కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, నాలుగు రోజుల క్రితం, చంద్రబాబు పై బూతులు తిట్టిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో, తెలుగుదేశం పార్టీ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చరిత్ర ఇది అంటూ, మొత్తం బయట పెట్టింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నేత పంచుమర్తి అనురాధ అనురాధ మీడియాతో మాట్లాడారు. ఆవిడ మాటల్లో... "కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నాలుగురోజుల క్రితం చంద్రబాబునాయుడుగారిని ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడారు. ఆ మాటలను వెనక్కు తీసుకొమ్మని కోరినప్పటికిని వెనక్కి తీసుకోలేదు. ఖర్మకాలి కాకినాడకు ఎమ్మెల్యే అయినప్పటికి ప్రజలకు శాపంగా మారారు. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తనంత నిజాయితీపరుడు లేడని అనుకుంటున్నాడు. అతను అవినీతిపరుడడని తన నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారు. అనపర్తి నుంచి వచ్చి కాకినాడలో దందాలు మొదలుపెట్టిన చరిత్ర నీది. నీ తండ్రి భాస్కర్‌రెడ్డి అనపర్తిలో ఉన్నప్పుడు దొంగ నోట్లు ముద్రించి కాల్‌ మనీ ద్వారా చెలామణి చేశారు. పేద ప్రజల పొట్టగొట్టి, రేషన్‌ షాపుల్లో బియ్యం దొంగతనం చేసి వాటికి పాలిష్‌ పట్టి విదేశాలకు తరలించిన చరిత్ర నీ తండ్రిది. ప్రిన్సిపల్స్‌లను, హెడ్మాష్టర్లను కిడ్నాప్‌ చేసి తెల్ల కాగితాలపై సంతకాలు చేసుకుని వారి ఆస్తిని కాజేసిన చరిత్ర మీది. కాకినాడలోని భానుగుడి సెంటర్‌లో మహేంద్ర స్వీట్‌ స్టాల్‌ యజమానికి కనీసం అద్దెకూడా ఇవ్వకుండా కోటి రూపాయల ఆస్తిని కాజేసిన చరిత్ర నీది.కోటి రూపాయలు ఇవ్వపోగా 70 లక్షల రూపాయలు అతని వద్ద వసూలు చేసిన చరిత్ర నిదికాదా?"

"కార్పొరేషన్‌ దగ్గర నీకున్న కాంప్లెక్స్‌ లో ఎవరు రావటంలేదని రోడ్డు వెడల్పు కోసం వేల కోట్లు నష్టం చేసిన చరిత్ర నీది. భాస్కర కాంప్లెక్స్‌ను పేకాట క్లబ్బుగా మార్చి పేద, మధ్య తరగతి యువత జీవితాలను నాశనం చేసిన చరిత్ర నీది కాదా? అదే కాంప్లెక్స్‌లో ఒక మంత్రిని గన్ను పెట్టి బెదిరించిన విషయం రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. చమురు కంపెనీలకు సంబంధించి పైప్‌లైన్‌ను కట్‌ చేసి నిస్సుగ్గుగా ఆయిల్‌ను దొంగతనం చేసి దాన్ని అమ్ముకుని బతికే మీరు చంద్రబాబునాయుడు గురించి మట్లాడుతారా? మీరు చేసిన దొంగతనాలు, కిడ్నాప్‌లు, దౌర్జన్యాలపై రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో అడిషనల్‌ ఎస్పీ రంగనాధ్‌ను నియమిస్తే ఆనాటి ముఖ్యమంత్రి కొడుకు అయిన జగన్మోహన్‌రెడ్డి అండతో రాజశేఖర్‌రెడ్డి కూడా ఎటువంటి యాక్షన్‌ తీసుకోలేదు. మీకు చంద్రబాబునాయుడు గురించి మాట్లాడే అర్హత లేదు. ఆయన కాలి గోటికికూడా మీరు సమానం కారు. దేవీ-శ్రీదేవి థీయేటర్స్‌ దగ్గర మీరు కట్టిన ఆపార్టుమెంట్‌ పరిస్థితి చెప్పగలరా? ఆ ఆపార్టుమెంటును కొనుగోలు చేసిన