సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో శనివారం అర్థరాత్రి అపచారం జరిగింది. మంటల్లో స్వామివారి రథం పూర్తిగా కాలిపోయింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి రథాన్ని దుండగులు నిప్పు పెట్టారా..? లేక ప్రభుత్వం చెప్తున్నట్టు తేనెపట్టు గూర్చి పెట్టిన మంట వల్ల దగ్గమైయిందా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రసిద్ది వేవాలయం దక్షిణ కాశీగా వెలుగొందుతున్న అంతర్వేది శ్రీ లక్ష్మీసింహస్వామివారి కల్యాణోత్సవం అనంతరం రథప్తమిరోజున లక్షలాదిమంది భక్తులతో ఆలయం వద్ద నుంచి గుర్రాలక్కమ ఆలయం వరకూ రథోత్సవం జరుగుతుంది. అనంతరం రథాన్ని షెడ్డులో భద్రంచేస్తారు. 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామివారి రథం అర్థరాత్రి సమయంలో కాలిపోవడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి రథం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో స్వామివారి ఆలయం వద్ద దగ్ధమైన రథాన్ని అధికారులు, మంత్రులు, వివిధ రాజకీయ పార్టీ నేతలు చేరుకుని పరిశీలించారు. పోలీసులు అన్ని కోణాల్లో ఈ రధం దగ్ధం పై విచారణ చేస్తున్నారు.

antarvedi 07092020 2

అయితే వివిధ రాజకీయ పక్షాలు, హిందూ సంస్థలు, ఈ ఘటన పై ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయం వద్ద ఉన్న సీసీ కెమేరాలు ఎందుకు పని చేయకుండా ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై ప్రభుత్వం పూర్తి దర్యాప్తు చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన అంతర్వేది లక్ష్మీసనసింహస్వామివారి రథం కాలిపోవడంతో మాజీ మంత్రి, తెలుగుదేశం నేత గొల్లపల్లి సూర్యారావు, మాజీ మంత్రి చినరజాప్ప పరిశీలించారు. జరిగిన ఘటనపై జ్యూడిషియల్ విచారణ చేయాలనీ కోరారు. ఘటన వివరాలు, జరిగిన తీరు పై ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నివేదిక ఇస్తామని అన్నారు. ఇక వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు అయితే, ఈ ఘటన పై కుట్ర కోణం ఉందని నమ్ముతున్నట్టు చెప్పారు. గత ఏడాది కాలంలో ఒక పధ్ధతి ప్రకారం, హిందూ దేవాలయాల పై దాడులు జరుగుతున్నాయని, పిచ్చోడు మంట అంటించాడని ఒకసారు, తేనెతుట్టె అని ఒకసారి చెప్తున్నారని, జరుగుతున్న ఘటనల పై సీరియస్ గా రియాక్ట్ అవ్వాలని అన్నారు. ఇక ప్రభుత్వం, ఆలయ ఈవోని తప్పించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read