ్డదారిన రెడ్డి సామాజిక వర్గానికి పదవులు కట్టబెడుతున్నారు. దళిత ఇంజనీర్లకు అన్యాయం చేయడంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక భూమిక పోషించారు. వైసీపీ పాలనలో దళితులు అడగడుగునా అన్యాయానికి గురవుతున్నారు, ఇకనైనా దళితులు జగన్ రెడ్డి మోసాన్ని గ్రహించాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read