ప్రపంచాన్ని క-రో-నా మహమ్మారి అతలాకుతలం చేస్తుంటే, వైద్యం చేయలేనన్ని కేసులు వస్తే, ఈ సమయంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఆ-నం-ద-య్య ఇచ్చిన భరోసా చాలా మందికి మేలు చేసింది. ముఖ్యంగా ఈ మందు తీసుకోవటంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవటంతో, అందరూ దీని పై ఆసలు పెట్టుకున్నారు. తీసుకున్న వారు కూడా కోలుకోవటం మొదలు పెట్టారు. ఇది ఇలా ఉంటే ఆనందయ్య మందుని తయారు చేయకుండా, ఆయన్ను 20 రోజులు పాటు నిర్బందించారు. చివరకు హైకోర్టు చొరవతో, ఆ-నం-ద-య్య మందుకి పర్మిషన్ వచ్చింది. అయితే పెద్ద ఎత్తున డిమాండ్ రావటం, రాష్ట్రం నలు మూలల నుంచి ప్రజలు ఎదురు చూస్తూ ఉండటంతో, ఆ-నం-ద-య్య కూడా ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. ఇందుకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డికి కూడా లేఖ రాసారు. అయితే ఈ లేఖ రాసి మూడు నాలుగు రోజులు అయినా, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం, స్పందన రాకపోవటంతో, ఆ-నం-ద-య్య ఈ రోజు స్పందించారు. తాను రాసిన లేఖకు ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. సాయంత్రం వరకు ఎదురు చూస్తామని, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోతే కనుక, తమ నిర్ణయం సాయంత్రం ప్రకటిస్తామని ఆ-నం-ద-య్య చెప్పారు.

anandaiah 10062021 2

ఈ మందు రాష్ట్రం అంతా ప్రజలకు చేరాలి అంటే, ప్రభుత్వ సహకారం అవసరం అని, అయితే ప్రభుత్వం వైపు నుంచి మాత్రం స్పందన రావటం లేదని అన్నారు. తాను సొంతంగా 50 వేల మందికి తయారు చేసానని అన్నారు. ఈ మం-దు పంపిణీ చేసే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని కోరారు. ఇక సాయంత్రం లోపు స్పందన రాకపోతే, తమ బృందంతో కలిసి సాయంత్రం చర్చిస్తామని అన్నారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకు కూడా ఈ మం-దు ని ఎలా పంపిణీ చేయాలి అనేది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తమ సొంత ట్రస్ట్ ద్వారా ఈ మం-దు తయారీ బాధ్యత తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రమంతా అంటే, 5 కోట్ల మందికి ఈ మం-దు తాయారు చేయాలి అంటే, కచ్చితంగా ప్రభుత్వం సహకారం లేకుండా చేయటం కుదరదు. ఇవన్నీ సహజ సిద్ధంగా దొరికేవే కాబట్టి, ఎక్కువ ఖర్చు కూడా ఉండదు. కేవలం యంత్రాంగం సహకరిస్తే సరిపోతుంది. మరి ప్రభుత్వం, ఎందుకు పట్టించుకోవటం లేదో తెలియటం లేదు. మరి ప్రభుత్వం భవిష్యత్తులో అయినా సహకారం అందిస్తుందో లేదో చూడాలి.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read