వ్యక్తులు తిరిగి డబ్బులు చెల్లించమని అడిగితే పట్టించుకోకుండా రోడ్డున పడేసిన చరిత్ర మీది. కాకినాడ రూరల్‌ ఏరియాలో మీరు చేసే రొయ్యల ఎక్స్‌పోర్ట్‌ పేరుతో అక్రమాలు సాక్షాలతో సహా మేము బయట పెట్టబోతున్నాం. ఇంత నేర చరిత్ర ఉన్న మీరు 40 సంవత్సరాలల్లో ఎటువంటి మచ్చ లేని చంద్రబాబునాయుడు గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. చంద్రబాబునాయుడు పేరు ఉచ్చరించే అర్హత కూడా ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి లేదు. 2004 నుంచి సెక్షన్‌ 147, 323, 506, 186,149 దొమ్మి కేసులు, హత్యాయత్నం కేసులు నీ మీద ఉంటే మీరేదో నీతిమంతుల్లా మాట్లాడుతున్నారు. ద్వారాంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి చెంచాగాళ్లు నలుగురున్నారు. "

"వారిని అడ్డం పెట్టుకుని కాకినాడ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న మీరు చంద్రబాబునాయుడుపై అసభ్యకరంగా మాట్లాడుతారా? మీ చెంచాగాళ్లు గణపతి, అలీషా, కన్నా, ఫ్రూటీకుమార్‌ ఈ నలుగురిని ఆంబోతుల్లా ఊరిమీద వదిలారు. వారు తప్పతాగి జనాలమీద పడ్డారు. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యే స్థాయికి తగరు. ఎమ్మెల్యే సీటు ఎలా వచ్చింది? ఒక దొంగ ముఖ్యమంత్రి దొంగలకే సీట్లు ఇస్తారు. బోట్లల్లో మీరు ఏం షిప్‌ చేశారు? చిన్న చిన్న బోట్లల్లో ఎవరిని షిఫ్ట్‌ చేశారు?తద్వారా ఏ రకంగా ఆయిల్‌ను దొంగతనం చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. వైసీపీ నాయకులు రైతుల త్యాగాలపై కామెంట్‌ చేస్తున్నారు, మీరు మాత్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2,65,000 ఎకరాలు కొట్టేసిన విషయం అందరికి తెలిసిందే. దాని గురించి సమాధానం చెప్పమంటే కుంటి సాకులు చెబుతున్నారు. ఏ-2 విజయసాయిరెడ్డి ఖర్మగాలి రాజ్యసభ సభ్యుడయ్యాడు. ఏ-1 ముద్దాయి జగన్‌ పాపం పంచుకున్నారు కాబట్టి రాజ్యసభ సభ్యులయ్యారు. విజయసాయిరెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రికి సీబీఐ వాళ్లు తనకు నచ్చిన వారిని నియమించమని లేఖ రాస్తున్నారు. ఒక ముద్దాయి ఎవరు కావాలని నిర్ణయించడం చూస్తుంటే మన దేశం ఎక్కడికి పోతోందో అర్థం కావడంలేదు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్‌రెడ్డి అనే చీడ పట్టింది. ఈ చీడ వదిలిన రోజే మళ్లీ మన ఆంధ్రప్రదేశ్‌ బాగుపడుతుంది. నిజంగా ముఖ్యమంత్రి దగ్గర నీతి, నిజాయితీ ఉంటే ముందు కోర్టుకు వెళ్లాలి. నిస్సుగ్గుగా మొన్న రెండు గంటలు కూర్చున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఒక రౌడీ షీటర్‌ అని తన నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్ని చోట్ల రాష్ట్రమంతటా దందాలు చేస్తున్నారు. అతను క్యారక్టర్‌ లేని వ్యక్తి. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి జగన్మోహన్‌రెడ్డికి బినామీ." అంటూ అనురాధ ధ్వజమెత్తారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read