జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఫైర్ బ్రాండ్ మంత్రిగా, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వైసీపీ ఎమ్మెల్యే, ఇరిగేషన్ మంత్రి అయిన అనిల్ కుమార్ యాదవ్ కు ఈ రోజు చేదు అనుభవం ఎదురైంది. ఈ రోజు ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు, సొంత పార్టీ కార్యకర్తల నుంచే అనూహ్య పరిణామం ఎదురు అవ్వటంతో, ఆయన అవక్కయే పరిస్థితి వచ్చింది. దీంతో సభ జరుగుతున్నంత సేపు ఆయన దిగాలుగా కూర్చోవటం కనిపించింది. నెల్లూరు జిల్లాలోని చిట్టమూరు మండలం మల్లామ్‌లో, ఈ రోజు పర్యటించిన అనిల్ కు, అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ప్రజాభిప్రాయం తీసుకోకుండానే సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం కమిటీని నియమించారని, సొంత పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను అడ్డుకున్నారు.

anilyadav 12082019 2

ఆయన కాన్వాయ్ కు అడ్డు వెళ్ళే ప్రయత్నం చెయ్యటంతో, పోలీసులు రంగ ప్రవేశం చేసి, వారిని చెదరగొట్టారు. గూడూరు వైసిపీ ఎమ్మెల్యే వరప్రసాద్ మాకు నమ్మక ద్రోహం చేస్తే, అది ప్రశ్నించినందుకు, సమాధానం చెప్పకుండా మమ్మల్ని పోలీసులు చేత గెంటించి వెళ్లిపోయారని, వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరువాత వారు మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే, మంత్రి పై విరుచుకుపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎమ్మెల్యే వరప్రసాద్ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని ఆరోపించారు. మొన్న తోళ్ళ పరిశ్రమ విషయంలో కూడా ఇలాగే చేసారని, తోళ్ళ పరిశ్రమ యాజమాన్యం దగ్గర డబ్బులు తీసుకుని, మమ్మల్ని అన్యాయం చేసే ప్రయత్నం చేసారని వాపోయారు. ఆయన కుమారుడు కూడా ఇసుక రవాణాలో చేతివాటం ప్రదర్శిస్తున్నాడనీ స్థానికులు అన్నారు.

anilyadav 12082019 3

ఆ ఎమ్మెల్యే ఇన్ని అరాచకాలు చేస్తుంటే, ఇవన్నీ ప్రశ్నించినందుకు, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా సమాధానం చెప్పలేక వెళ్లిపోయారని ఆరోపిస్తున్నారు. చిట్టమూరు మండలం మల్లామ్‌లో వరప్రసాద్ సెగ మంత్రి అనిల్‌కు తగిలిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే సందర్భంలో, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు చిన్న ప్రమాదం కూడా తప్పింది. చిట్టమూరు మండలం మల్లామ్‌లో ప్రజాభిప్రాయ సేకరణలో, మంత్రి ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంలో, స్టేజ్‌ పైనుంచి అనిల్‌ కుర్చీ కిందకి ఒరిగింది. ఆ సమయంలో మంత్రి పక్కనే ఉన్న నేతలు అప్రమత్తమై అనిల్ కుమార్ కింద పడకుండా పట్టుకున్నారు. మంత్రికి ఎలాంటి హానీ జరుగకపోవడంతో వైసీపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read