ఏడుకొండలస్వామి కొలవైన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారానికి ఏడు జాతిరత్నాలు దిగబడ్డాయి. పేకాడితే ఎవడమ్మ మొగుడు వచ్చి పీకుతాడు అనే మంత్రి, క్రికెట్ బెట్టింగ్ లో ఆరితేరిన ఒక నీటిపారుదల శాఖ మంత్రి , ఎర్ర చందనం స్మగ్లింగ్ -అక్రమ నోట్ల దొంగ రవాణాలో అడ్డంగా దొరికిపోయిన మంత్రి, రబీకి-ఖరీఫ్ కి తేడా తెలీని మంత్రి , అతనికి శ్రమ లేదు రాష్ట్రానికి ఒక పరిశ్రమ లేదు, పరిశ్రమ తీసుకొచ్చే పరిస్థితి లేని మంత్రి , మధ్యాహ్న భోజనంలో గుడ్లు ఏమయ్యాయి అని ప్రతిపక్షం ప్రశ్నిస్తే గుడ్లు తెలేసే మంత్రి, స్మగ్లర్ల ను పట్టుకోకుండా కొయ్యబొమ్మలా చూస్తున్న మంత్రి...ఇలా ఒక్కోరు ఒక్కో నియోజకవర్గానికి ఇన్ చార్జ్ మినిస్టర్లుగా వ్యవహరించడానికి దందారాయుళ్లు బయలుదేరారు. ఈ జాతిరత్నాలు ఒక చోట చేరి కులం, మతం పేరుతో ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. వెంకటేశ్వర స్వామి కొలువుండే చోట ఎలాంటి దౌర్బాగ్యం పట్టిందో చూడండి. ప్రకాశం జిల్లాలో మైనింగ్ హస్తగతం చేసుకుని తన కొడుకును అడ్డం పెట్టుకుని కోట్లు కొల్లగొడుతున్న అటవీశాఖ మంత్రి ఓట్లు అడిగేందుకు వెంకట గిరి వెళ్లారా? అదేమంటే ముఖ్యమంత్రి బంధువునంటున్నారు. మీకు ఓటు అడిగే హక్కు ఉందా? కరోనా బారిన పడి పిల్లలు విలవిలలాడుతుంటే పాఠశాలల్లో ఒక్క సారైనా సమీక్ష చేయని విద్యాశాఖమంత్రి సర్వేపల్లిలో ప్రచారం చేయడమేంటి? నాడు-నేడులో అవినీతిపై స్పందించారా? విద్యాశాఖలో ఓ అధికారిని ప్రకాశం జిల్లా కలెక్టర్ తొలగిస్తే అతన్ని డైరెక్టరుగా పెట్టుకోవడమా మీ చిత్తశుద్ధి. సత్యదూరమైన వ్యక్తి , బూతులు మాట్లాడే వ్యక్తి, పేకాట క్లబ్బులు నడిపే మంత్రి సత్యవేడు ఎందుకు వెళ్లినట్టు? చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమలను తరిమికొట్టిన పరిశ్రమల మంత్రి వెంకటగిరిలో ప్రచారం చేయడం సిగ్గుచేటు.

anuradha 07042021 2

కియా మోటార్స్ లో సంబంధిత మంత్రి, బంధువులు స్క్రాప్ అమ్ముకుని రోజూ లక్షలు దోచుకుంటుంటే ఆపే ప్రయత్నం చేశారా? రిలయన్స్ చెప్పిన వారికి రాజ్యసబ సభ్యత్వం ఇచ్చారే ..మరి దానికి బదులుగా తిరుపతిలో ఒక పరిశ్రమనైనా పెట్టమని అడగ్గలిగారా? తూర్పుగోదావరి జిల్లా శివారు ప్రాంతంలో నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే ఆ విషయంలో పట్టించుకోని వ్యవసాయమంత్రి ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లారా? చంద్రబాబు గారు అసెంబ్లీలో పోరాడితేనే పంట నష్టం బీమా కట్టిన వ్యవసాయ మంత్రి నేడు స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు.
టీడీపీ హయాంలో 71 శాతం పోలవరం పూర్తి చేశాం. దాన్ని రెండేళ్లలో ఒక్క శాతం ముందుకు తీసుకెళ్లని నీటిపారుదల శాఖ మంత్రి గూడూరులో ఏం ప్రచారం చేస్తారు? పోలవరం మట్టిని కూడా అమ్ముకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వం క్రికెట్ బెట్టింగ్ లో పట్టుబడ్డ మంత్రి గూడూరును ఉద్దరించడానికి వెళ్లారా? సాక్షికి కోట్లు రూపాయిల యాడ్లు ఇవ్వడంపై ప్రత్యిక్షంగా మేము ప్రశ్నిస్తే మంత్రి పేర్లి నాని సమాధానం చెప్పలేకపోయారు. పింక్ డైమండ్ పోయిందని సాక్షిలో తప్పుడు రాతలు రాశారు. కోర్టులు మొట్టికాయలు వేసినా సిగ్గురాలేదు. ఒక మంత్రిగా స్పందించని పేర్ని నాని తిరుపతిలో ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలకు అంతే లేదు. బెదిరింపులు, దౌర్జన్యాలతో దందాలు చేస్తున్నారు. చిత్తూరులో గ్రానైట్ వ్యాపారులను బెదిరించి వసూళ్లు చేస్తున్నారు. వైసీపీ మంత్రుల బెదిరింపులకు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు భయపడొద్దు. వైసీపీ కార్యకర్తలకు భయపడొద్దు. తెలుగుదేశానికి ఓటేసి నిజాన్ని బతికించండి. వైసీపీని ఓడించి బుద్ది చెప్పడి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read