ఆంధ్రప్రదేశ్ కి మరో అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ రాబోతోంది. ఇప్పటి వరకూ మన దేశంలో కేవలం ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీ కంపెనీలు మాత్రమే ఉన్నాయి. కానీ మొదటి సారి ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ రాబోతుంది. ఈ కంపెనీ మొబైల్ ఫోన్స్ తయారీ లో వినియోగించే కెమెరా మాడ్యూల్స్,టిఎఫ్టి స్క్రీన్స్ తయారు చెయ్యబోతుంది. తిరుపతిలో ఉన్న ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2 లో ఏర్పాటు కాబోతోంది. రెండు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కంపెనీ ఏర్పాటు అవుతుంది. 1400 కోట్ల పెట్టుబడి ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టనుంది. నేరుగా 6 వేల మందికి ఈ కంపెనీ ద్వారా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఈ కంపెనీ మొదటి సారి మన దేశంలో పెట్టుబడి పెట్టబోతుంది. అధునాతన సాంకేతికత,పరిశోధన మరియు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించేందుకు కంపెనీ అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ రీసెర్చ్ అండ్ డేవేలప్మెంట్ కూడా ఈ కంపెనీ ఏర్పాటు చెయ్యబోతుంది...

ఢిల్లీ లోని నోయిడా రీజియన్,మహారాష్ట్ర రాష్ట్రాల నుండి తీవ్రమైన పోటీ ఎదురైన కంపెనీ చివరికి ఆంధ్రప్రదేశ్ వైపే మొగ్గుచూపింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ బృందం ఈ కంపెనీని ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చేందుకు రెండుసార్లు చైనాకి పర్యటించింది. మరో సారి మంత్రి నారా లోకేష్ స్వయంగా కంపెనీ ప్రతినిధులని కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించి ఆంధ్రప్రదేశ్ కి రావాలి అని ఆహ్వానించారు. ఈ కంపెనీ దేశంలో ఉన్న అన్ని మొబైల్ తయారీ కంపెనీలకు విడిభాగలు సప్లై చేసే అవకాశం ఉంది. సచివాలయంలోని బ్లాక్ 1 లో ఆగస్ట్ 6 వ తారీఖున ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి సమక్షంలో అనంతరం ముఖ్యమంత్రి గ్రీవెన్ హాల్ లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రెస్ మీట్ ఉండబోతుంది. ఈ ప్రెస్ మీట్ లో కంపెనీ ప్రతినిధులు పాల్గొని కంపెనీ ఏర్పాటు వివరాలు ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారుతుంది. ఈ రంగంలో ఇప్పటి వరకూ 20 వేల ఉద్యోగాల కల్పన జరిగింది. మొబైల్ తయారీ దిగ్గజం ఫాక్స్ కాన్ లో 15 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు.మరో పక్క తిరుపతి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో సెల్ కాన్,డిక్సన్ ప్రారంభం అయ్యాయి.త్వరలోనే కార్బన్ కూడా ప్రారంభం కాబోతోంది.రిలయన్స్ జియో సమగ్ర ప్రొజెక్ట్ రిపోర్ట్ తయారు అయ్యింది.125 ఎకరాల్లో జియో మొబైల్స్,ఎలక్ట్రానిక్స్ తయారీ మెగా కంపెనీ త్వరలోనే ఏర్పాటు కాబోతోంది.

ఇటీవల కాలంలోనే ఫ్లెక్స్ ట్రానిక్స్,ఇన్వెకాస్ రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నాయి.అలాగే లిథియం ఐయాన్ బ్యాటరీ తయారీ కంపెనీ మునోత్ కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కి రాబోతుంది...ఈ రంగంలో 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తా అని ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి నారా లోకేష్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.అనేక కంపెనీల ప్రతినిధులను దేశంలోని వివిధ నగరాలు,వివిధ దేశాల్లోనూ,వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులోనూ వివిధ కంపెనీలను కలిసి రాష్ట్రం గురించి వివరించారు.దాని ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి.వచ్చే నెల నుండి ప్రతి నెలా ఒకటి లేదా రెండు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి రానున్నాయి.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా ఉండటం.ఎంఓయూ కన్వెర్షన్ లో దేశంలో నెంబర్ 2 లో ఉండటం వలన ఆంధ్రప్రదేశ్ కి వచ్చేందుకు పెద్ద ఎత్తున కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.... ఇతర రాష్ట్రాల నుండి ఉన్న పోటీ నేపథ్యంలో ఈ కంపెనీ వివరాలు గోప్యంగా ఉంచబడ్డాయి...6 వ తారీఖున ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే కార్యక్రమంలో కంపెనీ వివరాలు వెల్లడించనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read